Home Telugu గోవాలో హోలీ క్రాస్ లను అపవిత్రపరస్తున్న క్రైస్తవుడు అరెస్టు

గోవాలో హోలీ క్రాస్ లను అపవిత్రపరస్తున్న క్రైస్తవుడు అరెస్టు

0
SHARE

గత పక్షం రోజులలో , దక్షిణ గోవాలో 12 శిలువలు అపవిత్రం అయ్యాయి. ఈ సంఘటనలు  జులై 1 న ప్రారంభమైనయి . చర్చిలో మతతత్వ అసమ్మతిని భావాన్ని కలిగించుటకు, స్వార్థపూరితమైన శక్తులు అపవిత్రత చర్యలను  నిర్వహించుచున్నాయని  గోవా చర్చ్ ఆరోపణలు చేసింది .

కేవలం శిలువలు మాత్రమే  అపవిత్రం చేయబడలేదు. జూలై 9 న దక్షిణ గోవా పట్టణమైన  కర్కోరేం లోని లో 50 సమాధులు సైతం కొంత మేర నాశనం కాబడ్డాయి. ఆ ప్రాంతం లో శిలువలు మాత్రమే కాకుండా  ఒక దేవాలయం కూడా అపవిత్రం అవ్వబడిందని తెలియ చేయడం జరిగింది.

ఈ కేసు పరిశోధన దృష్ట్యా ఇప్పుడు పోలీసులు ఫ్రాన్సిస్ పెరీరా అనే వ్యక్తిని అరెస్టు చేయడం ద్వారా ఈ కేసు కు కొత్త ఆధారం దొరికింది. అతడు 14 మరియు 15 రాత్రి సమయం లో క్రైస్తవులు పవిత్రంగా భావించే హోలీ క్రాస్ ను ద్వంసం, అపవిత్రం చేసే సందర్బం లో అరెస్టు చేశారు.

ఫ్రాన్సిస్ క్రిస్టియన్ మతంలోని కాథలిక్ ఉప తెగ లో  ఉన్న ఒక శాఖలో సభ్యుడిగా  ఉన్నడని భావిస్తున్నారు . అతను  అవివాహితుడు, కుడ్ఛేడ్ లో జీవిస్తున్నాడు .

పోలీసుల విచారణ లో భాగంగా ఫ్రాన్సిస్ ద్వార చాల ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రాన్సిస్ 12 కేసులలో తానే హోలీ క్రాస్ (శిలువ) లను అపవిత్రం చేసానని ఒప్పుకున్నాడు. ఈ పనులను మామూలుగానే చేశానని మరియు శత్రుత్వంను ప్రోత్సహించాలని తను కోరుకోలేదు అని అన్నాడు. ఫ్రాన్సిస్ తన ప్రయత్నాలను ఎప్పుడు ప్రణాళిక బద్దంగా చేయలేదని ఎక్కడైనా శిలువలు కనిపిస్తే అలా చేసేవాడిని ఒప్పుకున్నాడు.

స్థానిక నివేదికలు ఆ విషయాన్ని విశదీకరించాయి. ఒక నివేదిక ప్రకారం, అతను వాటిలో చిక్కుకున్న ఆత్మలు విడుదల చేయడానికి మతపరమైన పుణ్యక్షేత్రాలను  విచ్ఛిన్నం చేసేవాడు. పోలీసుల కధనం  ప్రకారం, సమాధులు మరియు విగ్రహాలు లో ఆత్మలు చిక్కుకొని ఉంటే  అవి దెయ్యాలై  రాజకీయనాయకులకు సహాయం చేస్తాయి అని ఫ్రాన్సిస్ భావించేవాడు. అతను ఇప్పుడు 3 రోజుల పోలీస్ కస్టడీకి పంపబడ్డాడు.

ఫ్రాన్సిస్ అరెస్టు తర్వాత, గత 15 ఏళ్ళలో ఇటువంటి 150  అపవిత్రత కేసులను వారు చేదించగలరని పోలీసులు భావిస్తున్నారు. వాటిలో కొన్ని  ఫ్రాన్సిస్ చేసిఉంటాడని, ఎందుకంటే అతను 14 సంవత్సరాలుగా ఇలాంటి విగ్రహాలను నాశనం చేస్తున్నాడని  నివేదికలు సూచిస్తున్నాయి

ఫ్రాన్సిస్ అరెస్టు అయినప్పటికీ, తన నేరాన్ని ఒప్పుకున్నాడని చెప్పినప్పటికీ, రాష్ట్రంలో వివిధ రాజకీయ మరియు మత సంస్థలను శాంతింపజేయడం లో పోలీస్ శాఖ  విఫలమైంది.  కేవలం ఒక మనిషి ఇంత చేసాడు అంటే విశ్వసించటానికి వీలు లేకుండా ఉందని, ఇతని వెనక ఉన్న అసలు ‘సూత్రధారి’ ఎవరు అని గుర్తించాలని సంస్థలు  పోలీసులని కోరుతున్నాయి.

ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కర్కోరేం పోలీసులతో  వ్యక్తిగతంగా ఈ విషయ పై చర్చించారు, ఫ్రాన్సిస్ వెనుక ఎవరైనా ఉంది మార్గదర్శనం చేస్తున్నరా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మీడియాకు తెలియజేశారు.

కర్కోరేం నుండి బిజెపి  ఎమ్మెల్యే , నీలేష్  కాబ్రాల్  ఫ్రాన్సిస్ ఒక క్రియాశీల AAP మద్దతుదారుడని రాజకీయంగా ఆరోపించారు . ఈ కేసును ఛేదించినందుకు  పోలీసు బృందం కు  ఉదారంగా రూ.50 ,000  నగదును ప్రకటించారు.

ఫ్రాన్సిస్ ఒక క్రైస్తవుడు కాబట్టి, ఇప్పుడు  హిందూ సంస్థలు, సనాతన సంస్థలు, యి విషయమై తమను అనవసరంగా  నిందించినవారు తమకు  బహిరంగ క్షమాపణ  చెప్పాలని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here