Home News ఇందూరు జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన స్వతంత్ర ఉద్యమం

ఇందూరు జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన స్వతంత్ర ఉద్యమం

0
SHARE

మన దేశం స్వరాజ్యం సాధించడానికి ఎందరెందరో వీరులు తమ జీవితాలను ఘనంగా పెట్టి పోరాటం సాగించారు దేశమంతటా పల్లే పట్నం ఊరు వాడ చిన్నాచితకా పురుష మహిళా బాల వృద్ధా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వతంత్రం కోసం నిప్పు కణికలై ఎగిరి పడ్డారు. అగ్గి బరాటాలై తెల్లవాని వెన్నులో వణుకు పుట్టించారు. ఇలాంటి వీరోచిత పోరాటాలకు ఇందూరు జిల్లా కూడా వేదికగా మారింది అలాంటి వీరులను ఆ సంఘటనలను ఒకసారి స్మరించుకోవడం స్వతంత్ర అమృతోత్సవాల వేళ మన కర్తవ్యం

రాజా దీప్ సింగ్ గౌర్ 

దేశమంతటా 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరుగుతున్న వేళ ఇందూరు జిల్లాలోని కౌలాస్ సంస్థానానికి రాజా దీప సింగ్ గౌర్ అధిపతిగా ఉన్నారు. మీరు నిజామును కలిసి 1857 స్వతంత్ర పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరితే నైజాం నవాబు వినలేదు సరి కదా బ్రిటీష్ వారికే మద్దతు పలికాడు వెంటనే దీప సింగర్ అనేకమంది జాగీర్దారులను, దేశముఖ్ లను సైనిక ప్రముఖులను కలుపుకొని ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు దీనికి స్వతంత్ర సమరయోధుడు నానాసాహెబ్ పీష్వా తోడ్పాటు లభించింది అందరూ కలిసి ఒకేసారి బ్రిటిష్ రెసిడెన్సి పైకి దాడి చేయడానికి బయలుదేరారు కానీ మధ్యలో చాలామంది జాగీర్దారులు మోసం చేసి జారుకున్నారు అయినా పట్టు విడవని దీప సింగ్ గౌర్  పోరాటానికి ముందుకు కదిలాడు ఇది గమనించిన రెసిడెంట్ నైజాం సైనికులతో కలిసి వచ్చి వీరితో పోరాటానికి దిగాడు ఇందులో ఎందరో వీరులు నెలకొరికారు రాజా దీప సింగ్ ను అరెస్ట్ చేసి అండమాన్ జైలుకు పంపారు ఆ జైల్లోనే దీప సింగ్ అంతిమ శ్వాస వదిలాడు ఇలా ప్రథమ స్వతంత్ర సంగ్రామం లో దేశమాత స్వేచ్ఛ కొరకు ఇందూరు నుండి ఒక కాంతిపుంజం భరతమాత పాదాల చెంత వాలిపోయింది.

బాలకృష్ణ మహారాజ్

వీరు ఇందూరు జిల్లాలోని కుస్తాపూర్ గ్రామ వాస్తవ్యులు స్వతంత్ర పోరాటంలో భాగంగా నానాసాహెబ్ పీష్వా కు ఆశ్రయమిచ్చారు కొన్ని నెలలు వీరి ఇంటిలో నానాసాహెబ్ ఆశ్రయం పొందిన అనంతరం నైజాం నవాబు గూఢచారులు విషయం పసిగట్టడంతో పీష్వా తాను మహారాజ్ ఇంటి నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు కానీ పోలీసులు బాలకృష్ణ మహారాజును పట్టుకొని చిత్రహింసలు పెట్టారు ఆ చిత్రహింసలకు బాలకృష్ణ మహారాజ్ తనువు చాలించాడు కానీ నానాసాహెబ్ యొక్క ఆచూకీ చెప్పలేదు ఇలా దేశమాత స్వేచ్చకై రాలిన మరో పుష్పం బాలకృష్ణ మహారాజ్

