Home Interviews ఆచారాలు దురాచారాలెందుకయ్యాయి?

ఆచారాలు దురాచారాలెందుకయ్యాయి?

0
SHARE

మార్చ్ 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా …

వరకట్న వేధింపులు, ఆడపిల్లలను గర్భంలోనే చంపేయడం (భ్రూణహత్యలు) వంటి దురదృష్టకర సంఘటనల గురించి మీడియా అత్యుత్సాహం చూపిస్తుంటుంది. ఇలాంటి దుష్టత్వం, క్రూరత్వం హిందూ సమాజపు సహజ లక్షణాలనే విధంగా విపరీతమైన వ్యాఖ్యలు, కువ్యాఖ్యానాలతో ఊదరగొడుతుంది. దీనికితోడు ఇలాంటి దురాచారాలు ఈనాటివి కావని, ఇవి ప్రాచీనకాలంగా ఈ సమాజంలో పాతుకుపోయాయని మేథావులు, స్త్రీవాదులు ప్రచారం చేస్తారు. హిందూ సంస్కృతిలో అడుగడుగునా మహిళకు అన్యాయం జరిగిందని గగ్గోలుపెడతారు. అటు మీడియా, ఇటు మేధావుల ప్రచారపు హోరులో చిక్కుకున్న సాధారణ ప్రజానీకం ఇదంతా నిజమేననుకుంటారు. నిజానికి ఒకప్పుడు మన దేశంలో వరకట్న దురాచారం, భ్రూణహత్యలు లేవని బ్రిటిషువారి దుష్ట, నిరంకుశ, అన్యాయ, సామ్రాజ్యవాద విధానాల వల్ల ఈ దురాచారాలు మన సమాజంలో ప్రవేశించాయని చాలామందికి తెలియదు. ఇదే విషయాన్ని సామాజికవేత్త,  ప్రముఖ రచయిత వీణా తల్వార్‌ ఓల్డన్ బర్గ్‌  ఆధారాలతోసహా వివరించారు. న్యూయార్క్‌ సిటీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ అయిన వీణా ఓల్డన్ బర్గ్‌ ‘డౌరీ మర్డర్‌, ది ఇంపీరియల్‌ ఆరిజన్స్‌ ఆఫ్‌ ఎ కల్చరల్‌ క్రైమ్‌’ అనే పుస్తకం రాశారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలను వివరించారు. 

ప్ర. వరకట్న దురాచారం ప్రబడానికి బ్రిటిషువారి విధానాలు కారణమని మీరంటున్నారు. అందుకు ఆధారాలు ఏమిటి?

జ. బ్రిటిషువారు రాకముందు ఈ దేశంలో భూమి అమ్మకం, కొనుగోలు లేవు. భూమి మొత్తం రాజుకు చెందినది. దానిపై ఎవరికీ వ్యక్తిగత హక్కు ఉండదు. రాజు పరిస్థితులను బట్టి రైతుకు రాయితీలు ఇచ్చేవాడు. ఉదాహరణకు రాజారంజిత్‌సింగ్‌ కరవులవల్ల ఇబ్బందులుపడ్డ రైతుకు ఒక సంవత్సరం పన్ను రద్దు చేశాడు. పంటను గ్రామస్థులు పంచుకునేందుకు అనుమతించాడు.

బ్రిటిష్‌వారి పాలనలో భూమిపై హక్కును పూర్తిగా పురుషుల చేతిలో పెట్టడంవల్ల, లావాదేవీలన్నీ వాళ్ళే నియంత్రించడంవల్ల మహిళలకు ఆర్థిక హక్కు లేకుండా పోయింది. అంతేకాదు సంవత్సరానికి రెండుసార్లు పన్ను విధించేవారు. పన్ను చెల్లించకపోతే నిర్దాక్షిణ్యంగా భూమిని వేలం వేసేవారు. దీనిమూలంగా కరవు కాలంలో కూడా ఎలాగైనా పన్ను చెల్లించాలని రైతు ప్రయత్నించేవారు. భూమిని తనఖా పెట్టి అప్పుతెచ్చిమరీ పన్ను చెల్లించేవారు. అప్పు భారం పెరిగిపోయేది. ఒకప్పుడు పురుషులతో సమానంగా హక్కును అనుభవించిన స్త్రీలకు బ్రిటిష్‌ ఆర్థిక విధానాల మూలంగా ఆ హక్కు పూర్తిగా పోయింది. వాళ్ళు ఒకరిపై ఆధారపడే స్థితికి వచ్చారు. వారి ఆర్థికపరమైన వెనుకబాటుతనం వివాహాలపైన కూడా పడింది.  

