Home News 27 దేవాలయాలను కూల్చి… మ‌సీదు నిర్మించారు – పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్‌

27 దేవాలయాలను కూల్చి… మ‌సీదు నిర్మించారు – పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్‌

0
SHARE

ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదును నిర్మించడానికి 27 దేవాలయాలను కూల్చివేశారని ప్ర‌ఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్య‌క్ర‌మంలో మహమ్మద్ మాట్లాడుతూ “కుతుబ్ మినార్ సమీపంలో గణేశ దేవాలయంతో సహా అనేక దేవాలయాల అవశేషాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అక్క‌డ ఒక దేవాలయం ఉండేద‌ని రుజువు కూడా ఉంది” అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఢిల్లీ టూరిజం వెబ్‌సైట్ లో 73 మీటర్ల ఎత్తైన కుతుబ్ మినార్‌ను 27 హిందూ, జైన దేవాలయాల నుండి పొందిన వస్తువులను ఉపయోగించి నిర్మించినట్లు స్పష్టంగా పేర్కొంది. ఢిల్లీ మొదటి ముస్లిం పాలకుడు, కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ ఢిల్లీ చివరి హిందూ పాలకుడు పృథివీరాజ్ చౌహాన్‌ను ఓడించాడ‌ని, దీని తూర్పు ద్వారంపై ఉన్న ఒక శాసనంలో 27 హిందూ దేవాలయాలను కూల్చి ఆ వస్తువులతో మ‌సీదు నిర్మించిన‌ట్టు తెలిపుతుంది అని వెబ్‌సైట్‌లో పేర్కొంది.

అయితే ఇది అసలైన‌ ఇస్లామిక్ నిర్మాణమని కెకె మహ్మద్ తెలిపారు. గజిని, ఘోరీ ఇతర మొఘల్ పాలకుల కాలంలో ఇలాంటి మినార్లు నిర్మించార‌ని చెప్పారు. మధ్యయుగ కాలంలో చాలా తప్పులు జరిగాయన్నారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలకు సంబంధించి రెండు సంఘాలకు బాధ్యత ఉంది. కమ్యూనిస్ట్ చరిత్రకారులు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే వారు సత్యాన్ని దాచడానికి ప్రయత్నించడం. దేవాలయాలను కూల్చివేయడం వాస్తవం, నిజాన్ని దాచిపెట్టడం వల్ల ప్రయోజనం లేదు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణంలో జాప్యం చేసిన ముస్లింలను రెచ్చగొట్టడానికి కమ్యూనిస్టు చరిత్రకారులు కారణమని ఆయన ఆరోపించారు.

ప్రధాన మసీదు లోపలి, బయటి ప్రాంగణాన్ని కలిగి ఉంది, షాఫ్ట్‌లతో అలంకరించబడింది. చుట్టూ పిల్లర్ ఉంటుంది. ఈ షాఫ్ట్‌లలో ఎక్కువ భాగం 27 హిందూ దేవాలయాలకు చెందినవి, వీటిని మసీదు నిర్మించడానికి దోచుకున్నారు. అందువల్ల, ముస్లిం మసీదుకు విలక్షణమైన హిందూ అలంకారాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని క్రీ.శ.1200లో ఐబాక్ ప్రారంభించాడు. అయినప్పటికీ, అతను నేలమాళిగను మాత్రమే పూర్తి చేయగలడు. అతని వారసుడు ఇల్ టిట్‌మిష్ నిర్మాణానికి మరిన్ని అంతస్తులను నిర్మించారు. తరువాత 1368లో, ఫిరోజ్ షా తుగ్లక్ భవన చివరి అంతస్తును నిర్మించాడు.

మ‌సీదు ఉన్న‌ స్థలంలో చాలా వినాయకుడి విగ్రహాలు కనిపించాయి. ఇది పృథ్వీరాజ్ చౌహాన్‌తో సహా చుహాన్‌ల రాజధాని. దాదాపు 27 హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల శిథిలాల మీద అదే అంశాలను ఉపయోగించి ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదు నిర్మించారు. ఆ స్థలంలో మసీదు నిర్మించేందుకు 27 దేవాలయాలను ధ్వంసం చేసినట్లు అరబిక్ శాసనాల ద్వారా మీరు స్పష్టంగా ఆధారాలు కనుగొనవచ్చు.

వినాయ‌క‌ విగ్రహాలను తొలగించ‌వ‌ద్దు… ఏఎస్ఐకి ఢిల్లీ కోర్టు ఆదేశాలు

ఇటీవల, NMA ప్రాంగణం నుండి వినాయ‌కుడి విగ్రహాలను తరలించాలని కోరినట్లు నివేదికలు సూచించాయి. అయితే, ఢిల్లీ కోర్టు ఈ ఉత్తర్వుపై స్టే విధించింది. విగ్రహాలను తొలగించవద్దని పురావ‌స్తు శాను ఆదేశించింది. అద‌న‌పు జిల్లా జడ్జి నిఖిల్ చోప్రా ఈ విషయంపై కోర్టు ముందు విచారణ జరిగే వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పురావ‌స్తు శాఖ‌ను ఆదేశించారు. ఈ అంశంపై మే 17న విచారణ జరగనుంది.

జైన ఆరాధ్య దైవం తీర్థంకరుడు లార్డ్ రిషభ్ దేవ్ తరపున న్యాయవాది హరి శంకర్ జైన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు నుండి ఆదేశాలు వచ్చాయి. కుతుబ్దీన్ ఐబాక్ 27 దేవాలయాలను కూల్చివేశారని, శిథిలాల నుండి వచ్చిన వస్తువులను ఉపయోగించి కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదును నిర్మించారని పిటిషన్ పేర్కొంది. ఆవరణలో రెండు గణేశుడి విగ్రహాలు ఉన్నాయని, పురావ‌స్తు శాఖ వాటిని తొలగించి కేవలం కళాఖండాలుగా నేషనల్ మ్యూజియంలో ఉంచే అవకాశం ఉందని న్యాయవాది జైన్ తెలిపారు.
ఈ సముదాయంలోని పురాతన దేవాలయాలను పునర్నిర్మించాలని, హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించాలని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం గమనార్హం.

అయోధ్య తవ్వకాల బృందంలో కెకె మహమ్మద్

ప్రొఫెసర్ విబి పాల్ నేతృత్వంలోని అయోధ్యలో త్రవ్వకాల బృందంలో చేరిన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీ బృందంలో కెకె మహమ్మద్ ఒక స‌భ్యుడిగా ఉన్నారు. అయోధ్య తవ్వకాలలో దొరికిన ఆలయ శిధిలాల గురించి మొహమ్మద్ బహిరంగంగా అనేక సంద‌ర్భాల్లో మాట్లాడాడు. ఆ స్థలంలో కూల్చివేసిన ఆలయంలోని స్తంభాలు, స్లాబ్‌లు, ఇతర భాగాలను ఉపయోగించి వివాదాస్పద నిర్మాణాన్ని నిర్మించే అవకాశాల‌ను ఆయ‌న వివ‌రించారు.