Home News గుంజన్‌ సక్సేనా సినిమాపై సెన్సాన్‌బోర్డుకు ఫిర్యాదు చేసిన భారత వైమానికి దళం

గుంజన్‌ సక్సేనా సినిమాపై సెన్సాన్‌బోర్డుకు ఫిర్యాదు చేసిన భారత వైమానికి దళం

0
SHARE

భారత సైనిక దళాలపై విషప్రచారం చేయడం, పాకిస్తాన్ కొమ్ముకాసే విధంగా సినిమాలు తీయడం బాలీవుడ్ లో సర్వసాధారణమైపోయింది. ఇటీవల భారత మాజీ వైమానిళ దళ అధికారి గుంజన్‌ సక్సేనా నిజ జీవిత ఆధారంగా రూపొందించిన బాలీవుడ్ సినిమా పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా వైమానిక దళాన్ని కించపరిచేలా ఉందని భారత వైమానిక దళం సెన్సాన్‌బోర్డుకు, సినిమాను నిర్మించిన ధర్మ ప్రొడక్షన్ కు ఫిర్యాదు చేసింది. ఈ ధర్మ ప్రొడక్షన్ సంస్థ కరణ్ జోహర్ కు చెందినది.

సుషాంత్‌ రాజ్‌పుత్‌ విషాదకరమైన మరణం తర్వాత బాలీవుడ్ ను గుప్పెట్లో పెట్టుకున్న మాఫియా గురించి సర్వత్ర చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో కరణ్ జోహర్, మహేశ్ భట్ తదితరుల తీరు బాగా చర్చలోకి వచ్చింది. ఆ నేపధ్యంలో మహేశ్ భట్ నిర్మించిన సడక్‌ సినిమా ట్రైలర్‌కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒక రోజులో ఏకంగా 5 మిలియన్ల డిస్‌లైక్‌లు ఆ ట్రైలర్‌కు వచ్చాయి. అదే రోజు విడుదలయిన గుంజన్‌ సక్సేనా సినిమాను కూడా ప్రేక్షకులు తిరస్కరించారు.  దీనికి చాలా కారణలే ఉన్నాయి. ముఖ్యంగా బాలివుడ్‌లో బంధుప్రీతీపై(నెపోటిజం) సాగుతున్న చర్చ నేపథ్యంలో జాన్వికపూర్‌ ఈ చిత్రంలో నటించడం ఒక కారణమయితే, సినిమాలో వైమానిక దళాన్ని కించపరిచేలా ఉండడంతో పలువురు తీవ్ర అభ్యతరాలు వ్యక్తం చేస్తున్నారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న గుంజన్‌ సక్సేనా నిజ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా అనేక అసత్యాలు ప్రచారం చేసేదిగా ఉందన్నది పలువురి ఆరోపణ.

సైన్యాన్ని కించపరిచేలా ఉంది :
గుంజన్‌ సక్సేనా చిత్రం సైన్యాన్ని కించపరిచేలా ఉందని భారత వాయు సేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర సెన్సార్‌ బోర్డుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. చిత్రంలో వాయుసేన పనితీరును విమర్శించేలా, సిబ్బందిని కించపరిచేలా సన్నివేశాలున్నాయని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని బోర్డును కోరింది. వాయు సేనలో లింగ వివక్ష ఉందన్నట్టు చూపించడాన్ని తప్పు బట్టింది.

ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేసినప్పుడే వైమాళిక దళం కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. సినిమాలో సైన్యాన్ని కించపరిచేలా సన్నివేశాలన్నాయని, వాటిని తొలగించాలని సినిమాను నిర్మించిన సంస్థ ధర్మ ప్రొడక్షన్‌కు సూచించింది. కానీ సంస్థ వారు అవేమి పట్టించుకోకుండా సినిమాను అలానే విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ ఇతర బాలీవుడ్‌ చలనచిత్రాల మాదిరి ఒక ఎజెండాతో నడుస్తుందని, మన సాయుధ దళాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు చేస్తారని ముందుగానే గ్రహించిన వైమానిక దళం (ఐఎఎఫ్‌) భయాలు చిత్రం విడుదలతో నిజమయ్యాయి. ఇదే విషయాన్ని ఐఎఎఫ్‌ తన లేఖలో పేర్కొంది. ఇది అనుకోకుండా జరిగిన తప్పు కాదని, ఇంతకుముందు అభ్యంతరాలు తెలిపినప్పటికీ ధర్మ ప్రొడక్షన్స్‌ ఎలాంటి దిద్దుబాటుచర్యలు తీసుకోలేదని ఐఎఎఫ్‌ సెన్సార్‌బోర్డుకు రాసిన లేఖలో వెల్లడించింది. ఐఎఎఫ్‌ లో లింగవివక్ష ఉన్నట్లు  చూపించే అభ్యంతరకరమైన సన్నివేశాలు, సంభాషణలను తొలగించాలని సంస్థకు కోరినా నిర్మాణ సంస్థ తొలగించకపోవడాన్ని ఐఎఎఫ్‌ తప్పు బట్టింది.

సైన్యాన్ని కించపరిచేలా సినిమాలు చేయడం సిగ్గు చేటని ఐఎఎఫ్‌ స్పష్టం చేసింది. ఇలాంటి సినమాల తీసి డబ్బు సంపాధించుకోవాలనుకోవడం దారుణమని విచారం వ్యక్తం చేసింది.

సినిమాను రిలీజ్‌ చేసిన నెట్‌ప్లిక్స్‌(ఒటిటి ప్లాట్‌ఫాం)కూడా తీవ్రంగా నష్టపోయింది. సినిమాను ప్రేక్షకులు అదరించకపోవడంతో నష్టాన్ని పూడ్చుకోవడానికి మార్గాలు వెతుకుతోంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో కూడా భారత వ్యతిరేక అంశాలు కలిగిన సినిమాలు, సిరియళ్ళు ఎక్కువయ్యాయన్నని కొందరు ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి సినిమాలను విషయాలను దృష్టిలో పెట్టుకుని రక్షణ మంత్రిత్వ శాఖ గత నెల సెన్సాన్‌ బోర్డుకు ఒక లేఖ రాసింది. ఎవరైనా భారత సైన్యానికి సంబంధించిన సినిమాలు గానీ, వెబ్‌సిరీస్‌లు తీస్తే ఆ సినిమా విడుదలకు ముందు తమ నుంచి అనుమతి పత్రాన్ని(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) పొందాలని స్పష్టం చేసింది. అలాంటి అనుమతి పొందకుండానే ధర్మ ప్రొడక్షన్ సంస్థ  గుంజన్ సక్సేనా సినిమా విడుదల చేసింది.

Source: TFI Post

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here