Home News బర్మాలో హిందువులు, బౌద్ధులపై ఊచకోత ఒక ప్రచారం కాని విషాదం

బర్మాలో హిందువులు, బౌద్ధులపై ఊచకోత ఒక ప్రచారం కాని విషాదం

0
SHARE

బర్మాలోని రఖాయిన్ – అరకాన్ – రాష్ట్రంలో హిందువులను ‘రోహింగియా’ జిహాదీ బీభత్సకారులు ఊచకోత కోసిన సమాచారం బయటి ప్రపంచానికి ఆలస్యంగా తెలుస్తోంది. ‘రఖాయిన్’ ప్రాంతం నుండి ఇతర దేశాలకు వెల్లువెత్తుతున్న ‘రోహింగియా’లను గురించి జరుగుతున్న ప్రచార ఆర్భాటం అంతా ఇంతా కాదు. ‘‘రోహింగియాలను బర్మా ప్రభుత్వం వెళ్లగొడుతోందన్నది’’ అంతర్జా తీయంగా జరుగుతున్న ఆర్భాటం! కానీ ‘రోహింగియా’ టెర్రరిస్టులు ఆగస్టు 25వ తేదీ నుంచి అనేక రోజులపాటు బౌద్ధులపై, హిందువులపై జరిపిన బీభత్సకాండ గురించి ప్రచారం లేదు. బర్మా – మ్యాన్‌మార్ – నుంచి ‘రఖాయిన్’ ప్రాంతాన్ని విడగొట్టడానికి ‘రోహింగియా’ జిహాదీలు ఏడు దశాబ్దాలకుపై కుట్ర చేస్తున్నారు. బర్మాలో బౌద్ధమతస్థులు అత్యధిక సంఖ్యాకులు. బర్మాలోని అల్పసంఖ్యాక ముస్లింలపై బర్మాలోని ఇతర ప్రాంతంలో దాడులు జరగడం లేదు, బౌద్ధులు ఇస్లాం మతస్థులను తరిమివేయడం లేదు. ‘రఖాయిన్’ ప్రాంతంలో మాత్రం ‘రోహింగియా ముస్లింలు’ అత్యధిక సంఖ్యాకులు. రఖాయిన్ ప్రాంతంలోని అల్పసంఖ్యాకులైన హిందువులపై, బౌద్ధులపై ‘రోహింగియా’ జిహాదీ టెర్రరిస్టులు దశాబ్దాలుగా హత్యాకాండ జరుపుతున్నారు.. అత్యాచారాలు జరుపుతున్నారు. ఈ హత్యాకాండ ఫలితంగా ‘రఖాయిన్’ ప్రాంతంలోని బౌద్ధులు, హిందువులు బర్మాలోని ఇతర ప్రాంతాలకు పారిపోవాలన్నది ‘రోహింగియా’ బీభత్సకారుల పథకం! అలా అల్పసంఖ్య మతస్థుల నిర్మూలన జరిగినట్టయితే ‘రఖాయిన్’ ప్రాంతంలో ఇస్లాం మతస్థులు మాత్రమే మిగిలి ఉంటారు. అలా వంద శాతం ఇస్లాం మతస్థు లుంటే ‘రఖాయిన్’ ప్రాంతాన్ని బర్మానుంచి విడగొట్టి ప్రత్యేక స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయా లన్నది ‘రోహింగియా’ టెర్రరిస్టుల దీర్ఘకాల పథకం… ఈ ‘పథకం’లో భాగంగానే ఇటీవలి కాలంలో హిందువులపై, బౌద్ధులపై ‘రఖాయిన్’లో భయంకరమైన, పైశాచికమైన దాడులు మళ్లీ మొదలయ్యాయి! అరకాన్ రోహింగియా సాల్వేషన్ ఆర్మీ – అరకాన్ రోహింగియా విముక్తి సాధక సేన – ఏఆర్‌ఎన్‌ఎ – అన్న కొత్త జిహాదీ ‘ముఠా’ ఆగస్టు 25 నుంచి పెద్ద ఎత్తున ఈ పైశాచిక కాండ ప్రారం భించింది. బౌద్ధులను, హిందువులను పెద్ద సంఖ్యలో హత్యచేసి మృతదేహాలను గోతులు తీసి పూడ్చి పెట్టడం ‘ఏఆర్‌ఎన్‌ఏ’ బీభత్స వ్యూహంలో భాగం! ఇలా ఊచకోతకు గురైన హిందువుల మృతదేహాలను సైనికులు కనుగొంటున్నారు…