ప్ర. అంటే ఆర్థిక వ్యవస్థ అంతా పురుష కేంద్రితమైందన్నమాట..

జ. అవును. సరిగ్గా అలాగే జరిగింది. దీనివల్లనే మగపిల్లలే కావాలనుకునే ధోరణి పెరిగింది. అలాగే పంజాబ్‌లో రైతు కుటుంబాల నుంచి ఎక్కువమంది మగపిల్లలు సైన్యంలో చేరడం ప్రారంభమైననాటి నుండి భ్రూణహత్యలు కూడా మొదలయ్యాయి. మగపిల్లలకు కొత్తగా వచ్చిన విలవతో వారి వివాహా సందర్భంగా డబ్బు, నగలు ఆశించడం, కోరడం సాధారణమైపోయింది.

ప్ర. అంటే బ్రిటిష్‌వారికి ముందు ఈ దేశంలో వరకట్న ఆచారం లేదా?

జ. లేదని కాదు. దానిని `దహేజ్‌’ అంటారు. కానీ ఇప్పుడున్న పద్ధతిలో మాత్రం లేదు. నిజానికి వరకట్నం అనేది ఆడపిల్లల కోసం, వారికి బహుమతిగా ఇచ్చేవారు తప్ప మగపిల్లవాడు డిమాండ్‌ చేసే పద్ధతి లేదు. పైగా ఇది వ్యవసాయ కుటుంబాలలో అధికంగా ఉండేది. కానీ విచిత్రమేమిటంటే ఈ వరకట్నం, భ్రూణహత్యలను తమ సామ్రాజ్యవాదానికి, తమకున్న ‘నాగరకత బాధ్యత’ను సమర్థించుకునేందుకు ఉపయోగించుకున్నారు బ్రిటిష్‌వారు.

ప్ర. మీరు క్నోలో పెరిగారు కదా. అప్పటి పరిస్థితు గురించి చెప్పండి. ముఖ్యంగా వరకట్నం గురించి…

జ. మా తాతముత్తాు పంజాబ్‌కు చెందినవారు. కానీ తరువాత మేం లక్నోకు వచ్చాం.  అప్పటికి దేశవిభజన విషాద జ్ఞాపకాలు పూర్తిగా సమసిపోలేదు. ఎప్పుడైనా ఆనాటి సంఘటన ప్రస్తావన వస్తే ఇంట్లో మహిళలు ‘అదృష్టవశాత్తు నాకు ఈ నెక్లెస్‌ మిగిలింది. కనీసం ఇక్కడ ఇల్లు కొనుక్కోవచ్చును’ అంటూ చెప్పుకునేవారు. నిజానికి వరకట్న వ్యవస్థ చాలా ప్రయోజనకరమైనది. దీనివల్ల మహిళకు ఆర్థిక భద్రత లభించేది. కానీ క్రమేణా వరకట్నం స్వచ్చంద ఆచారం స్థాయి నుంచి తప్పనిసరి వ్యవహారంగా మారిపోయింది. వరకట్నం డిమాండ్‌ చేయకూడదు. ఒకప్పుడు మహిళకు పురుషులతో సమానమైన హక్కు, అధికారాలు ఉన్నరోజుల్లో ఈ పద్ధతి అములోకి వచ్చింది. కానీ పరిస్థితి మారిపోయేసరికి అదే ఆచారం గుదిబండగా మారింది. మహిళకు ఆస్తి హక్కు ఉండాలన్నది నా అభిప్రాయం.

ప్ర. బ్రిటిష్‌ చట్టాలు మహిళపై ఎలాంటి ప్రభావం చూపాయి?

జ. అప్పటి వరకు ఆచారంగా ఉన్న పద్ధతులన్నింటి స్థానంలో బ్రిటిష్‌వాళ్ళు చట్టాల్ని తెచ్చిపెట్టారు. ‘స్థానిక’(లోకల్) అంటే గ్రామం అనే అర్థం మారిపోయి అది ‘కులం’, ‘జాతి’ అయింది. ఈ మార్పులవల్ల అప్పటి వరకు మొత్తం గ్రామంలో అందరితోపాటు సమాన హోదా అనుభవించిన స్త్రీ స్థితి మారిపోయింది. వాళ్ళు పురుషస్వామ్య వ్యవస్థలో భాగమైపోయారు. విశాలమైన, అందరికీ సమాన అవకాశాలను కల్పించిన సంప్రదాయ, సామాజిక నిబంధనల్ని ప్రభుత్వ చట్టాలు ఆక్రమించాయి. వీటిలో మహిళలకు ఎలాంటి అవకాశాలు, హక్కులు లేనేలేవు.

