Home News హిందుత్వంపై దాడి చేయడమే లౌకికవాదమా ?

హిందుత్వంపై దాడి చేయడమే లౌకికవాదమా ?

0
SHARE

దక్షిణ భారతానికి కొత్త జబ్బు ఒకటి పట్టుకుంది. కేవలం హిందువులను, హిందూత్వాన్ని దూషించడమే లౌకికవాదం అనుకునే జబ్బు అది. ఇలా హిందు త్వంపై విషం కక్కుతూ తాము లౌకికవాదులమని కొందరు మేధావులు కలలు కంటున్నారు. మొన్నటికి మొన్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హిందువులను తీవ్రవాదులు అని సంబోధించగా, నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రధాని మోదిని, హిందువులను తీవ్రంగా దూషించాడు. 2జి కేసులో జైలుకు వెళ్ళిన కనిమొళి నిన్నటికి నిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామిని దూషించింది. అయినప్పటికీ వీరంతా ఇక్కడ హాయిగా తిరగ గలుగుతున్నారంటే అది హిందువుల మంచి తనమే. అదే ఇంకో మతంలోనో, ఇంకో దేశంలోనో ఇలా దైవదూషణ చేసి హాయిగా తిరగ గలరా!

ఈ నకిలీ లౌకికవాదులు హిందువులపై దాడినే లౌకికవాదం అనుకుంటున్నారు. హిందువులు మెజారిటీగా ఉన్న కాలంలోనే ఈ దేశంలో లౌకిక వాదం వర్ధిల్లింది. హిందువులు మైనారిటీకి పడిపోయి నప్పుడు ఆయా ప్రాంతాలలో లౌకికత్వం కనుమరుగై హిందుత్వం కూడా కనబడకుండా పోయింది. దీనికి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు మంచి ఉదాహరణ. ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్న కాలంలో ఎలాంటి ఘర్షణలు లేవు. ఎప్పుడైతే ముస్లిం జనాభా 50 శాతం దాటిందో అప్పుడు వారు ఆయా భూభాగాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని ప్రత్యేక దేశంగా మార్చు కున్నారు. భారతదేశాన్ని చీల్చి ఏర్పాటు చేసిన ఈ కొత్త దేశాల్లో హిందువుల జనాభా మొదట్లో 30-40 శాతం వరకూ ఉండేది. క్రమంగా ముస్లిం దాడులతో వారిలో చాలామంది మతం మార్చుకోవడమో, దాడిలో చనిపోవడమో, భారత్‌కు వలస రావడమో జరిగింది.

ఇప్పుడు ఈ విషయాలను ఎందుకు ప్రస్థా వించాల్సి వచ్చిందంటే భారత్‌లో అలాంటి మినీ పాకిస్థాన్‌లు ఇప్పుడు పలు చోట్ల ఆవిర్భవిస్తున్నాయి. లౌకికవాద ముసుగులో ఇస్లామిక్‌ రాజ్యాన్ని స్థాపించ డానికి ముస్లిం వేర్పాటువాద గ్రూపులు ఆహర్నిశం పాటుపడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, సెక్యులర్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో సంస్థలను ఏర్పాటుచేసి హిందువులకు, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మొదట్లో సిమి పేరుతో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన ఈ అతివాద ఇస్లాం గ్రూపులు సిమిపై నిషేధంతో పేరు మార్చుకొని దక్షిణాదిలో పాగా వేశాయి.

కేరళ, కర్ణాటక తీరప్రాంత జిల్లాలు

కేరళ, కర్నాటక తీర ప్రాంత జిల్లాల్లో జనాభా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. హిందువుల జనాభా గణనీయంగా తగ్గడం, ముస్లింల దాడులతో హిందువులు భయభ్రాంతులకు గురై ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. కేరళలో ముస్లింల ఉనికి ఎప్పటి నుంచో ఉంది. అరబ్బు వ్యాపారులు హిందూ రాజులతో వ్యాపారం కోసం కేరళ తీరానికి వచ్చి మత వ్యాప్తి చేశారు. తర్వాత భారతదేశంలో ఇస్లాం రాజ్యాల స్థాపనతో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరిగి వారి జనాభా పెరిగింది.

