Home Telugu Articles భారతీయ గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలను క్రైస్తవం ఒప్పుకుంటుందా?

భారతీయ గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలను క్రైస్తవం ఒప్పుకుంటుందా?

0
SHARE
“మొదట మేము గిరిజనులం, ఆ తర్వాత క్రైస్తవులం. మేము ప్రకృతి ఆరాధకులం. నదులు, అడవులు, పర్వతాలను ఆరాధిస్తాం” 
– క్రైస్తవ మతం స్వీకరించిన  గిరిజనులు తరచూ చెప్పే మాట ఇది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూ క్రైస్తవంలో ఉండటం సాధ్యపడుతుందా? ఒక్క దేవుడిని మాత్రమే ఆరాధించాలి అని చెప్పే క్రైస్తవం గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను అంగీకరిస్తుందా? ఈ అంశాన్ని పరిశీలిద్దాం.
ముందుగా భారతదేశంలోని ఉత్తరాన గల లడ్డఖ్ నుండి దక్షిణాది రాష్ట్రాల మీదుగా ఈశాన్య రాష్ట్రాల వరకు వ్యాపించిన  అనేక గిరిజన తెగల వివిధ సంస్కృతీ సంప్రదాయాలలోని ప్రాథమిక సారూప్యతను గమనిద్దాం.
1. ప్రకృతి ఆరాధన
2. స్త్రీ దేవతా ఆరాధన 
3. విగ్రహారాధన 
4. పూర్వీకులను ఆరాధించడం 
 
పైన పేర్కొన్న ఏ గిరిజన విశ్వాసాన్నీ క్రైస్తవం ఆమోదించదు. తరతరాలుగా నదీ పరివాహక ప్రాంతాల్లో  ప్రకృతికి అత్యంత సమీపంగా జీవనం సాగిస్తున్న వీరు ప్రకృతిమాత  నిజమైన బిడ్డలు. దీని కారణంగానే అన్ని గిరిజన తెగల సంప్రదాయాల్లోనూ ప్రకృతి ఆరాధన ప్రధానంగా కనిపిస్తుంది.
ప్రకృతి ఆరాధన:
ప్రకృతి ఆరాధన పట్ల క్రైస్తవం వైఖరి ఏమిటి అనేది గమనిద్దాం. క్రైస్తవుల ఏకైక మతగ్రంథంగా భావించే బైబిల్ ‘ప్రకృతి ఆరాధన’ను అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ ప్రకృతి ఆరాధనను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. “ప్రకృతిని కాదు, ప్రకృతిని సృష్టించిన దేవుడిని ఆరాధించాలి, ప్రకృతి ఉన్నది ఆరాధించడానికి కాదు’ అని చెప్పే బైబిల్, ప్రకృతిని ఆరాధించేవారిని రాళ్లతో కొట్టి చంపేవిధంగా శిక్షను కూడా విధిస్తోంది.

“నీ దేవుడైన యెహోవా  నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు, నేనిచ్చిన ఆజ్ఞకు విరోధ ముగా అన్యదేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రుని కైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడేగాని స్త్రీయేగాని నీ దేవుడైన యెహోవా  నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియం దైనను నీ మధ్య కనబడినప్పుడు
అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైనయెడల, అనగా అట్టి హే యక్రియ ఇశ్రాయేలీ యులలో జరిగియుండుట వాస్తవమైనయెడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషు నిగాని స్త్రీనిగాని నీ గ్రామ ముల వెలుపలికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్ట వలెను.”

