Home News మెరుగైన సంతానానికి “గ‌ర్భ సంస్కార్‌”

మెరుగైన సంతానానికి “గ‌ర్భ సంస్కార్‌”

0
SHARE

-డాక్టర్ శుభమంగళ ఆచార్య

మానవాళి సర్వ కాలాల యందు అనుసరించదగ్గ అనేక విధులను నిర్దేశించిన వేద పురాణ ఇతిహాసాల గని మన భారతదేశము. అటువంటి ఒక విధి గర్భ సంస్కారము. ఆయుర్వేద శాస్త్రాలైన చక్ర సంహిత, శుశ్రుత సంహిత, కశ్యప సంహితలో ఈ అంశంపై అందరికి ఉపయుక్తమైన అనేక వివరములు పొందుపరిచి ఉన్నాయి.

గర్భ సంస్కారము అనగా ఏమి ?
శుక్ర శ్రోణిత కలయికే గర్భము . సంస్కారము అనగా ఆ కలయిక ఫలితము నాలుగు నియమాలను ఏర్పరిచారు. వాటిని చుట్టూ ఉన్న జీవన సరళిని మెరుగుపరిచే ప్రక్రియ. గర్భాశయంలోని పిండము ఉత్తమ శారీరిక మానసిక స్థితులతో జన్మించడానికి పాటించే ప్రక్రియే గర్భ సంస్కారము.

గర్భ సంస్కార ప్రక్రియ
ఆరోగ్య కరమైన గర్భము ధరించుటకు ఆచార్య సుశృతుల వారు నాలుగు నియమాలను సూచించారు. చుట్టూ ఉన్న ప్రకృతితో పోల్చి చెప్పారు. సస్యమైన పంటలు పండుటకు మేలురకాలైన విత్తనాలు, సమృద్ధిగా ఉండే నీటి వనరులు, సరియైన కాలము, సారవంతమైన భూమి అవసరము అదే విధంగా ఉత్తమ శారీరిక మానసిక స్థితులు కలిగిన వారసులు జన్మించడానికి అనువైన గ‌ర్భధారణ మరియు గర్భాదాన సమయములు, ఆరోగ్యకరమైన గర్భము , ఆరోగ్యకరమైన స్త్రీమూర్తి :నవమాసాలు పిండమును గర్భము నందు ధరించే ఆరోగ్యము కలిగి ఉండాలి. ఆరోగ్య కరమైన శుక్ర శ్రోణితములు అవసరములని తెలిపారు .

గర్భా ధారణకు ముందు పాటించ వలసిన నియమాలు
ఆచార్య చక్రుల వారు ఆరోగ్య గర్భాధారణ కొరకు స్త్రీ పురుషులిరువురూ తమ జీవన ససరళిని మెరుగుపరిచే కొన్నిపంచ కర్మ విధులను సూచించారు. స్త్రీ పురుషులిరువురూ మూడు నెలల పాటు తమను తాము పరిశుద్ధ పరుచుకునేందుకు బ్రహ్మచర్యం పాటించాలి. ఆ పై గర్భాదాన హోమం చేస్తే వారు గర్భధారణ ప్రక్రియకు సిద్ధమైనట్లు .

జనన పూర్వ సంరక్షణ:
గర్భము ధరించిన స్త్రీ ప్రతి నెలానుసారము తగు రీతిగా మంచి జీవనసరళిని అనుసరిస్తూ ఆహార నియమాలను పాటించాలి. గర్భిణులు ఎల్లప్పుడూ ఆహ్లాదంగా ఉండాలి. .ఆహారములో దేశవాళీ గోవులిచ్చే పాలు, నెయ్యి ఇతర పదార్ధాలు స్వీకరించుట ఉత్తమం. నెలలు నిండుతున్న క్రమములో గర్భములోని పిండముకు అవయవములు ఏర్పడే వివిధ దశలలో శ్రావ్యమైన సంగీతము వినుట, ఆరోగ్యకరమైన సాత్వికమైన ఆహారము స్వీకరించుట, నియమబద్ధ‌ జీవన సరళిని కలిగి ఉండుట పాటించాలని వివిధ ఆయుర్వేద సంహితలలో ఉన్న‌ది. పుంసావన, సీమంతోనయినా అను రెండు సంస్కా రములు గర్భమును సంరక్షిస్తాయి.

