Home News యువతపై మావోయిజం యొక్క ప్రభావాన్ని తీవ్రంగా ఖండించాలి – రాష్ట్ర సేవికా సమితి విజ్ఞప్తి

యువతపై మావోయిజం యొక్క ప్రభావాన్ని తీవ్రంగా ఖండించాలి – రాష్ట్ర సేవికా సమితి విజ్ఞప్తి

0
SHARE
యువతపై మావోయిజం యొక్క ప్రభావాన్ని కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని రాష్ట్ర సేవిక సమితి ప్రముఖ సంచాలిక శాంతక్క తాయి తెలిపారు.  అక్టోబర్ 14న నాగపూర్లోని మాధవనగర్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర సేవికా సమితి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  “ఈ సమయం సంఘర్షణకి సంబంధించినది” అన్నారు. అమాయక ప్రజల మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో ఏ ప్రముఖ మానవ హక్కుల సంఘాలు తమ యొక్క గొంతు విప్పలేదని ప్రశ్నించారు. అదే విధంగా అంతర్గత భద్రత విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మణిపూర్ మహిళా వెయిట్ లిఫ్టర్, పద్మ అవార్డు గ్రహీత మీరా చానును ఆమె ప్రశంసించారు.
ఈ సందర్భంగా మీరా చాను మాట్లాడుతూ దేశానికి ఒక పతకాన్ని తీసుకురావాలన్నది తన తల్లి యొక్క కోరిక అని, తల్లి యొక్క కోరిక తీర్చడం కోసం తాను ఈ రంగంలోకి ప్రవేశించి ఆమె కోరిక తీర్చానని తెలియజేశారు. “ఏ రంగంలో అయినా ప్రగతి సాధించాలి అంటే కుటుంబ సభ్యుల సహకారం ఎంతైనా అవసరం” అని ఆమె తెలిపారు.
నాగపూర్ మహానగర కార్యవాహిక కరుణా సహాటే మరియు విదర్భ ప్రాంత కార్యవాహిక రోహిణి హతా వలే కూడా వేదికను అలంకరించారు. వీరితో పాటు నాగపూర్ పూర్వ ప్రముఖ సంచాలిక ప్రమీల తాయి మేథే, నాగపూర్ మేయర్ నందా తాయి జక్చర్ మరియు మహానగర కార్యవాహిక శ్రీమతి కరుణా సాథే మొదలగు వారు కూడా పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ముందుగా  సేవికలందరు  యోగాసనాలు, దండ మరియు వ్యాయామ్ యోగ్ ప్రదర్శించారు.
Source: VSK Bharat