Home News నూతన విద్యావిధానంపై క్రైస్తవ పాఠశాలల దుష్ప్రచారం

నూతన విద్యావిధానంపై క్రైస్తవ పాఠశాలల దుష్ప్రచారం

0
SHARE

తమిళనాడులోని తిరునల్వేలిలోని ప్రభుత్వ ఎయిడెడ్  క్రైస్తవ పాఠశాలలు తమ విద్యార్థులను నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని ఒత్తిడి తెస్తున్న విషయాన్ని విశ్వహిందూ పరిషద్ వెలుగులోకి వచ్చింది.

తిరునల్వేలి జిల్లాలో కొన్ని ప్రభుత్వ ఎయిడెడ్ క్రైస్తవ మిషనరీ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇగ్నేషియస్, లయోలా కాన్వెంట్ పాఠశాలల యాజమాన్యం నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ తమ ఇంటిముందు ముగ్గులు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సప్ ద్వారా సందేశాలు పంపుతున్నారు. కరోనా లాక్-డౌన్ కారణంగా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఇంటి ముందు ముగ్గులు వేసి వాట్సాప్ ద్వారా తమకు పంపాలని కోరిన విషయాన్నీ విశ్వహిందూ పరిషద్ బయటపెట్టింది.

ఈ మేరకు ఆరుముగ గని అనే స్థానిక విశ్వహిందూ పరిషద్ కార్యకర్త పాఠశాల కరస్పాండెంట్ తో ఫోన్లో మాట్లాడిన సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేసి నిరనస వ్యక్తం చేయాల్సిందిగా తాము తల్లిదండ్రులను కోరిన ఆమె అంగీకరించారని తెలిపారు. జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసన చేయాలని చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటని, అసలు మీరు విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారా అని అడగగా ఆమె ఏమీ మాట్లాడకుండానే ఫోన్ కట్ చేసినట్టు ఆయన తెలిపారు.

ఇలాంటి పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి, ఇతర అధికారుల నుంచి గ్రాంట్లు పొందే మైనారిటీ విద్యాసంస్థలు విద్యార్థులు లేదా తల్లిదండ్రులను పాఠశాల ప్రయోజనానికి ఉపయోగించకూడదని, అటువంటి నిబంధనలను అతిక్రమించిన పాఠశాలల పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు.ఈ అంశంపై స్పందించిన కేరళ పీపుల్స్ ఫ్రంట్ అనే సంస్థ బుధవారం జాతీయ మానవహక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేసింది. విద్యార్థులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగదోస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరింది.

విద్యార్థులను క్రైస్తవులు గా మార్చేందుకు పాఠశాలల కుట్ర

కేంద్ర ప్రభుత్వ పథకం కింద కోచింగ్ తరగతులు నిర్వహించడం పేరిట విద్యార్థులను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని క్రైస్తవ మతం లోకి మార్చడానికి కొన్ని క్రైస్తవ పాఠశాలలు ప్రయత్నాలు చేస్తున్నారు.
చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం అనే ఒక నకిలీ ఎన్జీవో ను సృష్టించి వందల మంది నిరుపేద విద్యార్థుల నుంచి రూ.72 లను  తీసుకుని, విద్యార్థుల ఆధార్ కార్డ్, ఫోటోలను సేకరించి వారిని క్రైస్తవులుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న క్రైస్తవ మిషనరీ సంస్థకు చెందిన నిషా అనే మహిళపై, ఆమెకు చెందిన ఎన్జీవోపై చర్యలు తీసుకొని,  విద్యార్థుల డబ్బు ఆధార్ ఫోటోలు తిరిగి ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని వి హెచ్ పి, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పదేళ్ల క్రితం మేళ పిల్లయర్ లోని టీడీటీఏ పాఠశాల హెడ్మాస్టర్ రాణి, పాఠశాల ఉపాధ్యాయురాలు ఇజ్రాయిల్ తో కలిసి ఇదే రీతిలో విద్యార్థులను మోసం చేసి క్రైస్తవ మతం లోకి మార్చేందుకు ప్రయత్నాలు చేశారు.

Source : ORGANIZER

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here