Home News గాల్వన్ వీరులకు స్మారక చిహ్నం

గాల్వన్ వీరులకు స్మారక చిహ్నం

0
SHARE
తూర్పు లడక్ లోని గాల్వన్  లోయలో చైనా సైన్యంతో జరిగిన పోరాటంలో వీర మరణం పొందిన 20మంది భారత సైనికుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. లడక్ లోని దౌలత్  బేగ్ ఓల్డీ ప్రాంతంలో ఈ స్మారక స్థూపాన్ని నిర్మించారు. ఇందులో 20 మంది సైనికులు పేర్లతో పాటు జూన్ 15న జరిగిన ఆపరేషన్ వివరాలు ఉన్నాయి.
కల్నల్ సంతోష్ బాబు నాయకత్వంలో భారత సైనికుల చేసిన వీరోచిత పోరాటాన్ని వివరిస్తూ , కాల్పుల్లో మరణించిన 20 మంది సైనికులను “గాలంట్స్ ఆఫ్ గాల్వన్” అంటూ  అభివర్ణిస్తూ స్మారకం పై రాసి ఉంటుంది.
జూన్,15 2020లో చైనా భారత్  కు మధ్య జరిగిన పోరాటంలో భారత సైనికుల కంటే  తమ సైనికులే ఎక్కువ మంది మరణించినప్పటికీ చైనా సైన్యం అందుకు సంబంధించిన వివరాలను ఎక్కడా వెల్లడించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here