Home News మైనర్ కూతురిపై 3 ఏళ్లుగా సామూహిక అత్యాచారం: మదర్సా నిర్వాహకుడు అరెస్ట్

మైనర్ కూతురిపై 3 ఏళ్లుగా సామూహిక అత్యాచారం: మదర్సా నిర్వాహకుడు అరెస్ట్

0
SHARE
• తల్లికి తెలిసే 3 ఏళ్లుగా జరుగుతున్న దారుణం 
• నిందితుడిపై  పోక్సో చట్టం కింద కేసు నమోదు
సభ్య సమాజం తలదించుకునే విధంగా దారుణానికి ఒడిగట్టాడు ఓ ఇస్లామిక్ మదర్సా నిర్వాహకుడు. మైనర్ అయిన తన సొంత కూతురిపై మరో ఆరుగురికితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న అమానవీయ ఘటన కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. కేరళలోని  నీలేశ్వరంలో ఒక మదర్సాలో ఇస్లామిక్ బోధకుడిగా పనిచేస్తున్న వ్యక్తి, పదహారేళ్ల తన కూతురిపై మరో ఏడుగురుతో కలిసి 3 ఏళ్లుగా  అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలిసి కూడా ఆమె తల్లి బయటపెట్టకపోవడం విచారకరం.

ఈ బాధల్ని భరించలేక ఆ  బాలిక తన సమీప బంధువుకు ఈ విషయం తెలియజేయడంతో ఆ తల్లిదండ్రుల రాక్షసత్వం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలిక నుండి వివరాలు సేకరించారు. 

గత మూడేళ్లుగా తన తండ్రి, ఇతర ఇస్లామిక్ బోధకులతో కలిసి  తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, గతంలో తనకు అబార్షన్ కూడా జరిగినట్లు ఫిర్యాదులో వెల్లడించింది. ఇదంతా తన తల్లికి తెలిసినా కూడా పట్టించుకోలేదని బాలిక తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. బాలిక తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కూతురిపై అత్యాచారం జరుగుతున్నా పట్టించుకోకుండా విషయాన్ని  దాచినందుకు  ఆమె తల్లిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Source: Organiser

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here