Home News హిందూ వృద్ధి రేటుపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన రఘురామ్ రాజన్

హిందూ వృద్ధి రేటుపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన రఘురామ్ రాజన్

0
SHARE
“హిందూ వృద్ధి రేటు” కారణంగా భారతదేశం ప్రమాదాపు అంచుల్లో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర రఘురామ్ రాజన్ హేయమైన వ్యాఖ్యలను ఇటీవల చేశారు. అందుకు కారణాలుగా దేశంలోని ప్రైవేట్ రంగంలో పరిమిత పెట్టబడులు, అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ వృద్ధి తగ్గడం వంటివి చెప్పుకొచ్చారు. రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు దేశాన్ని, హిందుత్వను కించపరిచేలా గతంలో జరిగిన సంఘటిత ప్రయత్నాలను ప్రతిబింబిస్తోంది.

అవమానకరమైన పదం :

1950 నుంచి 1980 సంవత్సరాల కాలంలో దేశ సగటు వృద్ధి రేటు 3.5-4 శాతం మధ్య ఉంది. చాప్టర్ 3 స్టాటిస్టికల్ ఇయర్ బుక్ – మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం దానిని వర్ణించడానికి నాటి భారతీయ ఆర్థికవేత్త రాజ్ కృష్ణ 1978 సంవత్సరంలో “హిందూ వృద్ధి రేటు” అనే  పదాన్ని కర్కశంగా రూపొందించారు. ఆ తరువాత హిందుత్వ వ్యతిరేక లాబీ నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థ, వెనుకబాటుతనం, తక్కువ ఆర్థిక వృద్ధి రేటును సూచించడానికి ఆ పదాన్ని సౌకర్యవంతంగా వినియోగించింది. 1980 సంవత్సరంలో నాటి ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ రాబర్ట్ మెక్‌నమరా “హిందూ వృద్ధి రేటు” ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఏది ఏమైనప్పటికీ, 1950ల నుండి 1980ల చివరి వరకు “నెహ్రూవియన్ సోషలిస్ట్ గ్రోత్ రేట్” అనే పిలవాలని, “హిందూ వృద్ధి రేటు” అని కాదని చాలా మంది విమర్శకులు సూచించారు. ఎందుకంటే దేశంలో రష్యాన్ సోషలిస్ట్ ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టిన నెహ్రూ ఘోరంగా విఫలమయ్యారు. ఆయన పాలనలో ఆదాయ వృద్ధి సగటున 1.3 శాతంగా ఉండగా, వృద్ధి రేటు 3.5 శాతం వద్ద నిలిచిపోయింది. అయితే రష్యన్ మోడల్ విఫలమైందని కాంగ్రెస్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ 1990 దశకంలో అంగీకరించారు. అందుకు పూర్తి భిన్నమైన అమెరికన్ పెట్టుబడిదారి విధానాన్ని ప్రారంభించారు.

ఆర్థికాభివృద్ధి చరిత్రలో హిందూ, బౌద్ధ మతాలను ఆచరించిన భారత్, చైనా దేశాలను మాక్స్ వెబర్ విఫలమైన వ్యవస్థలుగా ప్రకటించారు. అందుకు భారతీయ సమాజంలో ‘పెట్టుబడిదారీ విధానం’ లేకపోవడానికి ‘హేతుబద్ధమైన ఆచరణాత్మక నీతి’ ఉండకపోవడమే కారణమని కూడా నిర్ధారించారు. కానీ వెబర్ రచించిన  ది ప్రొటెస్టంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం పుస్తకానికి ఉపోద్ఘాతం వ్రాసిన ఆంథోనీ గిడెన్స్ హిందూ ధర్మం వ్యవస్థీకృతమైన కాలంలో భారత దేశం వాణిజ్యం, ఉత్పత్తి రంగాల్లో గరిష్ట స్థాయికి చేరుకుందని స్పష్టంగా అంగీకరించారు. కోతి, ఏనుగు, ఆవులను పూజించే భారతదేశం వెనుకబడిన దేశమని కార్ల్ మార్క్స్ అన్నారు.  హిందూ భారతదేశాన్ని తృణీకరించడానికి కార్ల్ మార్క్స్, మాక్స్ వెబర్-రాజ్ కృష్ణ-మెక్‌నమరాల వారసత్వం తరువాత మాంటెక్ సింగ్ అహ్లువాలియా ద్వారా ముందుకు సాగింది. అతను రాజ్ కృష్ణ వర్ణనను ఆమోదించాడు. ఇప్పుడు రఘురామ్ రాజన్ లాంటి వారి వంతు రావడంతో ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

