Home News జమ్మూ కాశ్మీర్‌: ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్ర‌వాదుల హ‌తం

జమ్మూ కాశ్మీర్‌: ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్ర‌వాదుల హ‌తం

0
SHARE

జమ్ముకశ్మీర్‌లో తెల్లవారుజామున భారీ ఎన్‎కౌంటర్ జరిగింది. రెండు చోట్ల వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదురుగు ఉగ్రవాదులను భార‌త భ‌ద్ర‌త ద‌ళాలు హ‌తం చేశాయి. జమ్ము కశ్మీర్‎లోని అవంతిపొరా జిల్లా త్రాల్‌లోని నౌబాగ్‌ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలతో పాటు కశ్మీర్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ స‌మ‌యంలో వారిపై ఒక్కసారిగా ఉగ్ర‌వాదులు కాల్పులు ప్రారంభించారు. వెంట‌నే స్పందించిన భారత భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులతో ఉగ్ర‌వాదులకు ధీటుగా బ‌దులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందినట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి వుందని కశ్మీర్ జోన్‌ పోలీసులు వెల్లడించారు.

అంత‌క‌ముందు గురువారం నాడు షోపియాన్ జిల్లాలోని ఒక మ‌సీదులో అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (ఎ.జి.యు.హెచ్) ఉగ్రవాద సంస్థ‌కు చెందిన‌ ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో.. ఉగ్ర‌వాదుల‌పై భద్రతా దళాలు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్ర‌వాదులు చ‌నిపోయిన‌ట్టు భ‌ద్ర‌తా సిబ్బంది వెల్ల‌డించింది. గాలింపు చ‌ర్య‌లు ఇంకా కొన‌సాగుతున్న‌ట్టు పోలీస‌లు తెలి‌పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here