Home News జకీర్‌ నాయక్‌ ఎన్.జి.ఓ ను అయిదేళ్ళ పాటు నిషేదించిన కేంద్ర ప్రభుత్వం

జకీర్‌ నాయక్‌ ఎన్.జి.ఓ ను అయిదేళ్ళ పాటు నిషేదించిన కేంద్ర ప్రభుత్వం

0
SHARE

వివాదాస్పద ఇస్లామిక్‌ ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌కి అనే స్వచ్ఛంద సంస్థను అయిదేళ్లు పాటు నిషేధించడానికి కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది.

ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీస్‌ టీవీకి ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌కి సంబంధాలున్నట్లు నిరూపణ కావడంతో హోం శాఖ ఆ సంస్థను నిషేధిత సంస్థగా ప్రకటించాలని ప్రతిపాదించింది. దీనికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి హోం శాఖ త్వరలో ఒక ప్రకటన కూడా విడుదల చేయనుంది.

zakir-naik

అన్ లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివేన్షన్ ఆక్ట్ ( యుఎపిఎ) కింద ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ నలుగు ప్రధాన ఆరోపణలపై నిషేధం విధించింది. 1. జకీర్‌ నాయక్‌ పై నమోదు అయిన క్రిమినల్ కేసులు. 2. రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రభోధనలు 3. నిషేదించబడిన పీస్ టీవీ తో సంభంధాలు 4. తన స్వచ్ఛంద సంస్థకు చెందిన విదేశీ నిధులను పీస్ టీవీ కి మళ్ళించడం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here