Home News రచయిత జావేద్‌ అక్తర్‌పై ఎఫ్‌ఐఆర్ న‌మోదు

రచయిత జావేద్‌ అక్తర్‌పై ఎఫ్‌ఐఆర్ న‌మోదు

0
SHARE

ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌పై ముంబై పోలీసులు సోమవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ముంబైకి చెందిన న్యాయవాది సంతోష్‌ దూబే ఫిర్యాదు మేరకు ములుంద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ సందర్భంగా సంతోష్‌ దూబే మాట్లాడుతూ ఇంతకు ముందు జావేద్‌ అక్తర్‌కు లీగల్‌ నోటీసు పంపానని, ఇందులో వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కోరినట్టు తెలిపారు.

ఆ నోటీసుకు ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్‌ 500 కింద పరువు నష్టం కేసు నమోదు చేసినట్టు ములుంద్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి ఒకరు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here