Home Telugu Articles జాతీయతా భావనే దేశానికి బలం

జాతీయతా భావనే దేశానికి బలం

0
SHARE
4 R

సమాజానికి రక్షణ కవచంగా ఉండేది పరిపాలన. పరిపాలన అనేది పూర్వకాలంలో రాజుల ద్వారా రాజ్యాల పేరుతో జరిగేది. రాజుల కాలంలో కూడా పేరు వేరు కావచ్చుగాని చట్టసభలు, న్యాయవ్యవస్థ, పరిపాలనా విభాగం, రక్షణదళం ఉండేవి. మారుతున్న సమాజంలో రాజుల వ్యవస్థ కూలిపోయి ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ద్వారా పరిపాలన కొనసాగుతోంది. దీనిద్వారా సమాజంలో అనేకమంది పరిపాలకులౌతున్నారు.

రాజులు పరిపాలిస్తున్న సమయంలో ఆయా రాజ్యాల రాజు వంశీయులు బలవంతులుగా ఉన్నంతకాలం ఆయా రాజ్యాలను అనేక సంవత్సరాలు అదే వంశం రాజులు పరిపాలించేవారు. వారు బలహీనమైనప్పుడు పొరుగురాజులు యుద్ధాలు చేసి రాజ్యాలను ఆక్రమించుకునేవారు. వంశ పారంపర రాజులు పరిపాలించిన కాలంలో కూడా ఆయా రాజ్యాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు. సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మికంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించేవారు.

విదేశీ మతాలవారు, విదేశీ సిద్ధాంతాల వారు మన దేశంపై దండయాత్రలు చేసి రాజ్యాలను ఆక్రమించి వారి వారి మతాలను, సిద్ధాంతాలను మన దేశంలో ప్రతిష్ఠించేందుకు విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశారు. వేల సంఖ్యలో దేవాలయాలను నేలమట్టం చేసి వారి వారి మతాలకు సంబంధించిన మాస్కులు, చర్చిలను నిర్మాణం చేసుకున్నారు. విదేశీ మతాల రాజులు మన దేశాన్ని పాలించిన దాదాపు వేయి సంవత్సరాల కాలంలో వారి వారి మతాల స్థాపనకు, దేశ ప్రజలందరిని వారివారి  మతాలలోకి మార్చే ప్రయత్నంలో భాగంగా ఇక్కడి హిందువులను నానా హింసలు పెట్టారు. అత్యాచారాలు చేశారు. ఇక్కడి ప్రజల మాతృభాషలను నిర్మూలించే ప్రయత్నంలో వారి వారి భాషలలో విద్యాలయాలను నడిపారు.

విదేశీమతాల పరిపాలకులకు మన దేశంలో నూకలు చెల్లిన సమయంలో కుట్రపూరితంగా మతప్రాతిపదికగా దేశం రెండు ముక్కలు కావించారు. పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశమైనప్పటికిని మతాధిపత్యమే కొనసాగుచున్నది. భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్యమే కాకుండా దొడ్డిదారిన చొరబడిన ‘సెక్యులర్’ దేశం. ఇలాంటి రాజ్యాంగంలో మెజారిటీ, మైనారిటీ అనే దుష్టసాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. సెక్యులర్ ముసుగులో మైనారిటీలకు వత్తాసు పలుకుతూ అధిక సంఖ్యాకులైన హిందువులను ప్రతి విషయంలో దోషులుగా నిలబెడుతున్నారు. ఈ దేశంలో మైనారిటీలకు బాధ్యతలు లేని హక్కులు కల్పించారు జాతీయ నిష్ఠలేని జాతీయ నాయకులు.

కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న కుటుంబ పాలనను ఒక్క భారతీయ జనతాపార్టీ మినహాయించి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నాయి. దాదాపు ముప్పు ఐదు సంవత్సరాలు బెంగాల్‌ను పరిపాలించిన కమ్యూనిస్టు పార్టీ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించి వారిని ఓటుబ్యాంకుగా మార్చుకున్నారు. కమ్యూనిస్టులు వేసిన దుష్టసాంప్రదాయాన్ని ఈనాడు బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కొనసాగిస్తున్నారు.  రెండు తెలుగు రాష్ట్రాలలోని హిందూ దేవాలయాలు ఎండోమెంట్ ఆధీనంలో ఉంటాయి. వాటిద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయిస్తాయి. ముస్లింలకు మాత్రం విద్య, విదేశీ విద్య, వివాహాలు, పండుగలు, మసీదుల మరమ్మతులకు ముల్లాలు, మౌల్వీల వేతనాలకు వేలకోట్ల రూపాయలు  కేటాయిస్తున్నారు. ఇవన్నీ ముస్లింలపై ప్రేమ కాదు, కేవలం ఓటుబ్యాంకు తాయిలాలు మాత్రమే.

2014లో  భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించడంతో భారత ప్రజలు వారి కల సాకారం చేసుకున్నారు. పూర్తి మెజారిటీ భారతీయ జనతాపార్టీకి ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి రాష్ర్టంలో కూడా బీజేపీకీ పట్టం కడుతూ వస్తున్నారు. ఏ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నా పరిపాలన నిమిత్తం రాజ్యాంగ బద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలకన్నింటికి కూడా ప్రభుత్వం నిర్దేశించిన బాధ్యతలను నిరంతరాయంగా నిర్వర్తించడమే ప్రధాన లక్ష్యం. అనివార్యకారణాలవల్ల ప్రభుత్వం రద్దయినా, ప్రభుత్వ వ్యవస్థలు మాత్రం నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. కేంద్రంలో సుపరిపాలన అందించే ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాలలో కూడా అదే పార్టీ ప్రభుత్వం ఉండాలనేది ప్రజల  కోరిక.

– బలుసా జగతయ్య

Source: VijayaKranthi News

(గమనిక: వ్యాసంలోని అభిప్రాయాలు పూర్తిగా వ్యాసకర్తవి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here