Home News ప్రధాని మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న…  జిహాదీలు, ఖలిస్తానీల అస‌హ‌నం

ప్రధాని మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న…  జిహాదీలు, ఖలిస్తానీల అస‌హ‌నం

0
SHARE
  • అమెరికా అధ్య‌క్షుడు బిడెన్‌కు 2 ద్వేషపూరితమైన లేఖలు 
  • భారత, హిందూ వ్యతిరేక 16 సంస్థలు, 24 చట్టసభల సభ్యుల‌ ద్వేషం

జూన్ 21న ప్రధాని నరేంద్ర మోదీ తన ఐదు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటనను ప్రారంభించారు. ప్రెసిడెంట్ జో బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లారు. ప్రెసిడెంట్ బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ అతిథులుగా  వైట్ హౌస్‌లో జూన్ 22న భారత ప్రధానికి స్టేట్ డిన్నర్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ఆహ్వానం “ప్రజాస్వామ్య దేశాల మధ్య భాగస్వామ్య శక్తికి ప్రతిబింబం” అని అధికారిక  ప్రకటనలో ప్రధాని మోడీ అన్నారు. ఊహించినట్లుగానే, 16 సంస్థలు, 75 మంది సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు రాష్ట్ర విందును నిర్వహించవద్దని లేదా కొన్ని నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలని కోరుతూ అధ్యక్షుడు బిడెన్‌కు లేఖ రాశారు.

జూన్ 7న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్(ఐఏఎంసీ) స్టేట్ డిన్నర్ ఉపసంహకరించుకోవాలని ప్రకటించింది. ఈ మేరకు జో బిడెన్ కు లేఖ రాసినట్లు వెల్లడించింది. అందులో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఐఏఎంసీతో మరో 16 సంస్థలు సంతకం చేశాయి. భారత దేశంలో ప్రజాస్వామ్య తిరోగమనం ఎదుర్కొంటున్నాయని ఆరోపించాయి. అందుకు రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటమే ఉదాహరణగా పేర్కొన్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీ సంబంధించిన విషయాలను ప్రస్తావించాయి. సీఏఏ అనేది కేవలం ఇస్లామిక్ దేశాల్లోని మైనారిటీల కోసమేనని, అది ముస్లింల మత హక్కులను కాల రాస్తుందన్నాయి. అంతేకాకుండా ఎన్ఆర్సీ కారణంగా అస్సాంలో జరిగిన వివాదాలను ఎత్తి చూపాయి.

లేఖలపై సంతకం చేసిన ప్రతి సంస్థలకు భారత, హిందూ వ్యతిరేక కార్యకలాపాల చరిత్ర ఉంది. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్(ఐఏఎంసీ)

రషీధ్ అహ్మద్ ఏఐఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సదరు సంస్థకు సిమి వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి. భారత వ్యతిరేకంగా పని చేసిన గతం ఉంది. అంతేకాకుండా జమాతే ఇస్లామీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ ద్వారా భారత దేశాన్ని బ్లాక్ లిస్టులో చేర్చడానికి అమెరికాలో వివిధ సంస్థలకు ఆర్థికంగా సహకరించింది. ఐఏఎంసీ వ్యవస్థాపకుడు షేక్ ఉబైద్, సభ్యుడు అబ్దుల్ మాలిక్ లు ముజాహిద్ ఇస్లామిక్ సర్కిల్ ఆఫ్ నార్త్ మెరికా సభ్యులు. పాకిస్థాన్ కోసం జమాతే ఇస్లామి అమెరికా ఫ్రంట్ కు నాయకత్వం వహించారు. ప్రస్తుతం ఐఏఎంసీకి నేతృత్వం వహిస్తున్న రషీద్ అహ్మద్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ జాహిద్ మహమూద్ మాజీ పాక్ నేవి అధికారి.

హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్

రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా నేషనల్ ప్రెస్ క్లబ్, స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీ థింక్ ట్యాంక్స్ లో మాట్లాడారు. ఆయన వెంట హిందూస్ ఫర్ హ్యుమన్ రైట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు సునీత విశ్వనాథన్ ఉన్నారు. ఐఏఎంసీతో పాటు ఆ సంస్థ రాసిన లేఖలో సునీత సంతకం చేశారు. అంతేకాకుండా జూన్ 5న తన ట్విట్టర్ ఖాతాలో ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా కాంగ్రెస్ ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగువుతుందని విషం చిమ్మారు. డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ కార్యక్రమాన్ని కూడా ఆమె సమర్ధించింది. డిస్ ఇన్ఫో ల్యాబ్ ప్రకారం హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ 2019లో ఐఏఎంసీ, ఆర్గనైజేషన్ ఫఱ్ మైనారిటీస్ ఆఫ్ ఇండియా అనే రెండు సంస్థల భాగస్వామ్యంలో స్థాపించబడింది. ఈ మూడు సంస్థలు కలిసి అలయన్స్ ఫర్ జస్టిస్ అండ్ అకౌంటబిలీటీ అనే సంస్థను స్థాపించాయి. సునీతా విశ్వనాథ్, సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చే ‘విమెన్ ఫర్ ఆఫ్ఘన్ ఉమెన్’ అనే సంస్థను కూడా నడుపుతున్నారు.

