Home News కేర‌ళ: ఉగ్ర‌స్థావ‌రాల‌పై ఎన్‌.ఐ.ఏ దాడులు.. ముగ్గురు అరెస్టు

కేర‌ళ: ఉగ్ర‌స్థావ‌రాల‌పై ఎన్‌.ఐ.ఏ దాడులు.. ముగ్గురు అరెస్టు

0
SHARE

ఇస్లామిక్ స్టేట్ రిక్రూట్మెంట్ కేసుకు సంబంధించి ఉగ్ర కార్య‌క‌లాపాలకు పాల్ప‌డుతున్నకేరళకు చెందిన ముగ్గురు ఇస్లామిక్ వాదుల‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అరెస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా 11 చోట్ల చేసిన సోదాల్లో భాగంగా కేరళలో కన్నూర్, కాసరాగోడ్, మలప్పురం, కొల్లం జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వ‌హించింది. ఈ మేర‌కు ముగ్గురిని అరెస్టు చేసిన‌ట్టు ఎన్ఐఏ పేర్కొంది. అరెస్ట‌యిన వారు మొహమ్మద్ అమీన్, మహ్మద్ అనువర్, డాక్టర్ రహీస్ రషీద్ లుగా ఎన్ఐఏ గుర్తించింది.

మహ్మద్ అమీన్ నేతృత్వంలోని ఇస్లాంవాదుల బృందం వివిధ సోషల్ మీడియా మాధ్యమాల‌లో ఐసిస్ కు సంబంధించిన ప్రచార సాధ‌నాల‌ను నడుపుతున్నార‌ని ఎన్‌ఐఏ ఆరోపించింది. ముస్లిం యువకులను ఐసిస్‌లో చేర్చేకునేందుకు ప‌లు ఉగ్ర కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఎన్ఐఏ పేర్కొంది. దీనికి సంబంధించి ‘చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌కలాపాల నిరోధ‌క చట్టం (UAPA)’ ప్ర‌కారం 17, 18, 18 బి, 20, 38 & 40 సెక్షన్ల 120 బి, 121, 121 ఎ సెక్షన్లు కింద ఎన్‌ఐఏ మార్చి 5న కేసు నమోదు చేసింది.

ఈ ఇస్లాంవాదులు జమ్మూ కాశ్మీర్‌కు వలస వెళ్లి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడాలని యోచిస్తున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.
అరెస్ట‌యిన వారి వ‌ద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్‌లు, సిమ్ కార్డులు, ఐసిస్‌కు సంబంధించిన పత్రాలతో సహా పలు డిజిటల్ పరికరాలను ఎన్ఐఏ జప్తు చేసింది.

Source : ORGANISER 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here