నిజమైన “హిందూ వృద్ధి రేటు”

భారతదేశ వృద్ధి తగ్గడానికి హిందువులే కారణమని చెప్పిన రాజ్ కృష్ణ వలసవాద సిద్ధాంతం 1983లో తప్పుగా రుజువు చేయబడింది. బెల్జియన్ ఆర్థిక చరిత్రకారుడు పాల్ బైరోచ్, అంగస్ మాడిసన్ చేసిన రెండు అధ్యయనాల ద్వారా ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఆమోదించిన పరిశోధనలు “హిందూ వృద్ధి రేటు” భారతదేశాన్ని 2,000 సంవత్సరాల ప్రపంచ ఆర్థిక చరిత్రలో 1850 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలిపిందని నిరూపించాయి.

1983లో బెల్జియన్ ఆర్థిక చరిత్రకారుడు పాల్ బైరోచ్, 1750 సంవత్సరం నుంచి 1980 సంవత్సరం వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తన అధ్యయనంతో బయటకు వచ్చాడు. అతని పరిశోధనలు పశ్చిమ దేశాలను ఆశ్చర్యపరిచాయి. 1750లో ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 24.5 శాతం, చైనా 32.8 శాతం, యూరప్ 23.2 శాతం ఉండగా, బ్రిటన్, అమెరికాల వాటా కేవలం 2 శాతమేనని ఆయన తన పరిశోధనల్లో పేర్కొన్నారు. ప్రపంచ ఉత్పాదక ఉత్పత్తిలో భారత్‌, చైనాల వాటా 57.3 శాతమని తెలిపారు. 19వ శతాబ్దంలో పశ్చిమ దేశాల వారు భారతీయులు, చైనీయుల కంటే తక్కువ జీవన ప్రమాణాలను కలిగి ఉన్నారని చెప్పడం ద్వారా వారిని ఆశ్యర్యానికి గురయ్యేలా చేశారు.
బైరోచ్ వెల్లడించిన అంశాలు పెట్టుబడిదారీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. పెట్టుబడిదారీ దేశాలచే ఏర్పడిన సంస్థ అయిన ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్థిక చరిత్రపై సమగ్ర పరిశోధన చేయడానికి, బైరోచ్ అధ్యయనం వాస్తవికతను తనిఖీ చేయడానికి గొప్ప ఆర్థిక చరిత్రకారుడు అంగస్ మాడిసన్ ను నియమించింది. ఆయన ఆధ్వర్యంలోని అభివృద్ధి సంస్థ అధ్యయనాలను ప్రారంభించింది. బైరోచ్ తప్పు అని నిరూపించడమే అటువంటి అధ్యయనానికి దర్శకత్వం వహించడానికి అసలు ఉద్దేశ్యమనే అభిప్రాయాలు చరిత్రకారుల్లో ఉన్నాయి. అంగస్ మాడిసన్, రెండు దశాబ్దాల కృషి తర్వాత వరల్డ్ ఎకనామిక్ హిస్టరీ-ఎ మిలీనియల్ పెర్స్పెక్టివ్ 2001లో తన అధ్యయనాలను ప్రచురించారు. .కానీ అన్ని అంచనాలకు వ్యతిరేకంగా బైరోచ్ తీర్మానాలను కూడా ధృవీకరించింది.
మాడిసన్ మొత్తం 2000 సంవత్సరాల ఆర్థిక చరిత్రను అధ్యయనం చేసి పారిశ్రామిక విప్లవం, విదేశీ వలస పాలనకు ముందు హిందూ భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా ఉందని వెల్లడించారు. మొదటి 1000 సంవత్సరాలలో ప్రపంచ జీడీపీలో 32 శాతం వాటాతో  ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా ఉందని పేర్కొన్నారు. రెండవ సహస్రాబ్దిలో 1700 సంవత్సరం వరకు 28 శాతం నుండి 24 శాతంతో భారతదేశం అగ్రగామిగా ఉందని మాడిసన్ చూపించారు. 1700 సంవత్సరంలోలో భారత్ వాటా 24.43 శాతం కాగా చైనా తర్వాత రెండవ స్థానంలో ఉందన్నారు. 