Home News రామభక్తులపై ఇస్లాం మ‌తోన్మాదుల‌ రాళ్ళ దాడి.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

రామభక్తులపై ఇస్లాం మ‌తోన్మాదుల‌ రాళ్ళ దాడి.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

0
SHARE

రామ మందిర నిర్మాణానికి చేప‌ట్టిన నిధి సేక‌ర‌ణ‌లో భాగంగా నిర్వ‌హించిన ఒక‌ ర్యాలీలో రామ భ‌క్తుల‌పై ముస్లిం గుంపు దాడి చేసిన దాడి వ‌ల్ల కూలి ప‌ని చేసుకునే ఒక‌ హిందూ వ్య‌క్తి మ‌ర‌ణించ‌గా ప‌లువురికి గాయాలైన ఘ‌ట‌న గుజ‌రాత్‌లో గాంధీదామ్ స‌మీపంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. గుజరాత్ లోని గాంధీధామ్ సమీపంలోని కిడాని గ్రామంలో రామ మందిర‌ నిర్మాణం కోసం చేప‌ట్టిన నిధి సేక‌ర‌ణ‌లో భాగంగా ఈ నెల 17న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వ‌ర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఈ క్ర‌మంలో ర్యాలీ గ్రామంలోని ఒక మ‌సీదు ముందు నుంచి వెళ్తుండ‌గా కొంత మంది ముస్లిం వ్య‌క్తులు ర్యాలీపై రాళ్ల‌తో దాడి చేశారు. సుమారు 200మంది ముస్లింలు చేసిన ఈ దాడిలో అనేక మంది హిందువులు గాయ‌ప‌డ్డారు. అదే స‌మ‌యంలో కూలీ ప‌ని చేసుకుని తిరిగి ఇంటికి ఆటోలో వెళ్తున్న అర్జున్ సవాయియో అనే వ్య‌క్తిని కొంత మంది ముస్లింలు క‌త్తుల‌తో పొడిచి చంపారు. అత‌ను ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ కూడా కత్తిపోటుకు గురయ్యాడు. దుండ‌గులు ఆటోకు కూడా నిప్పంటించారు.

ఘ‌ట‌న‌పై స్థానిక క‌చ్ ఎస్పీ మయూర్ పాటిల్ మాట్లాడుతూ పరిస్థితులు ఉద్రిక్త‌మ‌వ‌డంతో పోలీసులు టియర్ గ్యాస్ ను ప్ర‌యోగించాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. గుంపుల‌ను చెద‌ర‌గొట్టామ‌ని తెలిపారు. ఈ స‌మ‌యంలోనే అర్జున్ స‌వాయియో అనే వ్య‌క్తి మృతదేహం ఘ‌ట‌న స్థ‌లం నుంచి 200 మీటర్ల దూరంలో గుర్తించిన‌ట్టు పాటిల్ తెలిపారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత గ్రామంలో సెక్షన్ 144 విధించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ప్ర‌శాతంగా ర్యాలీ నిర్వ‌హిస్తుండ‌గా క‌త్తులు, క‌ర్ర‌ల‌తో దాడి చేసినందుకు గాను ఇక్బాల్ చావ్దా, కసం క్కల్, ఇబ్రహీం, హుస్సేన్ చావ్డా, సల్మాన్ చావ్దా తో పాటు మ‌రికొంత మంది ముస్లింల‌పై ఎఫ్‌.ఐ.ఆర్‌ న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసు అధికారులు తెలిపారు.

Source :  ORGANISER

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here