ఇంతకంటే మించిన మార్పు మరొకటి జరిగింది. గ్రామ స్వరాజ్య వ్యవస్థను పూర్తిగా తొలగించి కేంద్రీకృత పాలనా వ్యవస్థను బ్రిటిష్‌వారు తెచ్చారు. గ్రామపంచాయితీలను కోర్టులు ఆక్రమించాయి. గ్రామ పట్వారీలు ప్రభుత్వోద్యోగులయ్యారు. అంతకుముందు రైతు, గ్రామస్థుల బాగోగులు చూసే సేవకుడిగా ఉన్న పట్వారీ ఇప్పుడు వారిపై అధికారం చెలాయించడం ప్రారంభించాడు.

ప్ర. బ్రిటిష్‌వాళ్ళు తెచ్చిన మరికొన్ని మార్పులు ఏమిటి?

జ. భూమిపై వ్యక్తిగత హక్కు తెచ్చిపెట్టారు. అప్పటి వరకూ సమాజం, దేవాలయపు ఆస్తిగా ఉన్న భూమిని వ్యక్తుల చేతిలో పెట్టారు. దీనితో భూమి నుంచి ప్రయోజనం పొందేవారి సంఖ్య పరిమితమైపోయింది. ఒకప్పుడు భూమిని కేవలం రక్షించుకునేవారు. ఆ తరువాత సొంతం చేసుకోవడం మొదలైంది. దీనివల్ల ఏం జరిగిందో ఉదాహరణ ద్వారా చూద్దాం. ఎక్కడైనా వరదలు వచ్చాయనుకుందాం. ప్రజలు తమ ఇళ్ళువాకిళ్ళు వదిలి వచ్చేసేవారు. అంతకు ముందు మరే ప్రదేశానికైనా వెళ్ళి నాకు రెండు ఎకరాల భూమి ఉండేదని చెపితే డబ్బు ఇచ్చేవారు. కానీ పట్టాలు పుట్టిన తరువాత వాటిని చూపిస్తే కానీ అప్పు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడింది. భూమి ఒక వినియోగ వస్తువైపోయింది. ఈ పట్టాలు పురుషుల పేరుమీదనే ఉంటాయి (ఎందుకంటే వ్యవసాయం చేసేది వాళ్ళే) కాబట్టి క్రమంగా పురుషాధిక్యత పెరిగింది.

బ్రిటిషువాళ్ళు సతి ఆచారాన్ని నిషేధించారని గొప్పగా చెపుతారు. కానీ, భూమిని ఆస్తిగా మార్చడం ద్వారా వాళ్ళు మహిళలకు చేసిన అన్యాయాన్ని ఎవరూ గుర్తించలేరు. ఇలా ఆచారాలు, పద్ధతులను అర్థం చేసుకోకుండానే వాటిని నిరసించి, నిషేధించే పద్ధతిని మనం బ్రిటిషువారి నుంచే నేర్చుకున్నట్లు కనిపిస్తుంది. ఇది తప్పు.

ప్ర. భ్రూణహత్య (గర్భంలో ఉండగానే ఆడప్లిల్ని చంపివేయడం) మాటేమిటి?

జ. వ్యక్తిగతమైన, చెదురుమదురు సంఘటనల్ని మొత్తం జాతికి, సమాజానికి ఆపాదించడం బ్రిటిషువాళ్ళు అనుసరించిన వ్యూహం. నాసిరకమైన, లోపభూయిష్టమైన నాగరికతను సంస్కరించడానికి, సుసంపన్నం చేయడానికి తాము వచ్చామని చెప్పుకునేందుకు ఈ వ్యూహం ఉపయోగపడిరది. అలా తమ దుష్ట, అన్యాయపూరిత సామ్రాజ్యవాద విధానాలను కప్పిపుచ్చుకునేందుకు కూడా వీలైంది.

ప్ర. సాంస్కృతిక నేరం’ (cultural crime) అనే మాట ఎక్కడ పుట్టింది?

జ. అమెరికాలో వరకట్న సమస్య లేదు. అయినా అక్కడ కూడా హత్యలు జరుగుతున్నాయి. ఒక్క ఏడాదిలో 2.5 మిలియన్‌ స్త్రీలపై దాడులు జరిగినట్లు రిపోర్టులు ఉన్నాయి. కానీ ఇవేవీ పత్రికల్లో, పతాకశీర్షికల్లో కనిపించవు. కానీ ఈ దేశంలో మాత్రం ప్రతి సంఘటనను సంస్కృతికి జోడిస్తారు.

For local updates, download Samachara Bharati
For Multi-lingual News App – download 
Ritam