Home News యుద్ధ‌భూమిలో హిందూ స్వయం సేవక‌ సంఘ్ సేవ‌లు!

యుద్ధ‌భూమిలో హిందూ స్వయం సేవక‌ సంఘ్ సేవ‌లు!

0
SHARE

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అంటేనే గుండె ద‌డ పుడుతుంది… అలాంటిది ఆ యుద్ధ‌భూమిలో ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించ‌డం మాట‌లు కాదు.. ప్రాణాల‌కు తెగించి, అక్క‌డి హిందూ స్వయం సేవక‌ సంఘ్(హెచ్‌.ఎస్‌.ఎస్‌), ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్‌), ప‌లు హిందూ సంస్థ‌లు మాన‌వ సేవే మాధ‌వ సేవ అంటూ త‌మకు తోచినంత సాయం అందిస్తూ భగవంతుడు ఇచ్చిన మానవ జన్మను సార్థకం చేసుకుంటున్నాయి.

ఉక్రెయిన్ సంక్షోభం ఇప్పటికే దాదాపు 1,00,000 మందిని నిరాశ్ర‌యుల‌ను చేసింది. వంద‌లాది మంది మృత్యు ఒడికి చేరుకోగా, వేలాది మంది క్ష‌త‌గాత్రుల‌య్యారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండ‌డం ఆందోళ‌న గురిచేస్తోంది. ఈ త‌రుణంలో హెచ్.ఎస్‌.ఎస్‌., ఇస్కాన్, సేవా ఇంటర్నేషనల్, ఇత‌ర హిందూ సంస్థలు యుద్ధంలో ఇబ్బందులు ప‌డుతున్న ఉక్రెయిన్లు, భారతీయ విద్యార్థులకు సేవలు అందిస్తున్నాయి.

54 కేంద్రాల ద్వారా సేవ‌లు

ఇస్కాన్‌కు ఉక్రెయిన్‌లో 54 కేంద్రాలు ఉన్నాయి. అయితే, ప్రాణాపాయం ఉన్న‌ప్ప‌టికీ యుద్ధ‌భూమిలో ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. “గతంలో కూడా, చెచ్న్యా యుద్ధం సమయంలో, మా భక్తులు ఆపదలో ఉన్నవారికి, ముఖ్యంగా వారి ఫ్లాట్లలో చిక్కుకుపోయిన వృద్ధులకు సేవ చేశారు… వారిని చూసుకోవడానికి ఎవరూ లేరు” అని కోల్‌కతాలోని ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ మీడియాతో మాట్లాడుతూ గుర్తు చేశారు. “ఈ క్లిష్ట సమయాల్లో అదే స్ఫూర్తితో ఉక్రెయిన్ ప్రజలకు ఎంత చేయాలో అంత చేస్తున్నార‌న్నారు.

మరోవైపు, కైవ్‌లోని హరే కృష్ణ దేవాలయాల‌నికి చెందిన‌ రాజు గోపాల్ దాస్ మాట్లాడుతూ బాధితుల కోసం కృష్ణుని ఆలయాన్ని సిద్ధం చేశామన్నారు. ఉక్రెయిన్ నుండి దాటుతున్న భారతీయ విద్యార్థులకు ఇస్కాన్ హంగేరీ ఆహారం, మంచినీరు వంటి అత్య‌వ‌స‌ర వ‌స్తువులు పంపిణీ చేస్తోంది. భారతీయ రాయబార కార్యాలయం ఇస్కాన్ భక్తుల నుండి సహాయం కోర‌డంతో ఇస్కాన్ త‌క్ష‌ణం ఏర్పాట్లు చేసింది.

సేవా ఇంటర్నేషనల్, హిందూ విశ్వాసం-ఆధారిత, త‌దిత‌ర మానవతావాద సంస్థలు వేలాది మంది విద్యార్థులు వెంట‌నే ఖాళీ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఫిబ్రవరి 26న, సేవా ఇంటర్నేషనల్ 150 మంది విద్యార్థులను విన్నిట్సా నుండి చెర్నోవ్ట్సీకి బస్సులో రవాణా చేసింది. రోమేనియన్ సరిహద్దుకు చేరుకొనే వ‌ర‌కు సాయం అందించింది. ఇప్పటికే తన హెల్ప్‌లైన్‌లో 4,000 మంది విద్యార్థులను నమోదు చేసుకుంది. దాని వాలంటీర్లు మరో 400 మందిని ఖాళీ చేయించేందుకు కృషి చేస్తున్నారు. హిందూ స్వయం సేవక్‌ సంఘ్ (హెచ్‌.ఎస్‌.ఎస్‌.) ప్రస్తుతం పది ఉక్రేనియన్ నగరాల్లో పనిచేస్తోంది.

సేవా ఇంటర్నేషనల్ ఉక్రేనియన్ సహాయ చర్యల కోసం USD 10,000 విడుదల చేసింది. ఇంకా… Facebook ద్వారా నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. యుద్ధ స‌మ‌యంలో సేవ‌లు అందించేందుకు స్పందించిన సేవా ఇంటర్నేషనల్‌కు మద్దతు ఇవ్వాలని నేను ప్రజలను అభ్యర్థిస్తున్నాను… అని సేవా ఇంటర్నేషనల్, USA అధ్యక్షుడు అరుణ్ కంకాని కోరారు.

ఇదిలావుండ‌గా, హరే కృష్ణ ఉద్యమ శిష్యుల‌తో, ఇత‌ర సంస్థ‌లు ఉక్రెయిన్‌లో ప్రజలకు సేవ చేసేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ, భారత్‌లోని హిందూ వ్య‌తిరేక వెబ్‌సైట్‌లు వారి నిస్వార్థ సేవను కించపరిచేందుకు ప్రయత్నిస్తుండ‌డం బాధాక‌రం!

Courtesy : Hindu Post & Vsk Andhra