Home English Articles సోష‌ల్ మీడియాలో ఐసిస్ ఉగ్ర‌వాద ప్ర‌చారాన్ని అడ్డుకోండి : ఎన్ఐఏ

సోష‌ల్ మీడియాలో ఐసిస్ ఉగ్ర‌వాద ప్ర‌చారాన్ని అడ్డుకోండి : ఎన్ఐఏ

0
SHARE
  • హాట్‌లైన్ నంబ‌ర్ విడుద‌ల చేసిన ఎన్‌.ఐ.ఏ

సోషల్ మీడియాలో ఐసిస్ (ISIS) ఉగ్ర‌వాద‌ భావజాలాన్ని ప్రచారం చేయడం, యువతను ఇస్లాం ఉగ్ర‌వాదంలోకి మార్చ‌డానికి ప్రయత్నిస్తున్న వ్య‌క్తుల‌పై ఫిర్యాదు చేయడానికి దేశంలోని సామాన్య ప్ర‌జ‌ల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హాట్‌లైన్ నంబర్ 011-24368800 ను విడుదల చేసింది.

తీవ్రవాద సంస్థ‌ల‌కు నిధులు స‌మ‌కూర్చ‌డం, ఉగ్ర దాడుల‌కు సంబంధించి NIA దేశ‌వ్యాప్తంగా వివిధ చోట్ల దర్యాప్తు చేస్తోంది. వీటిలో 37 కేసులు ఐసిస్‌ కు సంబంధం ఉన్నాయ‌ని ఎన్‌.ఐ.ఏ వెల్ల‌డించింది. ఇటీవ‌ల జూన్ లో ఇందుకు సంబంధించి ఎన్ఐఏ కొన్ని కేసులు నమోదు చేసింది. విచార‌ణ‌లో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 168 మంది నిందితులను అరెస్టు చేసింది. 31 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖ‌లు చేసింది. 27 మంది నిందితులను ప్రత్యేక NIA కోర్టు దోషులుగా నిర్ధారించింది.

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా (ISIS) అనేది మధ్యప్రాచ్యంలోని తీవ్రవాద సంస్థలలో ఒకటి. పౌరులపై దాడులకు పాల్ప‌డుతూ క్రూరమైన హింస ద్వారా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనేది సంస్థ ప్ర‌ధాన ల‌క్ష్యం.

సోష‌ల్ మీడియా ద్వారా, ఆన్‌లైన్ లో ప్రచారం ద్వారా భారతదేశంలో ఐసిస్ తన ఉగ్ర‌వాదాన్ని వ్యాప్తి చేయడానికి కొన్ని ఉగ్ర‌వాద సంస్థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని భ‌ద్ర‌తా సంస్థ‌లు వెల్ల‌డించాయి. భార‌త్‌లో అత్య‌ధికంగా కేర‌ళ రాష్ట్రంలో ISIS మాడ్యూల్స్, రిక్రూట్‌మెంట్ జ‌రుగుతోంద‌ని కేర‌ళ‌కు చెందిన కొంత మంది ISIS ఉగ్రవాద సంస్థ‌లో చేరిన కేసులు కూడా న‌మోద‌య్యాయ‌ని ఎన్‌.ఐ.ఏ వెల్ల‌డించింది.

ఐసిస్ ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, హూప్ ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్‌లను ఉపయోగిస్తూ విద్వేష‌పూరిత పోస్టుల‌తో యువ‌త‌ను ఉగ్ర‌వాదం వైపు ఆక‌ర్షిస్తోంది. ఈ విధంగా ఆస‌క్తి చూపిన వ్య‌క్తులతో విదేశాలలో ఉన్న ISIS హ్యాండ్‌లర్లు డార్క్ వెబ్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన సోషల్ మీడియా మాద్యమాల‌ను ఉపయోగించి యువకుల రాడికలైజేషన్ ప్రారంభిస్తారు. ఐసిస్‌ సాహిత్యాన్ని అప్‌లోడ్ చేయడానికి దాన్ని వ్యాప్తి చేయడానికి, ఆన్‌లైన్ కంటెంట్‌ను రూపొందించడానికి, స్థానిక భాషలలో ఉగ్ర‌వాద సాహిత్యాన్ని అనువదించడానికి, మాడ్యూల్స్ స్లీపర్ సెల్‌లను సిద్ధం చేయడానికి, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సేకరించడానికి, ఐఈడీలను సమీకరించడానికి, ఉగ్ర‌వాద దాడుల‌కు నిధులు స‌మ‌కూర్చ‌డానికి వారిని ఉప‌యోగిస్తారు.

అమాయ‌క యువ‌త‌ను ఐసిస్‌లో చేర్చుకోవ‌డానికి భారత్ కేంద్రంగా ప‌ని చేస్తున్న’వాయిస్ ఆఫ్ హింద్ అనే ఆన్‌లైన్ పత్రిక ప్ర‌తీ నెల రిక్రూట్‌మెంట్‌ను ప్రచురిస్తోంది. వివిధ పేర్ల‌తో ఐసిస్ మాడ్యూల్స్ రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్న సంద‌ర్భాలు కూడా ఉన్న‌ట్టు ఎన్‌.ఐ.ఏ విచార‌ణ‌లో తేలింది. 2020 జనవరి లో తమిళనాడులోని స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ Y. విల్సన్ హత్య విచారణలో ఐసిస్ ఉగ్ర‌వాదులు అబ్దుల్ షమీమ్, తౌఫీక్ చేసిన ఆరోపణల ప్రకారం వారు ఐసిస్‌ కు చెందిన అల్-హింద్ మాడ్యూల్‌లో భాగమని తేలింది.

ఖాజా మొయిదీన్, మెహబూబ్ పాషా అనే ఉగ్ర‌వాదుల‌ను విచారించ‌గా వారు ఐసిస్‌ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా భారతదేశంలో ఖిలాఫత్ లేదా ఇస్లామిక్ పాలనను స్థాపించాలనే ల‌క్ష్యంతో దేశంలో ఉగ్ర కార్యాక‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. హిజ్బ్-ఉట్-తహ్రిర్ వంటి ఇతర మాడ్యూల్స్ కూడా బెంగుళూరులో ఉన్నాయి. భారత్ లో హిందూ సంఘాల‌కు చెందిన నాయకులను చంపడానికి కుట్ర‌లు ప‌న్నుతున్న‌ట్టు ఎన్‌.ఐ.ఏ విచార‌ణ‌లో తేలింది.

ఆయుధాలు స‌మ‌కూర్చ‌డం, IEDల తయారీకి శిక్షణ ఇవ్వడానికి దక్షిణ భారత రాష్ట్రాలలోని అడవులలో ఉగ్ర‌వాద శిక్ష‌ణా శిబిరాలు నిర్వహిస్తున్న‌ట్టు కూడా ఎన్‌.ఐ.ఏ ద‌ర్యాప్తులో తేలింది. ఇక్కడ ISIS ఉగ్ర‌వాదులు విదేశీ ఉగ్ర‌వాదుల‌తో రహస్య సమాచార మార్పిడి కోసం డార్క్ వెబ్సైట్ ను ఉపయోగించి IED లను తయారు చేసి పరీక్షించిన‌ట్టు ఎన్‌.ఐ.ఏ విచార‌ణ‌లో తేలింది.

Source : Opindia

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here