ప్రసవానంతర సంరక్షణ
ప్రసూతి గృహంలో శిశువు జన్మించిన తరువాత తల్లి మూడు నెలల పాటు సూతకము అను నియామావళి ని పాటించాలి. శిశువుకు మొట్టమొదటిగా స్వర్ణప్రాశను అందించి తల్లి పాలను ఇచ్చుట కొనసాగించాలి .

గర్భాదాన సంస్కారం ఆవశ్యకత
ఈ 21వ శతాబ్దంలో మానసిక, శారీరిక రుగ్మతలతో జన్మించే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. నిత్యమూ ఆత్మహత్యలు, నిర్నయాస నిస్పృహలతో వ్యసనాల బారిన పడుతున్న వారు రోజురోజుకు ఎక్కువ అవుతున్నారు. సంతానోత్పత్తి సామర్ధ్యము స్త్రీపురుషులలో నానాటికి తగ్గుతూ వస్తున్నది. మన గత చరిత్రను పరిశీలిస్తే స్వామీ వివేకానంద, ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి అనేక మంది వీర పుత్రులకు జన్మనిచ్చి క్రమశిక్షణతో పెంచిన వీరమాతలైన భువనేశ్వరి దేవి, జిజియాబాయి వంటి స్త్రీమూర్తులు కనిపిస్తారు. పురాణాల్లో ప్రస్తావించినట్లుగా ప్రహ్లాదుడు, అభిమన్యుడు, అష్టావక్రుడు వంటి వారు కూడా గర్భాదాన సంస్కారములతో జన్మించినవారే. గుజరాత్ లోని జాంనగర్ లో వున్న గర్భాదాన పరిషత్తు అనే సంస్థ ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన ఈ ప్రక్రియలను ప్రచారం చేస్తూ గత 20 సంవత్సరాలుగా వైద్యలు హితేష్ జానీ గారి ఆధ్వర్యంలో ఈ గర్భాదాన ప్రక్రియను పాటిస్తున్నారు. ఆయుర్వేద వైద్యుల తో పాటూ ఇతర వైద్యులైన ప్రసూతి నిపుణులు, అల్ట్రాసోనోలోజిస్టులు, యోగా గురువులు, శాస్త్రీయ సంగీత గురువులు, పురోహితులు, జ్యోతిష్య పండితుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతుంది. వైద్యులకు , పండితులకు ఇక్కడ తర్ఫీదు ఇవ్వబడుతుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ విషయమై సమాజం లో సమూలిక మార్పును తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేస్తోంది. ఆరోగ్యకర సమాజ నిర్మాణం, యువతి యువకులకు సరైన సమయంలో వివాహము, ప్రణాళిక బద్ధ గర్భాధారణల పై అవగాహన కల్గించుట ఆవశ్యకం. మనము విద్య , ఉద్యోగము సంపాదన, ఉద్యోగ విరమణ ల గురించి ప్రణాళికలు వేసుకుంటాము కానీ ఉత్తమ గర్భధారణ గురించి విస్మరిస్తాము. ఉపనిషత్తులో ” బాలో హి రాష్ట్రం బలం ” అని చెప్పినట్లుగా నేటి బాలలే మన దేశానికి శక్తీ సంపదలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘముతో మనందరమూ కలిసి పని చేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నాము. (డా శుభమంగళ ఆచార్య , 18 ఏళ్ల అనుభవం కలిగిన ఆయుర్వేద వైద్య నిపుణులు .బెంగళూరు లో ఉత్తరహళ్లి లోని బ్రహ్మి ఆయుర్వేద అను కేంద్రాన్ని నడిపిస్తున్నారు. అక్కడ గర్భ సంస్కారం పద్ధతులను పాటింపచేస్తారు. అనేక కన్నడ మరియు ఆంగ్ల పత్రికలలో ఆమె వ్యాసాలు కూడా రచించారు. టెలివిజన్ లో అనేక కార్యక్రమాలకు ఆరోగ్య సల‌హాదారుగా ఆమె హాజరైనారు. వివిధ కుటుంబాలు కలిసే కుటుంబ ప్రభోదం అనే శాఖలో ఆమె సహాయ సహాకారాలందిస్తూ పాల్గొంటారు.

అనువాదం – విజయలక్ష్మి