Home News సంగారెడ్డిలో 121 మంది “ఘ‌ర్ వాప‌సి”

సంగారెడ్డిలో 121 మంది “ఘ‌ర్ వాప‌సి”

0
SHARE

సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లి మండ‌లం దుద్యాల గ్రామంలోని సర్వేశ్వర గిరి ఆశ్రమంలో 9 గ్రామాల నుండి 18 కుటుంబాలలోని 121 మంది కుటుంబ స‌భ్యులు విశ్వ‌హిందూ ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో తిరిగి స్వ‌ధ‌ర్మాన్ని స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా హోమం నిర్వ‌హించి, భ‌గ‌వ‌ద్గీత పుస్త‌కం, రాముడి చిత్ర‌పటం, హ‌నుమంతుడి లాకెట్ తో పాటు నూత‌న దుస్తుల‌ను అంద‌జేశారు. అనంత‌రం స‌హ‌పంక్తి భోజనం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో సర్వేశ్వర గిరి పీఠాధిపతులు శ్రీ సర్వేశ్వర అంభికా శివయోగి స్వామి గారు, శ్రీ సంగ్రాం మహారాజ్ గారు, విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సహ కార్యదర్శి మాన్య శ్రీ గుమ్మళ్ల సత్యం గారు, విశ్వ హిందూపరిషత్ – ధర్మ ప్రసార విభాగ్ ప్రాంత ప్రముఖ్ వి. ఆర్ జాధవ్, ప్రాంత పరావర్తన ప్రముఖ్, ధర్మ ప్రసార విభాగ్ శ్రీ ఎల్లయ్య గారు, మెదక్ విభాగ్ సంఘటనా కార్యదర్శిశ్రీ పుట్టిమల్లేష్, ధర్మ ప్రసార పూర్ణ కాలిక్ శ్రీ మహేందర్ గారు, జిల్లా అద్యక్షులు శ్రీ పవన్ కార్యదర్శి రవి, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here