ఆర్య సమాజ సత్యాగ్రహం

ప్రథమ స్వతంత్ర పోరాటం అనంతరం 1934లో ఇందూరులో ఆర్య సమాజం  పురుడు పోసుకున్నది అదే సమయంలో ఒక ముస్లిం చేసిన గోహత్యకు నిరసనగా ఆర్య సమాజీకులు సత్యాగ్రహం నిర్వహించారు అప్పుడు అందులోని ముఖ్యమైనటువంటి రాధాకృష్ణ మోదాని మాణిక్ రెడ్డి గడియారం సాంబయ్యలను నైజాం పోలీసులు అరెస్టు చేశారు వీరిని వినాయక రావు విద్యాలంకార్ గారు కోర్టు కేసు వాదించి విడిపించారు

రాధాకృష్ణ మోదాని

వీరి ఇందూరు నగరంలో ఆర్య సమాజ స్థాపనలో ఒకరు వీరు గోరక్ష కోసం సత్యాగ్రహం కూడా చేశాను రెండుసార్లు అరెస్టయి జైలుకెళ్లారు ప్రజల్లో స్వతంత్రేయను రగిలించుటలో ముందున్నారు చివరికి ఒక అరబ్బు వాడు పోలీస్ స్టేషన్ ముందు కత్తితో పొడిచి చంపాడు వీరి హత్యకు నిరసనగా ఇందూరు నగరం ఆరోజు మూడు రోజుల బంద్ పాటించింది అంటే వీరి ప్రభావం ఎంతో మనకర్ధమవుతుంది దీప సింగ్ గౌడ్ బాలకృష్ణ మహారాజుల తర్వాత స్వతంత్రం కోసం తనువు చాలించిన మరో మహనీయుడు రాధాకృష్ణ మోదాని

నల్ల నరసింహారెడ్డి

ఇందూరు గడ్డన పుట్టిన మరో వీర నల్ల నరసింహారెడ్డి వీరు ఆర్య సమాజా నాయకులు నల్ల రుక్మారెడ్డి తమ్ముడు అన్న ప్రేరణతో నైజాం వ్యతిరేక పోరులో చురుకుగా పాల్గొన్నారు 1946లో హిందువులు ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఎందరో గ్రామాన్ని వదిలి శిబిరాల్లో నివసించారు ఆ ప్లేగు బాధితులకు సేవ చేయడానికి నల్ల నర్సింహారెడ్డి అక్కడికి వచ్చాడు అక్కడ లేపు బాధితులకు సేవ చేస్తున్న ఆర్యసమాజికులు ఒకరోజు సదస్సును నిర్వహిస్తుంటే రజాకా రాక్షస మొక్క చెలరేగి శిబిరాల్లో ఉన్న గుడిసెలకు నిప్పు పెట్టింది వెంటనే నల్ల నరసింహారెడ్డి అనుచరులు ఆ నిప్పును ఆర్పే పనిలో ఉండగా ఒక రజాకర్ వీరిని వెనక నుండి కత్తితో పొడవడానికి రాగా వెంటనే వాని పీక పిసికి తాను చంపివేసి తాను పేరుకే కాదు నిజంగానే నరసింహుడిని అని నిరూపించుకున్నారు నల్ల నరసింహారెడ్డి అదే సమయంలో ఇంకొక రాక్షసుడు వీరిని వెనక నుండి కాల్చగా భరతమాత పాదాల చెంత తనవును అర్పించారు ఈ హత్యకు నిరసనగా ఎన్నో హర్తాల్లు  ప్రదర్శనలు నైజాం రాజ్యమంతటా జరిగాయి ఇది ప్రజల్లో గొప్ప చైతన్యానికి నాంది పలికింది

త్రయంబకరావు పాఠక్,  దత్తోపంత్ నాయక్

హిందువులపై రజాకార్ల దుశ్చర్యలకు రగిలిపోయిన త్రయంబకరావు పాఠక్ తన భార్య నగలను అమ్మి మిలటరీలో పనిచేసే దత్తోపంత్ నాయకుతో కలిసి మందు గుండు సామాగ్రిని ఇందూరుకు తెచ్చారు దానితో ఇందూరు నగరంలో గల దత్తోపంత ఇంటిలో బాంబులు తయారు చేయడం మొదలుపెట్టారు ప్రమాదవశాత్తు ఒక బాంబు ఇంటిలోనే  పేలగా దత్తోపం అక్కడికక్కడే తనువు చాలించారు పోలీసులు వచ్చి త్రయంబకరావును అరెస్టు చేసి జైల్లో ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు ఇలా ఒక తల్లి భారతి స్వేచ్ఛ కొరకు తనువునీయగా, ఇంకొకరు జైలు శిక్షను చిత్రహింసలను ఆనందంగా స్వీకరించిన ధీమంతులు ఈ వీరులు