కేరళలో హిందువుల జనాభా 54 శాతంగా ఉంది. ముస్లింలు 27 శాతం, క్రైస్తవులు 18 శాతం ఉన్నారు. మొత్తం 14 జిల్లాల్లో 7 జిల్లాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉంది. మలప్పురంలో 71, కోజికోడ్‌లో 40, కాసర్‌గోడ్‌లో 38, కన్నూరులో 30, పాలక్కడ్‌లో 29, కాయినాడ్‌లో 29, కొల్లాంలో 20 శాతం ముస్లింలు ఉన్నారు. 1901లో 70 శాతంగా ఉన్న హిందువులు 1951 నాటికి 61 శాతానికి పడిపోయారు. 2001లో 58 శాతానికి, 2011లో 54 శాతానికి హిందూ జనాభా పడి పోయింది. 2050 నాటికి 50 శాతానికి పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. కేరళలో హిందూ జనాభా భారీగా పడిపోవడానికి మొదటి కారణం మత మార్పిడులు. 1921లో కేరళలో ఖిలాఫత్‌ ఉద్యమ నేపథ్యంలో ముస్లిం మోప్లాలు హిందువుల ఇళ్ళపై దాడులు జరిపి, హిందూ స్త్రీలపై అత్యాచారాలు జరిపి వారిని బలవంతంగా మతమార్పిడి చేశారు. మతమార్పిడులకు అంగీకరించని లక్షల మందిని వారి ఇళ్ళ నుంచి గెంటివేశారు. మోప్లాల ఈ అరాచకాలు 1921 కంటే ఎంతో ముందుగానే టిప్పు సుల్తాన్‌ కాలంలోనే ఆరంభమయ్యాయి. ఎందరో హిందువు లను ముస్లిం మోప్లాలు బలవంతంగా ఇస్లాంలోకి మార్చి అక్కడి ఆలయాలను కూల్చివేశారు. ఇలాంటి నరహంతక మోప్లాలను బ్రిటిష్‌ ప్రభుత్వం తుపాకులతో కాల్చివేసి మలబార్‌ మోప్లాల అల్లర్లను అణచివేసింది.

స్వాతంత్య్రానంతరం 1970లలో కేరళలో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం ముస్లింలీగ్‌తో పొత్తుపెట్టుకొని మోప్లాలను స్వతంత్ర సమరయోధులుగా ప్రకటించింది. ముస్లిం మెజారిటీతో మలప్పురం జిల్లాను ఏర్పాటుచేసింది. కేరళ ఉత్తర ప్రాంతంలోని ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఆధ్వర్యం లోని యుడిఎఫ్‌, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని ఎల్‌డిఎఫ్‌లు ఎప్పటికప్పుడు మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ వేర్పాటువాదులను పెంచి పోషించాయి. లవ్‌జిహాద్‌ పేరుతో ముస్లింలు హిందు, క్రైస్తవ అమ్మాయిలను చెరబట్టి బలవంతపు మతమార్పిడు లను ప్రోత్సహిస్తున్నారు. వీరికి పిఎఫ్‌ఐ, ఎస్‌డిపిఐలు మద్దతు ఇవ్వడమే కాకుండా లవ్‌జిహాద్‌ను వ్యతిరేకించినవారిని హతమార్చుతున్నాయి. అటుపక్క తీరప్రాంత కన్నడ రాష్ట్రంలో కూడా ముస్లిం వేర్పాటు వాదులు హత్యలు, కిడ్నాపులకు పాల్పడుతున్నారు. ఇటీవల కేరళ హిందువులలో, క్రైస్తవులలో చైతన్యం వచ్చింది. అయితే ఈ ముస్లిం అతివాద గ్రూపుల గురించి ప్రజలను చైతన్యపరుస్తున్న వారిని తీవ్రవాదులు దారుణంగా హతమార్చుతున్నారు. ఇలాంటి ఘటనలు కేరళ, కర్ణాటకలలో తరచుగా చోటుచేసుకుంటున్నాయి. లవ్‌జిహాద్‌కు వ్యతిరేకంగా అమ్మాయిల తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హదియాగా మారిన అఖిల అనే హిందూ అమ్మాయిని తీవ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న షఫిన్‌ జహాన్‌ పెళ్ళి చేసుకోవడంతో ఆమె తండ్రి అశోకన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అశోకన్‌ భారత సైన్యంలో పనిచేసినవాడు. అఖిల కోయం బత్తూరులో ¬మియోపతి మెడిసిన్‌ చదువుతోంది. అఖిలను ట్రాప్‌చేసిన జహాన్‌ ఐఎస్‌ సానుభూతి పరుడు. అఖిల పేరును హదియాగా మార్చి సిరియాకు పంపడానికి కుట్రపన్నాడని అశోకన్‌ ఆరోపిస్తున్నారు. అసలు ఎక్కడా పరిచయంలేని వీరి మధ్య ప్రేమ పుట్టడం అనేది లవ్‌జిహాద్‌ కాక మరేమిటి? కర్ణాటకలో గత పదేళ్ళలో దాదాపు పదివేల లవ్‌ జిహాద్‌ కేసులు నమోదైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్‌ వేర్పాటువాదులను ధైర్యంగా ఎదుర్కొంటున్న హిందూ సంస్థలను నిర్వీర్యం చేయడానికి వీరు కమ్యూనిస్టులు, కాంగ్రెసువారితో చేతులు కలిపి లౌకికవాద ముసుగులో ప్రజల ముందుకు వస్తున్నారు. వీరి విషయంలో హిందువులు జాగరూకతతో ఉండాలి.

