Home News బెంగాల్ హింస గురించి అందరూ స్పందించాలి: బిజేపి ప్రతినిది సంబిత్ పాత్ర

బెంగాల్ హింస గురించి అందరూ స్పందించాలి: బిజేపి ప్రతినిది సంబిత్ పాత్ర

0
SHARE

బెంగాల్ హిందువులపై జరిగిన దాడి, హింస పట్ల విచారం వ్యక్తం చేసిన బిజెపి అధికార ప్రతినిది సంబిత్ పాత్ర.. ప్రస్తుత క్లిస్ట  సమయంలో దేశానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్  షా తదితరుల పట్ల విశ్వాసం ఉంచాలని కోరారు. బెంగాల్ అధికారిక పార్టీ మమతా బెనర్జీ ప్రోద్బలంతోనే హింస జరిగిందని, ఇందులో టీఎంసీ రాజకీయ ప్రత్యర్ఠులు ముఖ్యంగా బి‌జే‌పికి చెందిన 30 కార్యకర్తలు చనిపోయారని ఆయన అన్నారు. రాజకీయ హింసలో చనిపోయిన వారిని  పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని,  దాంతో పాటు హిందూ సమాజానికి సహాయ సహకారాలు అందివ్వడానికి అందరూ ముందుకు రావాలని కోరారు.

బెంగాల్ లో అనిశ్చితి – కారణాలు -పరిష్కారాలు” అనే అంశం పై ప్రజ్ఞాభారతి, తెలంగాణ మే 24 నాడు నిర్వహించిన వెబినార్లో ముఖ్య వక్తగా పాల్గొన్నఆయన ప్రస్తుత సమస్య గురించి మాట్లాడారు.

చరిత్రాత్మకంగా దేశ స్వాతంత్ర ఉద్యమంలో బెంగాల్ ఎంతో మంది దేశ భక్తులను అందించింది, కానీ గత 70 సం లలో గతి తప్పిన రాజకీయాల వలన పూర్తి వాతావరణం మారిపోయిందన్నారు.  1947, 1971 లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలను ఒక ఓట్ బ్యాంక్ గా పరిగణిస్తూ ఉండడం కూడా ఒక ప్రధాన కారణం అన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దు నదీ పరీవాహక ప్రాంతం కావడంతో పాటు చిన్న చిన్న ద్వీపాలు ఉండడం వల్ల చొరబాటుదారులను గుర్తించడం ఒక సమస్య గా మారిందన్నారు.

గత 20 సం. లలో బంగ్లాదేశ్ చొరబాటుదారుల కారణంగా బెంగాల్ లోని 294 సీట్లలో 54 సీట్లు సంపూర్ణంగా ముస్లిం ఆధిక్యత కలిగిన ప్రాంతాలు కావడం, 100 సీట్లలో వారు ప్రధాన ఓట్ బ్యాంక్ గా మారడం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందన్నారు.

అసెంబ్లి ఎన్నికల ఫలితాలు వచ్చిన మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. దాంతో పాటు మీడియా ద్వంద్వ వైఖరిని ఖండిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేసే జర్నలిస్టులు ఈసారి మాత్రం బెంగాల్ కు వెళ్లకుండా, ఉద్దేశపూర్వకంగా మౌనం వహిస్తూ , హింసాత్మక ఘటనలను తప్పుదోవ పట్టించడానికి నిజ నిర్ధారణ అవసరమంటూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారని సంబిత్ పాత్ర ఆరోపించారు.

గత 100 సంవత్సరంలో బెంగాల్ లో జరిగిన రాజకీయ పరిణామాలను చెబుతూ 1905 లో చేపట్టిన బెంగాల్ విభజన వ్యతిరేకించిన సమాజం, 1947 లో బెంగాలీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి దేశ విభజనను మౌనంగా అంగీకరించింది. తరువాత 20 సంవత్సరాల పాటు కాంగ్రెస్ రాజకీయాలు, వాటికి ప్రత్యామ్నాయంగా వచ్చిన నక్సల్బరీ ఉద్యమం వలన సమాజంలోని ఒక తరం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని ఆయన గుర్తు చేశారు. కమ్యూనిస్ట్ ల పాలనలో ఎలాంటి పారిశ్రామిక ప్రగతి లేకపోవడంవల్ల అలముకున్న నిరాశ నిస్పృహలను ఆసరా చేసుకుని మమతా నేతృత్వ లోని టిఏంసి ప్రత్యామ్నాయ శక్తిగా మారి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఇదే టిఏంసి తమ రాజకీయ ప్రత్యర్థుల పై దాడి చేస్తూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది. కానీ నిరంతర ప్రయత్నం, కృషి వలన గత  10-15  సంవత్సరాలుగా బి‌జే‌పి బలపడిందని అన్నారు. పార్టీని బలపర్చే క్రమంలో ఎంతోమంది పార్టీ కార్యకర్తలు ప్రాణాలను సైతం బలిదానం చేశారన్నారు.

కేంద్ర ప్రభుత్వం,  రాష్ట్రపతి పాలన ఎందుకు విధించలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ సమస్యను అన్ని కోణాల నుంచి చూస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అన్నీ వివరాలు బహిరంగంగా వెల్లడించడం సరికాదని సమాధానమిచ్చారు.  బంగ్లాదేశ్ చొరబాటుదారులు ప్రధాన సమస్య అని , దాంతో పాటు జనాభా సమతుల్యత మారిపోవడం ఒక ప్రణాళిక బద్దంగా జరగడం వలన ఓటింగ్ లో మార్పు ఉందన్నారు. ఇప్పటి వరకు జమ్ము కాశ్మీర్ లో 370అధికరణ తొలగింపు, రామమందిర నిర్మాణం వంటివి పూర్తి చేయగలిగామని, పౌరసత్వ సవరణ చట్టం అమలుకు అనేక అడ్డంకులు వస్తున్నాయని సంబిత్ పాత్ర వివరించారు. సమస్యలు వచ్చినప్పుడు కేవలం చర్చలు చేయడం, ప్రశ్నించడానికే పరిమితం కాకుండా ఎవరికి తోచిన స్థాయిలో వారు ఆ సమస్యలపట్ల ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

అంతకుముందు ప్రజ్ఞాభారతి ఛైర్మన్ పద్మశ్రీ శ్రీ టి హనుమాన్ చౌదరి గారు మాట్లాడుతూ బంగ్లాదేశీ చొరబాట్ల వలన హిందువుల జనాభా తగ్గి 65 శాతానికి పడిపోవడం, హైందవేతరులు కలిసికట్టుగా ఒకే పార్టీ పట్ల తమ విధేయత తెలపడం టిఎంసి అధికారం లోకి రావడానికి ముఖ్య కారణమని అన్నారు. హిందువులలో ఉన్న చీలికల వలన సమాజం నస్టపోతున్నదని విచారం వ్యక్తం చేశారు.

Source: Nijam Today