Home News ఇండోనేషియాలో మసీదు లౌడ్ స్పీకర్ల పై ఆంక్షలు

ఇండోనేషియాలో మసీదు లౌడ్ స్పీకర్ల పై ఆంక్షలు

0
SHARE

ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో మసీదు లౌడ్ స్పీకర్లపై కఠిన ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. ప్రతిరోజు మసీదుల నుండి వెలువడే అజాన్ శబ్ద తీవ్రతకు విసిగిపోయిన అక్కడి ప్రజలు భారీ ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు సమర్పించారు. మసీదు నుండి వెలువడుతున్న శబ్ద తీవ్రత కారణంగా  మైగ్రేన్, డిప్రెషన్ వంటి మానసిక, శారీరిక రుగ్మతలకు గురవుతున్నామని ప్రభుత్వానికి తెలిపారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటల సమయంలో లౌడ్‌స్పీకర్‌ మోగడం వల్ల అత్యంత ఆందోళనకు గురవుతున్నామని ప్రజలు తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ సమస్య కారణంగా ప్రజలు సరిగా నిద్రపోలేరు లేదా ఇతర పనులను సరిగ్గా చేయలేకపోయారు.

ఈ సమస్యపై ప్రశ్నిస్తే ఇస్లామిక్ ఛాందసవాదుల చిత్రహింసలతో పాటు కఠినమైన శిక్షలకు గురవుతామనే భయంతో ప్రజలు ఇంతకాలం నేరుగా ఫిర్యాదు చేయడానికి భయపడ్డారు. అయితే ఇప్పుడు ఆన్లైన్ రూపంలో ప్రజల నుండి వచ్చిన పడిన అనేక ఫిర్యాదులతో అక్కడి ప్రభుత్వంలో కదలిక ఏర్పడింది. ఈ పిర్యాదులన్నిటినీ  పరిగణలోకి తీసుకొన్న ఇండోనేషియా ప్రభుత్వం, మసీదు సంస్థలు, స్థానిక ప్రజలతో చర్చలు జరిపి, దేశంలోని మసీదు కౌన్సిల్ సిఫార్సును అనుసరించి మసీదుల లౌడ్ స్పీకర్ల నుండి వచ్చే శబ్ద తీవ్రతను తగ్గించే ఏర్పాట్లు చేశారు.

ఈ నిర్ణయం పట్ల దేశంలోని కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికి ప్రభుత్వం వందలాది మంది సాంకేతిక నిపుణుల సహాయంతో మసీదుల్లోని సౌండ్ సిస్టమ్ లో తగిన మార్పులు చేసింది. ఈ విధానాన్ని దేశ రాజధాని జకార్తాలో అమలు చేసిన తర్వాత మిగతా ప్రాంతాల్లోని దాదాపు 70 వేల మసీదుల్లో కూడా అమలుపరిచారు.

ఇటీవల ఇస్లామిక్ రాజ్యమైన సౌదీ అరేబియాలో ఇలాంటి అనేక కేసులు తెరపైకి వచ్చిన తరువాత, మసీదులలో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల ద్వారా అజాన్ ఇవ్వడానికి తగిన మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి.

Source : ZEE NEWS