కేరళలో ఇస్లామ్‌ తీవ్రవాద వర్గాలు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో ఒక ప్రయివేటు ఇస్లామిక్‌ సైన్యాన్ని తయారుచేశాయి. అదే తరహాలో వీరు ఎస్‌డిపిఐ ను కూడా ఏర్పాటుచేసి; హిందుత్వ వ్యతిరేకులు, నాస్తికులు, కమ్యూనిస్టులను కూడగట్టుకొని లౌకికవాదం పేరుతో హంగామా చేస్తున్నారు. వారు షెడ్యూల్డు కులాల వారిని ఇస్లాం మతంలోకి మార్చడానికి కుట్రలకు తెరలేపుతున్నారు. కేరళలో పాఠశాలల్లో జాతీయ గేయం వందేమాతరాన్ని పాడటాన్ని పాపులర్‌ ఫ్రంట్‌, సెక్యులర్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. భారతదేశ గాలి పీలుస్తూ, ఇక్కడి తిండి తింటూ ఈ దేశాన్ని ప్రేమించని వీరిని ఏమనాలి ?

భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయడానికి వీరి శక్తి సరిపోదని వీరు గుర్తించాలి. అందుకు చరిత్రే సాక్ష్యం. హిందుత్వం ఎప్పటికప్పుడు సంస్కరణలను స్వీకరిస్తూ ప్రపంచానికి శాంతి, ప్రేమను పంచుతోంది. హిందువులు చైతన్యవంతులైతే వీరి ఆటలు సాగవు. ఎప్పుడూ హిందుత్వం మీద దాడిచేసి అదే లౌకికవాదం అనుకుంటున్నారు వీరు. రాజ్యాంగంలో ప్రస్తావించిన ‘అందరికి సమ న్యాయం’ విషయం లోనూ, ‘ట్రిపుల్‌ తలాక్‌’ విషయంలోనూ ఈ నకిలీ లౌకిక వాదులు ఓటు బ్యాంకు రాజకీయాలకు లోనై, పలాయనం చిత్తగించారు. 2012లో హజ్‌ రాయితీని ఎత్తివేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెబితే, దాన్ని ప్రస్తుత మోది నేతృత్వంలోని ప్రభుత్వం అమలుపరిస్తే దానిపై పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. హిందువులకు రాయితీలిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. దేశంలో కేవలం హిందువుల ఆలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. హిందువులు భగవంతుని దర్శించుకోవడానికి డబ్బులు చెల్లించాలి. ఇలా వేల కోట్ల రూపాయలను జిజియా లాంటి మత పన్నులాగా హిందువులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ఈ విషయాన్ని ఏ లౌకికవాదీ ప్రశ్నించడు. మోదీ హజ్‌ రాయితీని ఎత్తివేసి ఆ మొత్తానికి మరింత జతచేసి ముస్లిం బాలికల ఉపకారవేతనాలకు కేటాయించుతున్నారు. ఈ విషయంపై సంతోషం వ్యక్తపరచడం కూడా వీరికి చేతకాదేమో !

