Home Ayodhya ఆగ‌స్టు-5: అయోధ్య‌లో రామ మందిర నిర్మాణ భూమిపూజకు నేటితో ఏడాది

ఆగ‌స్టు-5: అయోధ్య‌లో రామ మందిర నిర్మాణ భూమిపూజకు నేటితో ఏడాది

0
SHARE

భార‌త‌దేశంలోని హిందువులు ఎన్నో సంవ‌త్స‌రాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య‌లోని రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జ‌రిగి నేటితో (ఆగ‌స్టు -5) ఏడాది పూర్తయింది. ప్రధాని న‌రేంద్ర‌మోడీ, ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్ ప‌ర‌మ‌పూజ్య‌నీయ మోహ‌న్ భాగ‌వ‌త్ జీ, ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్, గ‌వ‌ర్న‌ర్ ఆనంది బెన్ ప‌టెల్‌ ఆధ్వ‌ర్యంలో వేద పండితుల స‌మ‌క్షంలో భూమి పూజ అట్ట‌హాసంగా జ‌రిగింది. భూమి పూజ జ‌రిగిన కొద్ది రోజుల‌కే మందిర నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. సిబిఆర్‌ఐ రూర్కీ, ఐఐటి మద్రాస్‌తో పాటు ఎల్ అండ్ టి ఇంజనీర్ల స‌మ‌క్షంలో మందిర నిర్మాణ పనులు కొన‌సాగుతున్నాయి. అయోధ్య రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి శ్రీ చంద్రకాంత్ సోంపురా. 78 ఏళ్ల శ్రీ చంద్రకాంత్ సోంపురా రామమందిర నిర్మాణానికి వాస్తు, నిర్మాణ రూపకల్పనకు సంబంధించి ప్ర‌ణాళిక అందిస్తున్నారు.

నిధిస‌మ‌ర్ఫ‌ణ‌…
అయోధ్య రామ‌మందిర నిర్మాణంలో ప్ర‌తీ ఒక్క రామ భ‌క్తుడిని భాగ‌స్వాముల‌ను చేయాల‌నే ఉద్దేశంతో నిధి స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మానికి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు పిలుపునిచ్చింది. జ‌న‌వ‌రిలో ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మంలో రెండు నెల‌ల పాటు సాగింది. ఈ నిధిస‌మ‌ర్ప‌ణ‌ స‌మ‌యంలో ఎన్నో అపురూప ఘ‌ట్టాలు చోటు చేసుకున్నాయి. పేద‌, ధ‌నిక, చిన్న‌, పెద్ద‌, కులం, మ‌తం తో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ నిధి స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొని వారి భ‌క్తిని చాటుకున్నారు.


ఇదిలా ఉండ‌గా… ఇటీవ‌ల‌ కొంత మంది వ్య‌తిరేకులు మాత్రం మందిర నిర్మాణానికి అవ‌రోధాలు సృష్టించాడానికి కుట్ర‌ల‌కు పాల్ప‌డ్డారు. మందిరానికి సంబంధించిన భూమి విష‌యంలో ట్ర‌స్టు క‌బ్జాకు పాల్ప‌డింద‌ని కొంత మంది అస‌త్యాల‌ను ప్ర‌చారం చేశారు. దీనిపై స్పందించిన తీర్థ క్షేత్ర ట్ర‌స్టు… మందిరానికి సంబంధించిన‌ భూమి విష‌యంలో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని.. వాస్త‌వంగా జ‌రిగిన పూర్తి వివ‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించింది. దీంతో మందిర నిర్మాణాన్ని అడ్డంకులు సృష్టించాల‌నుకున్న వారి ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది.

Read Alsoతీర్థ క్షేత్ర భూసేకరణలో ఎలాంటి అవకతవకలు జరగలేదు

2023 డిసెంబర్ నుంచి రామ మందిరంలో దర్శనం
ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న మందిర ప‌నులు 2023 చివరికల్లా గర్భగుడి నిర్మాణం పూర్తి చేసి భక్తుల దర్శనానికి వీలుగా ఆలయ ద్వారాలు తెరవాలని మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టు భావిస్తోంది. “2023 చివరికల్లా మందిర నిర్మాణం పూర్తి చేయాలని అనుకున్నాం. అందుకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. అప్పటికల్లా రాముడిని దర్శించుకొనే భాగ్యం భక్తులకు కలుగుతుంది” అని ట్రస్టు వర్గాలు చెబుతున్నాయి. 2025 సంవత్సరం నాటికి అయోధ్యలో మొత్తం రామాలయ సముదాయాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. దేవాలయ సముదాయంలో మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్‌, పరిశోధనా కేంద్రం కూడా అందుబాటులోకి రానున్నాయి.

ఆలయ విశేషాలు
మందిరంలో మూడు అంతస్తులు, ఐదు మండపాలు ఉంటాయి. ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో 160, తొలి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి గర్భగుడి శిఖరం 161 అడుగుల ఎత్తు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here