Home News తెలంగాణలో మరో లవ్ జిహాద్ ఘటన

తెలంగాణలో మరో లవ్ జిహాద్ ఘటన

0
SHARE

తమ కుమార్తెను ప్రేమించి, మతం మార్చినట్టు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రేణుక, మహేష్ దంపతులు హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను ఇస్లాం మతంలోకి మార్చి, ఎవరికీ తెలియకుండా దాచిపెట్టినట్టు వారు పోలీసులకు తెలిపారు. తమ కూతుర్ని చూపించాలంటూ ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రేణుక, మహేష్ దంపతుల కుమార్తె ఇందిర.. కరీంనగర్‌ లోని ఓ ప్రయివేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసింది. అదే కళాశాలకు చెందిన రిజ్వాన్ అనే ముస్లిం యువకుడితో పరిచయం అయ్యింది. అతడిని ప్రేమించిన ఇందిర చదువు పూర్తయ్యాక 2018 జూలైలో ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇందిరను రిజ్వాన్ ఇస్లాం మతంలోకి మార్చి, ఆమె పేరును జుబేరా అని రిజిస్టర్ చేశాడు. తర్వాత ఇద్దరూ హైదరాబాద్ వచ్చి ఉద్యోగాల్లో చేరారు. ఇందిర టెక్ మహీంద్రలో, రిజ్వాన్ మరో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉదోగం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ‘మిమ్మల్ని చూడాలని ఉందంటూ’ ఇందిర శుక్రవారం తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌లకు సంక్షిప్త సందేశం పంపడంతో వారికి అనుమానం వచ్చింది. హుటాహుటిన వారు బంధువులతో కలిసి శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఫోన్‌ చేసినా కుమార్తె నుంచి స్పందన లేకపోవడంతో నేరుగా కూకట్‌పల్లిలోని ఇందిర నివసించే హాస్టల్ కు చేరుకున్నారు. అక్కడ ఆమె గదిలోని సంచుల్లో ఇస్లాం సాహిత్యం ఉండటాన్ని గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు పంజాగుట్ట పోలీస్‌ఠాణాకు వచ్చి ఆందోళనకు దిగారు. 

లవ్‌ జిహాద్‌ పేరుతో మా కుమార్తెను ఇస్లాంలోకి మతం మార్చి వంచించారని తమ కూతురుని ఒక్కసారి చూపించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని వారు విలపించారు. 

ఈ వ్యవహారంపై పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న విలేకరులతో మాట్లాడారు. ‘‘రిజ్వాన్‌, ఇందిర ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు. ఇది లవ్‌ జిహాద్‌ ఎంతమాత్రం కాదు’’ అని ఏసీపీ వివరించారు.
నిజంగా వివాహం జరిగివుంటే ‘మీ కుమార్తెను జాగ్రత్తగా చూసుకుంటామంటూ’ రిజ్వాన్‌ తల్లిదండ్రుల నుంచి హామీపత్రం రాయించి ఇవ్వాలని అభ్యర్థించారు. విచారిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. 

ముందు రోజు మొబైల్ మెసేజ్ చేసిన తమ కుమార్తె ఆ మరుసటి రోజునే అదృశ్యం అవడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను బలవంతంగా సిరియాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఇందిర తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా, తమ కూతురు అదృశ్యం వెనుక పంజాగుట్ట ఎస్ఐ జావేద్ పాత్ర ఉందని ఇందిర తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రిజ్వాన్‌కు మద్దతు పలుకుతూ ఎస్ఐ తమను ఫోన్ ద్వారా బెదిరించినట్లు వారు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డును మీడియాకు అందించారు.

ఇందిర తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు అన్నారు. ఇష్టపూర్వకంగానే రిజ్వాన్‌ను వివాహం చేసుకున్నట్లు ఇందిర తమకు లిఖితపూర్వకంగా లేఖ రాసిచ్చిందని పంజాగుట్టు ఏసీపీ తెలిపారు. అయినప్పటికీ తల్లిదండ్రులు అనుమానాలు నివృత్తి చేసేందుకు విచారణ చేస్తామని చెప్పారు.

తమ కుమార్తెను ఎలాగైన తమకు చూపించి మాట్లాడించాలని ఇందిరా తల్లిదండ్రులు కోరుతున్నారు. ఏ ఘోరం జరగకముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

షూటింగ్ క్రీడాకారిణి తార సహదేవ్ కు విడాకులు మంజూరు చేసిన కోర్టు, ముస్లిం గా మతం మార్చడానికి ప్రయతించిన భర్త

హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చడమే లవ్‌ జిహాద్‌ లక్షం, అంగీకరించిన ముస్లిం సంస్థ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here