Home News నల్లమల్లలో శిధిలావస్థలోఉన్న 11 వ శతాబ్దం నాటి సూర్యదేవాలయము

నల్లమల్లలో శిధిలావస్థలోఉన్న 11 వ శతాబ్దం నాటి సూర్యదేవాలయము

0
SHARE

నల్లమల్ల లో శిధిలావస్థలో ఒక సూర్యదేవాలయము ఉన్నది, ఇది దాదాపు 936 సంవత్సరాల పురాతనమైంది అని భావిస్తున్నారు. ఆత్మకూరుమండలంలో పెద్ద  అనంతపురంలో ఉన్నఈ సూర్య దేవాలయము గురుంచి పూర్తి చారిత్రాత్మక సాక్ష్యాధారాలు అందుబాటులో లేకపోయినప్పటికీ, క్రీ. శ. 1081 లో బాదామి చాణుక్యుల కాలంలో ఈ గుడి అభివృద్ధి చెందినట్లు కొన్ని పురాణాలలో పెర్కొనట్లు చెప్తుంటారు. ప్రస్తుతం ఈ గుడి తెలంగాణలోని మహబూబ్ నాగర్ జిల్లాలో ఉన్నది. ప్రస్తుతం ఈ విధమైన ఆలయాలు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి మరియు నందికొట్కూరు ప్రాంతంలో మనకు దర్శనమిస్తాయి.

రథ సప్తమి వేడుక సూర్య భగవానుడి జన్మ తిధి ప్రకారం మార్గశుద్ధ సప్తమి అనగా ఈ నెల ఫిబ్రవరి 3 నాడు మనకు నిర్వహించుకున్నాము. 1987లో తమిళనాడుకు చెందిన ఒక పరిశోధకుడు ఈ గుడిని ‘త్రికోణ గోపుర ఆదిత్యాలయముగా’ వర్ణిస్తూ దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని ఒక నివేదికను సైతం సమర్పించడం జరిగింది.

ఈ గుడిన సందర్శించిన హన్స్ ఇండియా బృందానికి గుడి ప్రహరీగోడ దాదాపుగా కూలిపోయి, కేవలం లోపలి గోడల ఆధారంగానే గుడి ఉన్నట్టు కనబడుతుంది. గుడిలో ఎలాంటి విగ్రహం కూడా లేదు. గర్భ గుడి 12 చదరపు ఆడుగులు వ్యాపించి ఉన్నది. ఆలయ విమాన గోపురము తన పూర్వ ఆకారాన్ని కోల్పోయి, నేడు కేవలం ఒక్క త్రికోణము మాత్రమే దర్శనమిస్తుంది. గుడి గోపురము ఎనిమిది అడుగుల ఎత్తులో  ఉన్నది. పూర్వం వంద మంది బ్రాహ్మణ కుటుంబాలతో కూడిన ఒక అగ్రహారమునకు చెందినట్లుగా భావిస్తున్నారు.

ఆరు చదరపు కిలోమీటర్లు వ్యాపించి ఉన్న ఈ నగరములో వంద మంది సేవకులు, వారితో పాటు వివిధ సంఘాలకు చెందిన ప్రజల కొరకు ఒక ప్రత్యేక ‘దర్బారు’ ఉండేది అని, ఒక భారీ కంచు గంట మోతతో ప్రజలను మేల్కొని  తమ దినసరి కార్యకలపాలు మొదలు పెట్టె వారు అని అంటారు. ఈ గుళ్ళో ఉన్న తటాకము నందు సంవత్సరానికి తగినంత సరిపడే నీళ్ళు ఉండేవి. ఇది 35 అడుగుల లోతులో రాతిమెట్లతోను,  నాలుగు దిక్కులా సింహం అకారం లో ఉన్న శిల్పాలు ఉండేవి. ఈ నీటిని పంటలకు సైతం ఉపయోగించేవారు.

రాతితో చేసిన ‘ధ్వజస్థంబము’ ద్వార స్థానిక ప్రజలు సమయాన్ని అంచనా వేసే వారని, కాని కొంత మంది దుండగులు గుప్త నిధుల కొరకు దీన్ని ధ్వంసము చేసినట్టు భావిస్తున్నారు.

అనంతపురం గ్రామ పెద్దలు అయిన పెద్ద సుబ్బమ్మ, బాలనాగి రెడ్డి ‘ది హన్స్’ ఇండియా పత్రికతో మాట్లాడుతూ ఈ గుడి ధ్వజ స్థంబము నీడ గ్రామము మీద పడటం వల్ల గ్రామస్తులందరూ వ్యాధి గ్రస్తులై, బలవంతముగా ఊరు విడిచి పెట్ట వలసి వచ్చిందని, దీనికి ఒక సాధువు శాపం కారణం అని తెలియ చేసారు.

కృష్ణదేవరాయలు కాలంలో శ్రీశైలము నుండి పంపిన వజ్రాలు, విలువైన కానుకలను సిద్దాపురానికి చెందిన దోపిడీ ముఠా దోచుకున్నట్టు చెప్తుంటారు. వీటిని కొంత కాలం తరువాత హైదరాబాదును పాలించిన నవాబులు జప్తు చేసుకున్నట్లు, అవే నగలను వజ్రాలను బ్రిటిష్ వైస్రాయ్ ఇంగ్లాండు దేశానికి కు ఎగుమతి చేసినట్లు ఆరోపిస్తారు.

స్థానిక ప్రజలు ఈ గుడి యొక్క చరిత్రను గొప్పతనాన్ని భావితరాల వారికి తెలియ చేయడానికి పురాతన శాఖ వారు ఇక్కడ పరిశోదనలు చేయాలి అని కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here