Home News తొలిసారిగా విదేశీ ద్వీపకల్పంలో భారత్ స్థావరం

తొలిసారిగా విదేశీ ద్వీపకల్పంలో భారత్ స్థావరం

0
SHARE

– ప్రకార్ గుప్తా

హిందూ మహా సముద్రంలో పశ్చిమాన (WIO) తన ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా భారత్ అనేక చర్యలను చేపడుతున్నది. ఆ క్రమంలో మారిషస్‌కు చెందిన అగలెగా ద్వీపకల్పంలో సైనిక స్థావరానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన చేపట్టింది. మారిషస్ ప్రధాన భూభాగానికి ఉత్తర దిక్కున 1,100 కిలోమీటర్ల దూరంలో అగలెగా ద్వీపం ఉంది. గడచిన కొద్ది సంవత్సరాల్లో 10 వేల అడుగుల మేరకు రన్‌వే, జెట్టీ నిర్మాణ పనులు ద్వీపకల్పంలో చురుకుగా కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం, ఈ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ నాటి శాటిలైట్ ఇమేజ్‌లో కొత్తగా నిర్మితమవుతున్న రన్ వేకు పక్కనే భారత నౌకదళానికి చెందిన P-8I సబ్ మెరైన్ – హంటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పట్టేంత ప్రమాణంలో హంగర్లు కనిపించాయి.

180 అడుగుల పొడవు, 200 అడుగుల వెడల్పు కలిగిన హంగర్లలో 123 మీటర్ల పొడవు, 126 అడుగుల వెడల్పాటి రెక్కలను కలిగి ఉన్న భారత్‌కు చెందిన P-8I పోసిడాన్ లాంటి అతిపెద్ద సైనిక విమానాలను కొలువుదీర్చవచ్చునని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన ఆసియా మారిటైమ్ ట్రాన్స్‌పరెన్సీ ఇనీషియేటివ్ నివేదించింది.

తాజా పరిణామాలతో ద్వీపంలో P-8I సుదీర్ఘ శ్రేణి నిఘా విమానాన్ని మోహరింపజేయాలనే భారత్ ప్రణాళికపై సాగర జలాల భద్రత నిపుణుల అంచనా నిర్ధారితమైంది.

చైనా అత్యంత చురుకుగా WIO లో తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటున్నది. జిబూటీలో తన తొలి విదేశీ సైనిక స్థావరం నిర్మాణం చేపట్టడానికి తోడు ఆఫిక్రాలో మౌలిక సదుపాయల కల్పనలో మరీ ముఖ్యంగా ఓడ రేవుల నిర్మాణంలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతున్నది. నిర్మాణం జరుపుకుంటున్న ఈ ఓడ రేవులు ఆఫ్రికా తూర్పు తీరాన, WIO లో ఉన్నాయి. సదరు ఓడరేవులు భవిష్యత్తులో చైనా ఔట్ పోస్టులుగా రూపాంతరం చెందుతాయి.

WIO లో భారత్ ప్రాబల్యం

ఇటీవల కాలంలో హిందూ మహా సముద్రంలో దక్షిణాన లా రీయూనియన్ ద్వీపంలో P-8I ఎయిర్‌క్రాఫ్ట్‌ను భారత్ మోహరింపజేసింది. ఫ్రాన్సు నావికదళానకి చెందిన యుద్ధ నౌకలతో సమన్వయ నిఘాపై ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను భారత్ మోహరించింది.

“మొజాంబిక్ చానల్‌తో పాటుగా హిందూ మహా సముద్రంలో దక్షిణాన సాగరజలాల రక్షణ, భద్రతను మెరుగుపరిచే క్రమంలో ఫ్రాన్సు యుద్ధ నౌకలు చేపట్టే సమన్వయ నిఘా కార్యక్రమాల్లో P-8I ఎయిర్‌క్రాఫ్ట్ పాల్గొంటుంది” అని భారత నావికా దళ అధికార ప్రతినిధి తెలిపారు.

లా రీయూనియన్ ద్వీపంలో భారత నావికా దళానికి చెందిన P-8I ఎయిర్‌క్రాఫ్ట్‌ను మోహరించడం ఇదే మొదటిసారి కాదు. 2020లో ఫ్రాన్సుతో కలిసి భారత్ చేపట్టిన ఉమ్మడి గస్తీ కార్యక్రమంలో సైతం P-8I ఎయిర్‌క్రాఫ్ట్‌ పాల్గొంది. హిందూ మహా సముద్రంపు నైరుతి ప్రాంతంలో గస్తీ చేపట్టిన సందర్భంగా భారత నావికా దళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లోకి ఫ్రాన్సు నావికాదళానికి చెందిన అధికారులు ఉన్నారు.

సాగర జలాల భద్రతపై భారత్ వ్యూహాత్మక జాబితాలో మొజాంబిక్ చానల్‌తో పాటుగా హిందూ మహా సముద్రంపు నైరుతి ప్రాంతం, చైనా అత్యంత ఆసక్తితో భారీగా పెట్టుబడులు పెడుతున్న ఆఫ్రికా తూర్పు తీరం ఉన్నాయి.

అగలెగా ద్వీపకల్పంలో నిర్మాణం జరుపుకుంటున్న నావికా దళానికి చెందిన సైనిక స్థావరం.. P-81 ఎయిర్‌క్రాఫ్ట్‌‌లతో పాటుగా హిందూ మహా సముద్రంలో పశ్చిమాన మరీ ముఖ్యంగా ఆఫ్రికా పశ్చిమ తీరానికి సమీపంలోని సాగర జలాల్లోని భారత్ ఆస్తులకు అండగా ఉంటుంది. భారత్ నావికా దళానికి చెందిన కార్యకలాపాలు పరిమితంగా ఉన్న ఈ ప్రాంతం భారత్‌కు అత్యంత కీలకమైనది.

2015 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ మారిషస్ పర్యటనను పురస్కరించుకొని అగలెగా ద్వీపకల్పంలో నావికా దళానికి చెందిన సైనిక స్థావర నిర్మాణానికి సంబంధించిన ఒక ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. సైనిక స్థావర నిర్మాణంలో భాగంగా రన్ వే నిర్మాణం, ఓడ రేవును అభివృద్ధి చేసే పనులను 2018లో భారత్‌కు చెందిన అఫ్‌కోన్స్ ఇన్‌ఫ్రాస్ట్రెక్చర్‌కు నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్పగించింది. 2019లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

SOURCE: Swarajya