సెప్టెంబర్ 24వ తేదీన ‘రఖాయిన్’ ప్రాంతంలోని ‘వామాక్ష’ అన్న గ్రామంలో ఒకేచోట పూడ్చివేతకు గురైన ఇరవై ఎనిమిది హిందూ మృతదేహాలను బర్మా ప్రభుత్వ భద్రతా దళాల వారు కనుగొన్నారు. బౌద్ధులు, హిందువులు అధిక సంఖ్యలో ఉండిన ఈ గ్రామంపై ‘ఏఆర్‌ఎస్‌ఏ’ బీభత్స మూకలు దాడిచేసి అనేకమందిని హతమార్చారు. ఈ హత్యాకాండ తరువాత మిగిలిన బౌద్ధులు, హిందువులు గ్రామాన్ని ఖాళీచేసి పారిపోవడంతో గ్రామం నిర్జనమై పోయిందట! ఈ సమాచారం గురించి అంతర్జాతీ యంగా ప్రచారం లేదు, ‘ఐక్యరాజ్యసమితి’ వారికి ఈ అల్పసంఖ్య ప్రజలు హతమారిపోవడం పట్టలేదు. రెండురోజుల తరువాత ఇదే గ్రామం సమీపంలో మరో పదిహేడు మంది హిందువుల మృతదేహాలను బర్మా సైనికులు గుర్తించారు! ‘ఏఆర్‌ఎన్‌ఎ’ బీభత్స మూకల దాడికి ఇంకా ఎందరు హిందువులు హతమయ్యారో తెలియదని బర్మా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ‘వామాక్షి’ గ్రామం ఉన్న ‘క్షామీ హంగసా’ జిల్లా నుండి దాదాపు ముప్పయి ఐదువేల మంది బౌద్ధులు, హిందువులు ఆగస్టు 25వ తేదీనాటి దాడుల తరువాత పారిపోయినట్టు బర్మా సైనిక అధికారులు వెల్లడించారు! ఈ ప్రాంతంలోని గ్రామాలలో ‘ఏఆర్‌ఎస్‌ఏ’ హంతకులు హిందువులను పెట్టిన చిత్రహింసగురించి విచిత్ర విషాద కథనాలు ఆలస్యంగా ప్రచారవౌతున్నాయి. హిందువులను ఇళ్ల నుంచి బయటికి లాగి చేతులను వెనక్కి విరిచికట్టి కత్తులతో కుమ్మి చంపిన కథనాలు హృదయ విదారక స్థితికి కొన్ని ఉదాహరణలు మాత్రమే!!

ఇదంతా బర్మాలోకి చొరబడిన ‘అఫ్ఘానీ అల్‌ఖాయిదా’ మూకలు స్థానిక ‘జిహాదీ’లతో జట్టు కట్టిన తరువాత ప్రబలిన బీభత్సకాంత. వివిధమైన పేర్లతో చెలామణి అవుతున్న బర్మాలోని జిహాదీ ముఠాల వారు అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబడిన జిహాదీలు ‘రఖాయిన్’ ప్రాంతంలో అనుసంధానమై ఉన్నారు. ఈ అనుసంధానాన్ని సాధించింది పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ‘ఐఎస్‌ఐ’! పాకిస్తాన్ ‘నిఘా’ విభాగంగా చెలామణి అవుతున్న ‘ఐఎస్‌ఐ’ – ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ – నిజానికి బీభత్స కలాపాల సూత్రధారి. మన దేశంలోని జమ్మూకశ్మీర్‌లోని కశ్మీర్ లోయ ప్రాంతంలో క్రీస్తుశకం 1947 నాటికి జనాభాలో ఇరవై ఏడుశాతం హిందువులు! కానీ దేశ విభజన జరిగిన తరువాత 1947 అక్టోబర్‌లో కశ్మీర్‌లోకి చొరబడిన పాకిస్తానీ జిహాదీలు లోయ ప్రాంతంలోను జమ్మూ ప్రాంతంలోను ఉండిన వేల హిందువులను ఊచకోత కోశారు! నిరంతరం కొనసాగిన ఈ ‘జిహాదీ’ బీభత్సకాండ ఫలితంగా 1989నాటి ‘లోయ’ ప్రాంతంలోని హిందువుల సంఖ్య నాలుగు శాతానికి దిగజారింది. అత్యల్ప సంఖ్యలోని ఈ అవశేష హిందువులను కూడా పాకిస్తాన్ సమర్థక జిహాదీ ఉగ్రవాదులు 1989, 1990 సంవత్సరాలలో నిర్మూలించారు. వేలాది హిందువులు ‘లోయ’ను వదలి, తరతరాలుగా తాము నివసించిన జమ్మూ స్థలాలను వదలి ప్రాణావశిస్టులై జమ్మూకు దేశంలోని ఇతర ప్రాంతాలకు పారిపోయి వచ్చేశారు! శతాబ్దాలకు పూర్వం కశ్మీర్ లోయ ప్రాంతంలో వంద శాతం ఉండిన హిందువులు నేడు అక్కడ ‘సున్నా శాతం’ కావడానికి కారణం పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ హత్యాకాండ! ఇదే పథకాన్ని బర్మాలోని ‘అరవాన్’ లేదా ‘రఖాయిన్’ ప్రాంతంలో ‘రోహింగియా’ జిహాదీలు దశాబ్దాలుగా అమలు జరుపుతున్నారు.

కశ్మీర్ ‘లోయ’లో ఈ జిహాదీల కుట్ర సఫలమైంది. కానీ బర్మాలోని ‘రఖాయిన్’లో ఈ కుట్ర విఫలమైంది! రెండు దేశాలలోను ‘కుట్ర’ స్వభావంలో సమానత్వం ఉంది. ‘కశ్మీర్’లో హిందువులను నిర్మూలించడం ద్వారా కశ్మీర్‌ను మన దేశం నుండి విడగొట్టాలన్నది పాకిస్తాన్ ప్రేరిత షడ్యంత్రం! ‘రఖాయిన్’లో బౌద్ధులను, హిందువులను నిర్మూలించడం ద్వారా ఆ ప్రాంతాన్ని బర్మా నుండి విడగొట్టాలన్నది ‘రోహింగియా’ జిహాదీల కుట్ర! ‘లోయ’ ప్రాంతంలో జిహాదీలను మన ప్రభుత్వాలు అణచివేయలేక పోయాయి. ‘రఖాయిన్’లో జిహాదీలను బర్మా ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది… ఇదీ అంతరం!

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here