Home News “క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్ ను అడ్డుకోవాలి”

“క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్ ను అడ్డుకోవాలి”

0
SHARE

“క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్ ను అడ్డుకోవాలి”

మ‌తం ముసుగులో క్రైస్త‌వ బాలిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చేప‌డుతున్న ల‌వ్ జిహాద్ ను వ్య‌తిరేకించాల‌ని కేరళలోని తలస్సేరి ఆర్చ్‌డియోసెస్, ఆర్చ్‌బిషప్ మార్ జోసెఫ్ పాంప్లానీ చ‌ర్చిల‌కు చెందిన పాస్ట‌ర్లు క్రైస్త‌వ బాలిక‌లు, వారి త‌ల్లిదండ్రుల‌ను కోరారు. ల‌వ్ జిహాద్ ద్వారా క్రైస్తవ కుటుంబాలకు చెందిన బాలికలను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న ఘ‌ట‌న‌ల‌పై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పాస్టర్ విజ్ఞ‌ప్తి చేశారు. కేరళలోని ఆర్చ్ డియోసెస్ పరిధిలోని చర్చిలలో ఆగస్టు 4 ఆదివారం ఏర్పాటు చేసిన స‌మావేశాల్లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

“ఈ ఎనిమిది రోజుల మేరీ లెంట్ సందర్భంగా, తమ పిల్లలు మతపరమైన తీవ్రవాదుల ఉచ్చులో చిక్కుకున్నప్పుడు నిస్సహాయంగా భావించే తల్లిదండ్రుల అండ‌గా మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం” అని వారు అన్నారు.

“మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న ఈ కాలంలో, పవిత్రమైన తల్లిని గౌరవించినట్లే మనం స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి” అని వారు పేర్కొన్నారు. గత ఏడాది తమరాస్సేరి డియోసెస్‌కు చెందిన క్యాటచెసిస్ విభాగం ‘లవ్ జిహాద్’ గురించి హెచ్చరిస్తూ పుస్త‌కాన్ని విడుదల చేయడం గమనార్హం.

Source : OPINDIA

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here