ఇక కర్ణాటక విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం హిందువులను తీవ్రవాదులుగా పేర్కొంటూ తీవ్ర విమర్శలు చేసింది. నోటి దురుసుతో హిందువులను తిట్టే సిద్ధరామయ్య తన సహజ నైజాన్ని మరోమారు బయటపెట్టాడు. విద్రోహ సంస్థల దాడిలో పదుల సంఖ్యలో హత్యకు గురైన బిజెపి, ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలని, విద్రోహ సంస్థలను నిషేధించాలని ఉద్యమిస్తే, సిద్ధరామయ్య విద్రోహ సంస్థలకు మీటింగులు పెట్టుకోడానికి అనుమతిచ్చాడు. తనే స్వయంగా హిందూ సంస్థలను తీవ్రవాద గ్రూపుల గాడిన కట్టాడు. గతంలో ఆవు మాంసం తింటానని బహిరంగంగా ప్రకటించిన ఈయన హిందువుల మధ్య చిచ్చుపెట్టడానికి వీరశైవులను ప్రత్యేక మతంగా గుర్తించాలని ప్రకటనలు చేస్తూ వారిని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. హిందువులను ఊచకోత కోసిన టిప్పు సుల్తాన్‌ ఉత్సవాలను నిర్వహించి, ముస్లిం ఓట్లను పొందాలని చూస్తున్నాడు. ఉత్తర కన్నడ, శివమొగ్గ, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. దీనికి తోడు నాటి నిజాం రాజ్య ప్రాంతాలైన కన్నడ జిల్లాల్లో కూడా వేర్పాటువాదులకు బలమైన పునాదులు ఉన్నాయి. ఈ ప్రాంతాలను కలిపి ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చడానికి వారు కృషి చేస్తున్నారు.

దేశంలో ఎక్కడ తీవ్రవాద దాడులు జరిగినా దక్షిణాదికి సంబంధం ఉంటోంది. కరడు గట్టిన ఉగ్రవాది రియాజ్‌ భత్కల్‌ కర్ణాటకకు చెందినవాడే. వేర్పాటువాదులు బలపడుతున్నారని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నా, సిద్ధరామయ్యలాంటివారు స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. ఇదివరకు బాంబు పేలుళ్ళకు పాల్పడిన సంస్థలు లౌకికవాద ముసుగుతో మళ్లీ దాడులకు సిద్ధమౌతున్నాయి. తీవ్రవాద సంస్థ రూపంలో ఉంటే దాన్ని ప్రభుత్వం వెంటనే అణచి వేస్తుంది. అందుకు ప్రతిగా వారు లౌకికవాద గ్రూపుల పేరుతో నాస్తికులు, హిందూ వ్యతిరేకులు, కమ్యూ నిస్టులతో జట్టు కట్టి హిందువులపై, భారతదేశంపై దాడికి తయారవుతున్నారు. దేశాన్ని నాశనం చేసే ఇలాంటి లౌకికవాదుల అవసరం మనకు ఎంత మాత్రం లేదు.

కాంగ్రెస్‌ ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక శిఖండి రూపంలో కులవాదులను, నకిలీ లౌకిక వాదులను ఉసిగొలుపుతోంది. ఈ ప్రయోగం గుజరాత్‌ ఎన్నికల్లో విఫలమైంది. మరోమారు ఇదే ప్రయోగాన్ని కర్ణాటక ఎన్నికల సందర్భంగా బయటకు తీస్తున్నారు. హిందువులారా తస్మాత్‌ జాగ్రత్త. వారు ఇప్పటికే జిన్నా వారసులతో ఒప్పందం చేసుకున్నారు. హిందువులను బలిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికైనా హిందువులంతా ఏకమై ఎక్కడికక్కడ ఈ నకిలీ లౌకికవాదులను ఎదుర్కొని దేశాన్ని రక్షించాలి. లేకపోతే సిద్ధికీ దీన్‌దార్‌ లాగా తాము బసవలింగని అవతారం అని ఈ నకిలీ లౌకిక వాదులు చెప్పుకొనే ప్రమాదం ఉంది.

– యు.ఆర్‌.సి.రెడ్డి

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here