దళితుల సంఘీభావ వేదిక

అమెరికాలో కుల వివక్షకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు చెప్పుకునే సంస్థలలో ఇది ఒకటి. జూన్ 3న (స్థానిక కాలమానం ప్రకారం) అమెరికాలో జరిగిన గాంధీ కార్యక్రమానికి దళిత సంఘీభావ వేదిక ప్రతినిధులు హాజరయ్యారు. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ అందుకు సంబంధించి ఒక ట్వీట్‌ను పంచుకుంది. అమెరికాలో హిందూ వ్యతిరేక కులవివక్ష బిల్లుకు మద్ధతుగా నిలిచింది. అయితే ఆ కేసు కోర్టులో వీగిపోయింది.

జెనోసైడ్ వాచ్

జెనోసైడ్ వాచ్ అనేది భారతదేశం, హిందువులను లక్ష్యంగా చేసుకునే ఒక ప్రచార సంస్థ. భారత దేశంలో మైనారిటీలు మారణహోమం గురించి భయపడుతున్నారు. ఏప్రిల్ 2023 నివేదికలో , సంస్థ అదే పాత సీఏఏ, ఎన్ఆర్సీ భారతదేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నాయి” అంటూ కథనాన్ని ప్రచారం చేసింది. కొన్ని ప్రత్యేక కేసులను ప్రస్తావిస్తూ, వారు జూలై 2022లో అగ్రవర్ణాల కోసం ఉద్దేశించిన కుండలో నీరు తాగినందుకు దళిత బాలుడిని కొట్టి చంపారని పేర్కొంది. రాహుల్ గాంధీని అనర్హులుగా ప్రకటించడం ద్వారా మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని ఎన్నికల నిరంకుశంగా మారుస్తోందని ఆరోపించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముస్లిం చేతుల్లో హిందువులు, ఇతర వర్గాలు హత్య కావడాన్ని ఈ సంస్థ ఎన్నడూ ప్రస్తావించలేదు. కన్హయ్యా లాల్, ఉమేశ్ కోహ్లీ ఇస్లామిక్ వాదులచే దారుణంగా హత్య చేయబడినా, సంఘ్ పరివార్, బిజెపి కార్యకర్తల హత్యల గురించి ప్రస్తావించలేదు.

జూబ్లీ క్యాంపెయిన్

అమెరికా కేంద్రంగా పనిచేసే జూబ్లీ క్యాంపెయిన్ భారత్ కు వ్యతిరేకంగా తరచూ ప్రచారాలను నిర్వహిస్తూ ఉంటుంది. క్రైస్తవులు, ఇతర మైనారిటీలు భారత్ లో సురక్షింగా లేరని ఆరోపించింది. ఈ సంస్థలను కూడా ఐఏఎంసీ పలుమార్లు చర్చా వేదికలకు ఆహ్వానించింది. క్రైస్తవ మత ప్రచారాలకు అనుకూలంగా ఈ సంస్థ పని చేస్తుంది.

ఆసియన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్

ఆసియన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ అనేది అమెరికా-ఆధారిత మిషనరీ సంస్థ. ఇది నేపాల్‌లో విస్తృతంగా పనిచేస్తుంది. దీని వ్యవస్థాపకుడు బ్రయాన్ నెర్రాన్‌ను అరెస్టు చేసి ఏడు నెలల పాటు భారతదేశంలో నిర్బంధించారు. ఇప్పుడు ప్రధాని మోడీని రాష్ట్ర విందుకు ఆతిథ్యం ఇవ్వవద్దని అధ్యక్షుడు బిడెన్‌ను కోరుతూ సంతకం చేసినవారిలో అతని సంస్థ ఒకటి.

కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్

ఈ సంస్థ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ హమాస్‌తో సంబంధాలు కలిగి ఉన్న అమెరికా ఆధారిత ఇస్లామిస్ట్ సంస్థ. ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక ముస్లిం పౌర హక్కుల సంస్థగా తనను తాను గుర్తిస్తుంది. అనేక సందర్భాలలో భారతదేశానికి, హిందువులకు వ్యతిరేకంగా పని చేసింది. ఈ సంస్థ భారతదేశంలో హిందూ ఫోబియా, హిందూ వ్యతిరేక ప్రచారాన్ని తీవ్రంగా  చేస్తోంది. జూన్ 19 న చేసిన ట్వీట్‌లో ప్రధాని మోడీని “ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన, తీవ్రమైన ముస్లిం వ్యతిరేక మూర్ఖుల్లో ఒకడు” అని పేర్కొంది.

లైఫ్ ఫర్ ది నేషన్స్ మిషన్, రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వేలోని చర్చి

ఇది ఉరుగ్వేకు చెందిన క్రిస్టియన్ మిషనరీ సంస్థ. బిడెన్‌కు రాసిన లేఖలో ఈ సంస్థ ఎందుకు సంతకం చేసిందనే కారణాన్ని తెలియలేదు.

