Home News హైదరాబాద్ పాతబస్తీలో 16 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకొని చిత్ర హింసలకు గురు చేస్తున్న...

హైదరాబాద్ పాతబస్తీలో 16 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకొని చిత్ర హింసలకు గురు చేస్తున్న 65 సం ఒమన్ దేశస్థుడు

0
SHARE

హైదరాబాద్ పాతబస్తీలో 16 ఏళ్ల మైనర్ బాలికను 65 సం. వయసు గల ఒమాన్ దేశస్థుడు తో వివాహం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఒమాన్ దేశంలో చిత్ర హింసలకు గురి అవుతున్న బాలికను ఫోన్ ద్వార తన తల్లితో మాట్లాడుతూ తనను భారత దేశం తీసుకొని రావాలి అని వేడుకుంటున్నది.

బాలిక తల్లి స్థానిక ఫలకనూమ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తన అనుమతి లేకుండా తమ దగ్గరి బందువు, ఆమె భర్త ఇద్దురు కలిసి తన కూతురు వివాహం 65 సం. వయసు గల ఒమాన్ దేశస్థుడు తో పాతబస్తిలోని బర్కాస్ ప్రాంతంలోని ఒక హోటల్ లో రంజాన్ఖా మాసం లో ఖాజీ సమక్షం లో వివాహం చేసి, 5 లక్షలు తీసుకొని తన కూతురును ఒమాన్ దేశం పంపారు అని పేర్కొంది.

తన కూతురు అక్కడ నుండి ఫోన్ లో మాట్లాడుతూ చిత్ర హింసలకు గురి అవుతున్నానని, తనని హైదరాబాద్ తీసుకొనిరావాలి,  అని వేడుకుంటూన్నట్టు పేర్కొంది.

పెండ్లి చేసుకున్న ఒమాన్ దేశస్తుడితో మాట్లాడితే తను 5 లక్షలు ఇచ్చి బాలికను కొన్నాను అని, కావాలంటే తిరిగి ఆ 5 లక్షలు ఇచ్చి మస్కాట్ నుండి పిల్లను తీసుకొని పొమ్మంటున్నాడు అని తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇలాంటి సంఘటనలు హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ముస్లిం పెద్దలు గాని అక్కడి సమాజం గాని దీనిపై ద్రుష్టి పెట్టడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here