1600 సంవత్సరంలోలో మాత్రమే చైనా తాత్కాలికంగా భారతదేశాన్ని అధిగమించిందని అభిప్రాయపడ్డారు. భారతదేశం మళ్లీ 1700 సంవత్సరంలో చైనాను అధిగమించిందన్నారు. ఆ విధంగా 1830 వరకు ప్రపంచ ఆర్థిక పోటీ హిందూ భారతదేశం, బౌద్ధ చైనా మధ్యలో జరిగింది. బైరోచ్-మాడిసన్ అధ్యయనాలు ఇతర అధ్యయనాలు, రికార్డుల ద్వారా కూడా ధృవీకరించబడ్డాయి.
భారతదేశం గురించి పురాతన చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ నివేదిక ‘నేచురల్ హిస్టరీ’, 6.21, 6.26, 12.41 ప్రకారం భారతదేశం నుంచి మిరియాలు, ఇతర మసాలా దినుసులను క్రమం తప్పకుండా దిగుమతి చేసుకోవడం వల్ల రోమన్ సామ్రాజ్యం కన్ను ఇక్కడి బంగారం, సంపదపై పడిందన్నారు. తద్వారా గణనీయమైన దోపడీ జరిగిందని ప్రతిపాదించారు.
భారత ఆర్థిక వ్యవస్థ పతనం 1800 సంవత్సరంలో 20 శాతానికి నుంచి పడిపోయిందని బైరోచ్ కనుగొన్నారు. 1830 సంవత్సరంలో 18 శాతానికి, చివరకు 1900 సంవత్సరంలోలో 1.7 శాతానికి పతనం కాగా, చైనా 33 శాతం నుంచి 6.2 శాతానికి పడిపోయిందన్నారు. 1800 సంవత్సరంలో చైనా, భారతదేశం ప్రపంచ జీడీపీలో 53 శాతాన్ని కలిగి ఉండగా, 1900 సంవత్సరంలో అవి కేవలం 7.9 శాతాన్ని మాత్రమే కలిగి ఉన్నాయన్నారు. ఈ 150 సంవత్సరాలలో బ్రిటన్ యుఎస్ ఉమ్మడి వాటా 2 శాతం నుండి 41 శాతానికి పెరిగింది. పారిశ్రామిక విప్లవం, బ్రిటిషర్ల దోపిడీ పర్యవసానంగా భారతదేశంలో పేదరికం పెరిగిందన్నారు. నెహ్రూవియన్ సోషలిజం స్వాతంత్ర్యం తర్వాత కూడా దానిని మరింత స్తబ్దంగా మార్చిందని చెప్పారు. “నెహ్రూవియన్ సోషలిస్ట్ వృద్ధి రేటు” దాదాపు 3.5 శాతానికి దారితీసిందని తద్వారా మనం గ్రహించవచ్చు.
హిందూ భారతదేశం వలసరాజ్యాల దోపిడీ కారణంగా క్షీణించిందని మాడిసన్ అంగీకరించారు. భారతదేశంతో సహా మూడో ప్రపంచం వెనుకబాటుకు వలసరాజ్యాల దోపిడీ కారణమని, శాస్త్రీయ పురోగతి లేదా ఇతర ఆధిపత్యాల వల్ల కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ లేదా ఇతర నిగూఢ విషయాల పట్ల రాజ్ కృష్ణ బ్రిగేడ్ కుట్రపూరిత లక్ష్యంతో దేశంలోని తక్కువ వృద్ధి రేటును “హిందూ వృద్ధి రేటు”గా వక్రీకరించడానికి దారి తీసింది.
ఆత్మనిర్భర్ భారత్ దశకంలో, భారతదేశం ఆర్థిక అంశాలతో పాటు ఇతర అంశాలలో ప్రపంచ దేశాల మధ్య ఉన్నత స్థానంలో ఉంది. ఇటువంటి సమయంలో ప్రతి జాతీయవాది గతంలో సాధించిన నిజమైన “హిందూ వృద్ధి రేటు” పునరుజ్జీవనాన్ని కోరుకుంటారు. వలసవాద మనస్తత్వం ఉన్న వ్యక్తులు అలాంటి ఆకాంక్షలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. అందుకే భారతదేశంలోని జాతీయవాదులందరినీ బాధపెట్టే బాధ్యతారాహిత్యమైన ప్రకటన చేసినందుకు రఘురామ్ రాజన్ జాతికి క్షమాపణలు తప్పకుండా చెప్పడమే సముచితం.

Source : ORGANISER