దద్దరిల్లిన ఖిల్లా జైలు

ఇందూరు నగరంలోని ఖిల్లా జైలు నైజాం వ్యతిరేక పోరాటానికి స్వాతంత్ర ఉద్యమ చరిత్రకు ప్రత్యక్ష సాక్షిభూతం ఇక్కడ ఆనాడు మహాకవులుగా హాసిల్లిన డాక్టర్ దాశరథి వట్టికోట ఆల్వార్ స్వామి వెంకట రమణయ్య వంటి ఎందరెందరో ఉద్దండులతో జైలు నిండిపోయింది 1948 జనవరి 11వ తేదీన ఆ జైలులో 150 మంది ఖైదీలతో కలిసి వీరంతా ఒకేసారి వందేమాతర గీత మాలాపిస్తుంటే ఇద్దరు ముస్లిం ఖైదీలు అడ్డుపడ్డారు అప్పుడు వీరంతా వందేమాతర గీతం మా దేశ గీతం దీన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ జైలుకు వార్డెన్ కు ఫిర్యాదు చేసి వారి అనుమతితో గీతాలాపన కొనసాగించారు ఆ ఇద్దరు ముస్లింలు వ్యతిరేకిస్తుండగా హఠాత్తుగా జైలులోని నాలుగో నంబర్ బ్యాక్ తెరుచుకున్నది అందులోనుండి ముస్లిం ఖైదీలు లాఠీలతో పలుకు గొట్టాలతో రావడం వందేమాతర గీతం ఆలపిస్తున్న వారిపై విరుచుకు పడడం జరిగింది ఇదే సమయంలో జైలు వార్డెన్లు పోలీసులు బయట వారు ఒకేసారి చొచ్చుకువచ్చి వందేమాతర గీతం ఆలపిస్తున్న వారిపై విచక్షణారహిత క్రూరమైన దాడిని చేశారు ఎందరెందరో తలలు పగిలి రక్తం ఏరులై పారింది 150 మంది తీవ్రంగా గాయపడ్డారు కానీ వందేమాతర గీతం తో జైలు గోడలు దద్దరిల్లాయి అది వారి దేశభక్తి ఇది ఇందూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘటన

దమ్మయ్య గారి నారాయణరెడ్డి

దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున 15 ఆగస్టు 1947 రోజు నైజాం రాజ్యంలో జండా ఆవిష్కరణ చేయాలని స్వామి రామనంద తీర్థ పిలుపునిచ్చారు దీనికి స్పందించిన ఇందూరు యోధులు ఊరురా జెండాలని ఎగరవేశారు లాఠీ దెబ్బలు తిన్నారు జైలు శిక్షల పాలైనారు అటువంటి వారిలో ముఖ్యులు దమ్మయ్య గారి నారాయణరెడ్డి వీరు భిక్నూర్ లో జాతీయ జెండాను ఎగరవేశారు దీనికి రజాకార్లు వీరిపై దాడి చేయగా వీరి చేతి వేళ్ళు తెగిపోయాయి అయినా బాధపడకుండా స్వాతంత్రోద్యమాన్ని తీవ్రతరం చేశారు ఒకవైపు హరిజనోద్ధరణ మరోవైపు రాత్రి బడులు ఇంకోవైపు స్వతంత్ర ఉద్యమాన్ని ఏకకాలంలో నిర్వహించారు వీరిని నైజాం ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో చిత్రహింసల పాలు చేసిన తన దేశభక్తి ఇసుమంతైనా తగ్గని ధీరుడు దమ్మయ్య గారి నారాయణరెడ్డి.

ఇలా వీరే కాకుండా సుమారు 250 మందికి పైగా వీరులు నిజామాబాద్ జిల్లాలో స్వతంత్ర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. వీరి త్యాగఫలంగా 17 సెప్టెంబర్ 1948న తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నది.ఊరూరా త్రివర్ణ పతాకం ఎగిరింది.

ఇలా తల్లి భారతి స్వేచ్ఛ కోసం తనువునర్పించిన  ధీరులను ఈ స్వతంత్ర అమృతోత్సవాల వేళ  స్మరించుకోవడం మన కర్తవ్యం

వకుళాభరణం  రాంనరేశ్  కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here