Home News వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తో ఎంతో మేలు : రైతు హ‌ర్షం 

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తో ఎంతో మేలు : రైతు హ‌ర్షం 

0
SHARE

   కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకువ‌చ్చిన నూత‌న వ్య‌వ‌సాయం  చ‌ట్టాల‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ రైతులు ఆందోళన ప్రారంభించినప్పటికీ, ఈ చట్టాలు తమకు ఎలా ప్రయోజనం చేకూర్చాయో వివరించడానికి అనేక మంది రైతులు ముందుకు వ‌స్తున్నారు. త‌మ‌కు ఎంతో మేలు చేస్తోంద‌ని రైతులు త‌మ హ‌ర్షాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. “మహారాష్ట్రలోని ధూలేలోని జితేంద్ర భోజీ అనే రైతు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టం వ‌ల్ల తాను పొందిన లాభాన్ని గురించి ఒక మీడియా సంస్థ‌కు వెల్ల‌డించారు. “నేను మొక్క జొన్న పంట వేశాను.  నా పంటను అమ్ముకోవడానికి ఒక ద‌ళారిని ఆశ్ర‌యించ‌గా అత‌ను న‌న్ను మోసం చేశాడు. నూత‌న వ్య‌సాయ చ‌ట్టం ప్ర‌కారం నేను సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌గా వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్నారు.  ఈ చ‌ట్టం ద్వారా రైతుల‌కు ఇలాంటి సదుపాయం క‌ల్పించ‌డం వ‌ల్లే ఎలాంటి న‌ష్టం లేకుండా నేను అనుకున్న ధ‌ర‌కు పంట‌ను అమ్ముకోగ‌లిగాను” అని రైతు త‌న హర్షం వ్య‌క్తం చేశాడు.

         ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని మోడీ  ‘మ‌న్ కీ బాత్’ కార్యక్ర‌మంలో ప్ర‌స్త‌వించారు. జీతేంద్ర భోజీ అనే రైతు ద‌ళారుల చేతిలో మోస పోగా వ్య‌వ‌సాయ చ‌ట్టం ప్ర‌కారం రూ.3.32 లక్షలు తిరిగి పొందార‌ని మోడీ అన్నారు. వ్యవసాయ బిల్లులు ఆమోదించిన తర్వాత రైతులు త‌మ పంట‌ల‌ను సరైన ధరలకు విక్రయించుకోవాల‌ని నిర్ణయించుకుంటున్నార‌ని అన్నారు.  ఈ సంస్కరణలు రైతులకు ద‌ళారులు వేసిన సంకెళ్ళను విచ్ఛిన్నం చేయడమే కాకుండా వారికి కొత్త హక్కులు, అవకాశాలను కూడా క‌ల్పిస్తున్నాయ‌ని మ‌న్ కీ బాత్‌లో మోడీ అన్నారు.
Watch : వ్యవసాయ బిల్లుల మీద వివాదం ఎందుకు..