— ద్వితీయోపదేశకాండం 17:2-4

స్త్రీ దేవతను మాతృమూర్తిగా ఆరాధించడం:
దేవతను మాతృమూర్తిగా భావించి పూజించడం ఇది గిరిజన జాతుల్లో చాలా ముఖ్యమైన ఆరాధనా విధానం. తరతరాలుగా ఈ విధానం కొనసాగుతూ వస్తోంది. 1980లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన గిరిజన దేవతా మందిరం కనుగొన్నారు. భారత్-అమెరికా పురాతత్వ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన సిద్ధి జిల్లాలో జరిపిన పరిశోధనల్లో శక్తి ఆరాధన తాలూకు ఆనవాళ్లు తెలియజేస్తూ 11,000 సంవత్సరాల క్రితం నాటి మానవ నిర్మిత దేవతా మందిరం బయటపడింది. కోల్, బాగా గిరిజన తెగల ప్రజలు ఇప్పటికీ అటువంటి స్త్రీమూర్తుల ప్రతిమలను శక్తికి ప్రతిరూపంగా భావిస్తూ ఆరాధిస్తారు.
కానీ క్రైస్తవం మాత్రం స్త్రీ దేవతారాధనకు పూర్తి వ్యతిరేకం. స్త్రీ దేవతలకు ఆ మతంలో కనీసం చోటు కూడా ఉండదు. క్రైస్తవంలోని ప్రధాన శాఖైన ప్రొటెస్టెంట్ వర్గం ఏసుక్రీస్తును తప్ప  మరెవరినీ దేవుడిగా భావించకూడదు అని చెప్తుండగా, ఇతర వర్గాలైన క్యాథలిక్కులు, ఆంగ్లికన్ క్రైస్తవులు  ఏసుక్రీస్తు తల్లి అయిన మేరీని కేవలం ‘దేవుని తల్లి”గానే భావిస్తారు తప్ప దేవతామూర్తిగా అంగీకరించరు . కాబట్టి గిరిజనుల స్త్రీ దేవతను ఆరాధనను క్రైస్తవం ఏ కోశానా అంగీకరించదు.
విగ్రహారాధన:
భారతీయ గిరిజన తెగల ఆరాధనా విధానంలో విగ్రహారాధన ప్రముఖమైనది. ఒక చిన్న రాతిఫలకం కావచ్చు, రాతితో చేసిన విగ్రహం కావచ్చు, లేదా చెక్కతో తయారుచేసిన ప్రతిమ కావచ్చు, లేదా రాయి లేదా చెక్కపై గీసిన దేవతా రూపం కావచ్చు.. ఇలా అనేక విధాలైన విగ్రహారాధనా పద్ధతులు గిరిజన తెగల్లో మనకు కనిపిస్తుంటాయి. సంతాల్ తెగలకు చెందిన గిరిజన గ్రామాల్లోని పొలిమేరల్లో పవిత్రమైనవిగా భావించే కొన్ని వృక్షాల సముదాయం ఒకటి ఉంటుంది. ఆ ప్రదేశంలో వారి పూర్వీకుల పవిత్రమైన ఆత్మలు సంచరిస్తుంటాయని వారి ప్రగాఢ విశ్వాసం. గ్రామంలోని గిరిజనులు అందరూ ఆ ప్రదేశంలో పండుగలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు గ్రామస్థులు వారికి ఇష్టమైన వస్తువులు, తినుబండారాలు ప్రసాదంగా సమర్పిస్తారు.
కానీ క్రైస్తవం విగ్రహారాధనను కూడా ఒప్పుకోదు. దానిపట్ల తీవ్రంగా మండిపడుతుంది. విగ్రహారాధకులను దారుణంగా శిక్షిస్తుంది.
ఉదాహరణకు ఈ క్రింది బైబిల్ వాక్యాలు పరిశీలిద్దాం:
మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.”
— లేవీయకాండం 26:1
 
” నేను మీ యున్నతస్థలములను పాడు చేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.”
–లేవీయకాండం 26: 30
“మీ బలిపీఠములు పాడై పోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్న ములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను.
ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయెదుట పడవేసి,మీ యెముకలను మీ బలి పీఠములచుట్టు పారవేయుదును.”
–యెహెఙ్కేలు 6: 4, 5
“కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూర ముగా పారిపొండి.”
— 1-కొరింథీయులకు 10: 14
క్రైస్తవం నిర్ధేశించే పరిమితులు – విధించే కఠినమైన ఆంక్షలు:
తమ స్వేచ్ఛాయుతమైన వివిధ ఆరాధనా మార్గాలను అనుసరించే గిరిజనులు.. తాను నిర్ధేశించిన దేవుడిని మాత్రమే ఆరాధించాలి, యేసుక్రీస్తును మానవాళిని పాపాల నుండి, నరకాగ్ని నుండి విముక్తులను చేసే రక్షకుడిగా అంగీకరించాలి అని ఆదేశించే క్రైస్తవంలో ఎటువంటి శాంతిని పొందలేరు. ఎందుకంటే  ప్రకృతి ఆరాధనను పాటించే గిరిజనులు ఒకవేళ క్రైస్తవం తీసుకుని కూడా ‘యేసు మాత్రమే నరకం నుండి విముక్తి కలిగిస్తాడు’ అని విశ్వసించకపోతే అదే క్రైస్తవం ప్రకారం వారు శిక్షార్హులవుతారు. అంతర్లీనంగా ఎన్నో రకాల తాత్విక సిద్ధాంతాలు, విశ్వాసాలు, ఆరాధనా విధానాలు కలిగిన గిరిజన సంప్రదాయం పరిస్థితులకు అనువుగా  అవసరమైతే తమ విధానాల్లో మార్పులను ఆహ్వానించి సంస్కరణలు చేసుకోగలదు.  క్రైస్తవంలో ఇది సాధ్యం కాదు. క్రైస్తవేతరులకు ఆచార వ్యవహారాల్లో పాలుపంచుకోరాదని, వారి ప్రసాదాలు స్వీకరించరాదని స్పష్టంగా ఆదేశించే క్రైస్తవ గ్రంథం బైబిల్,  క్రైస్తవేతరులతో సామజిక సహజీవనాన్ని కూడా ఒప్పుకోదు.
“క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు.
ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.
శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.”
  –2 యోహాను1: 9-11
“దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.”
–2 కొరింథీయులకు 4: 4
“మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?
క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?”
–2 కొరింథీయులకు 6: 14, 15:
ఈ అంశాలను బట్టి గిరిజనులు ఒకవైపు తమ సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూ క్రైస్తవంలో ఉండటం సాధ్యపడే అవకాశం లేదు. ఒక్క దేవుడిని మాత్రమే ఆరాధించాలి అని చెప్పే క్రైస్తవం గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను అంగీకరించదు. కాబట్టి “మొదటి మేము గిరిజనులం, ఆ తర్వాత క్రైస్తవులం. మేము ప్రకృతి ఆరాధకులం. నదులు, అడవులు, పర్వతాలను ఆరాధిస్తాం” అనే మాటకు అర్ధం ఉండదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here