గ్లోబల్ క్రిస్టియన్ రిలీఫ్
గ్లోబల్ క్రిస్టియన్ రిలీఫ్ అనేది మిషనరీ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు హింసించబడుతున్నారని పేర్కొంటూ నిధులను సేకరిస్తుంది. డబ్బు వసూలు చేసేందుకు పలు సందర్భాల్లో భారత్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇటీవలి మణిపూర్ హింసాకాండను ప్రస్తావిస్తూ “హిందూ గుంపులు మణిపూర్ రాష్ట్రంలో స్థానిక క్రైస్తవ సమాజంపై దాడులు చేస్తున్నారు” అని పేర్కొంటూ నిధులను సేకరించింది.
అమెరికన్ సిక్కు కౌన్సిల్

అమెరికన్ సిక్కు కౌన్సిల్ అనేది ఖలిస్తాన్ అనుకూల సంస్థ. ఇది క్రమం తప్పకుండా భారతదేశంపై విషం చిమ్ముతుంది. ఇటీవల సంస్థ ఖలిస్థాన్ అనుకూల బోధకుడు అమృతపాల్ సింగ్, అతని అనుచరులకు మద్దతు ఇచ్చింది.

హ్యూమన్ రైట్స్ అండ్ గ్రాస్‌రూట్స్ డెవలప్‌మెంట్ సొసైటీ

నైజీరియాకు చెందిన ఒక సంస్థ మాత్రమే ఇంటర్నెట్ లో మాత్రమే కనిపిచింది. లేఖలో సంతకం చేసినప్పటికీ సదరు సంస్థకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోవడం అనుమానాస్పదం.

ఇంటర్నేషనల్ కమీషన్ ఫర్ దళిత్ రైట్

అట్టడుగు వర్గాల హక్కుల కోసం పని చేస్తుందని చెప్పుకునే ఈ సంస్థ అమెరికా కేంద్రంగా పని చేస్తోంది.అనర్హత వేటు పడిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన వారిలో దాని వ్యవస్థాపక అధ్యక్షుడు డిబి సాగర్ ఒకరు. అమెరికాలో కుల వివక్ష వ్యతిరేక బిల్లుకు మద్ధతునిచ్చింది.

అమెరికన్ ముస్లిం ఇన్స్టిట్యూషన్

ఈ సంస్థ అంబాసిడర్ ఇస్లాం ఎ సిద్ధిఖీ నేతృత్వంలోని వాషింగ్టన్-ఆధారిత ముస్లిం సమూహం. భారతదేశంలో జన్మించిన సిక్కికీ ఒబామా, క్లింటన్ ఇతరులతో సహా అనేక మంది అమెరికా అధ్యక్షుల క్రింద అతను పనిచేశారు. జూలై 2021లో పౌరసత్వ సవరణ (చట్టం) అమల్లోకి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత భారతదేశంపై ఆంక్షలు విధించాలని అధ్యక్షుడు బిడెన్‌కు లేఖ రాసిన 30 మంది సంతకాలలో ఈ సంస్థ ఒకటి.

వరల్డ్ వితౌట్ జెనోసైడ్

వరల్డ్ వితౌట్ జెనోసైడ్ అనేది అమెరికా ఆధారిత సంస్థ, ఇది నకిలీ లేదా తప్పుదారి పట్టించే నివేదికల ఆధారంగా భారతదేశ వ్యతిరేక నివేదికలను బహిరంగంగా ప్రచురించింది. నవంబర్ 2022 లో ఈ సంస్థ ప్రధాని మోడీని “ప్రమాదకరమైన వ్యక్తి” అని పిలిచింది. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పత్రికా, న్యాయవ్యవస్థతో సహా అన్ని ప్రధాన ప్రజాస్వామ్య సంస్థలను కూల్చివేసిందని ఆరోపించింది.

ఇంటర్నేషనల్ డిఫెండర్స్ కౌన్సిల్

ఇంటర్నేషనల్ డిఫెండర్స్ కౌన్సిల్ అనేది అమెరికా-ఆధారిత సంస్థ. ఇది ఫిబ్రవరి 2023లో నమోదు చేయబడింది. స్టాండ్ విత్ కాశ్మీర్, బాయ్‌కాట్ G20 ఇన్ కాశ్మీర్ ప్రచారానికి ఇతర భారత వ్యతిరేక సంస్థలతో పాటు సంతకం చేసిన సంస్థల్లో ఈ సంస్థ ఒకటి. . సంస్థ లేదా దాని వ్యవస్థాపకుల గురించి సమాచారం అందుబాటులో లేదు.

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ పీస్ అండ్ జస్టిస్

ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ పీస్ అండ్ జస్టిస్ అమెరికా ఆధారిత సంస్థ. ఇది భారతదేశాన్ని, బిజెపి-పాలిత భారత ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటుంది. దీనికి ప్రస్తుత అధ్యక్షుడు రెహాన్ ఖాన్ భారతదేశానికి వ్యతిరేకంగా చురుకుగా మాట్లాడుతున్నాడు.