Home News సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన తొలి భారతీయ రాణి

సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన తొలి భారతీయ రాణి

0
SHARE

(అలేఖ్య పుంజాల గారు రచించిన “రాణి రుద్రమదేవి” పుస్తకం నుండి సంగ్రహణ) సిహెచ్. కళ్యాణ చక్రవర్తి CSIS అసోసియేట్ గారిచే సంకలనం చేయబడింది.

1259 సా.శ. సంవత్సరంలో ఒకనాటి ప్రకాశవంతమైన ఉదయాన తండ్రి మరియు రాజు అయి గణపతి దేవుడు, తన కుమార్తె మరియు ఉపప్రతినిధి అయిన “రుద్రమాంబ”ను తన అంతరంగిక మందిరానికి ఆహ్వానించాడు. అక్కడి వాతావరణం చాలా గంభీరంగా ఉంది. వృద్ధాప్యం సమీపిస్తున్న రాజు, ఎంతో సమర్థురాలు, వారసురాలు అయిన తన కుమార్తె వంక చూశాడు. అది సాధారణ నిర్ణయం కాదు. ఎన్నో పరిణామాలు ఉంటాయని అతనికి తెలుసు. అతని మంత్రి, ఆమె గురువు అయిన శివదేవయ్య కూడా అక్కడ ఉన్నాడు. ఆ రాజ్యానికి ముఖ్యులైన ఇద్దరు పురుషుల మధ్య సుదీర్ఘమైన చర్చ జరిగే ఉంటుంది. బహుశా ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఆ రాజ్యసభ మందిరం జరుగుతున్నది ఏదీ ఎరుగదు. అనేక ముఖ్యమైన సభ్యులు, సంపూర్ణ రాజభక్తితో మద్దతుని ఇవ్వవచ్చు. ఒక్కసారి రాజుగారి రాజ్య కాల పరిమితి అంతమైపోగానే వారి హక్కుని దక్కించుకునేందుకు ఎదురుచూస్తూ ఉండడం వల్ల అందులో మరికొందరు వ్యతిరేకిస్తారు. గందరగోళాన్నంతటినీ పరిసమాప్తం చేయటం కోసం రాజుగారు. తన నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా చారిత్రాత్మకమైన సంఘటన జరిగి ఉంటుంది. ప్రస్తుతం కాల సినిమా కూర్పుకి ఏమాత్రం తక్కువ కానటువంటిది.

ఎంతో విశాలమైన ప్రచండ కాకతీయుల రాజ్యంలో తమకి, ఒక స్త్రీ అధికారిణి కావటం ఇంతకుముందున్నెడూ జరగని నిర్ణయం. దక్షిణ భారతదేశమంతటిలో, ఒక రాజ్యాన్ని ఏలే తొలి మహిళ రాణీరుద్రమ్మ. బహుశా భారతదేశంలో శిక్షణ పొందిన తొలి మహిళా పాలకురాలు ఈమెనే. ప్రపంచం మొత్తం మీద కూడా అయి ఉంటుంది. తమ తమ రాజ్యాల నేలిన రాణులు. ప్రపంచపు వివిధ ప్రాంతాలలో ఉన్నారు. చాలా మటుకు వారు సమయానుకూలంగా రాణులు అయి ఉంటారు. అన్ని రంగాలలోనూ ||శిక్షణ పొందిన కారణంగా రుద్రమదేవి విషయం అందుకు భిన్నమైనది, గణపతి దేవుడు సింహాసనాన్ని తన కుమార్తెకు అర్పించడానికి బహుశా అనేక కారణాలు ఉండి ఉంటాయి. అతనికి, అతని భార్యకు ‘మగసంతానం లేదు. ఆ సన్నిహిత కుటుంబంలోని మగవారిలో ఆ సింహాసనాన్ని అధిష్టించాలని వాంఛ క్రమంగా కలగసాగింది. వారు కుట్రపన్ని, చుట్టుపక్కల శత్రువులతో చేతులు కలిపి ఎత్తులు పన్నారు. రుద్రమదేవి లో ఉన్న ఆంతరంగిక సామర్థ్యాన్ని, దృఢ సంకల్పాన్ని పసిగట్టిన గణపతి దేవుడు, గురువు శివదేవయ్య నేతృత్వంలో గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం మొదలైన యుద్ధ విద్యల్లో కఠినమైన శిక్షణ పొందేటట్లు చేశాడు. ఆమెకి రాజకీయ పరిపాలన పైన, రాజనీతిపైన, ప్రజా పరిపాలన పైన సంపూర్ణ అవగాహన ఉండేది.

పట్టాభిషేకం 1259సా.శ.

రుద్రమదేవిని తన వారసురాలిగా చేయటం అన్న నిర్ణయాన్ని తన మంత్రి, రుద్రమ గురువు అయిన శివదేవయ్య సమర్ధించాడు. మగ వారసులు ఎవరూ లేని స్పష్టమైన కారణంగా, మరెవరు అందుకు అంతకన్నా ఎక్కువ అర్హత లేని కారణంగా, గణపతి దేవుడు రుద్రమ్మకి కబురు చేసి తన కోరికని తెలియపరిచాడు. తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత గురించీ, కర్తవ్యం గురించీ, శత్రువుల భీకరమైన దాడుల తాకిడి నుండి కాకతీయుల సామ్రాజ్యాన్ని పరిరక్షించుకోవడం గురించీ, తన
తను తీసుకుంటున్నట్లుగా తన మంత్రివర్గ సభ్యుల పైన జాగ్రత్త తీసుకోవడం గురించీ, తన ఆదర్శ ప్రాయమైన పరిపాలన ద్వారా కాకతీయ సామ్రాజ్యానికి కీర్తి ప్రతిష్టలు తేవడం గురించి అవగాహన కలిగించాడు. తన తండ్రికి తన రాజ్యంపై ఉన్నప్రేమ, భక్తి, అతనికి తన ప్రజల పట్ల ఉన్న అనురాగం, ఆమెలో ఆత్మ స్థైర్యాన్ని కలిగించడానికి చేసే ప్రయత్నం, రుద్రమదేవిని కదిలించి వేసాయి. అతని నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయనని, శత్రువులను ఎన్నటికీ తన రాజ్యం పైన దండెత్తి విజయం సాధించనివ్వనని, ప్రజలను మనోరంజకంగా పరిపాలించాలని నిర్ణయించుకొని వాగ్దానం చేసింది.

రాజ్యంలోని అందరి ప్రముఖుల సమక్షంలో రుద్రమ్మ పట్టాభిషేకం జరిగింది. రాజ్యమంతటా పండగ సంతరించుకున్నది. ప్రజలందరూ సంతోషంతో మిన్ను ముట్టేటట్టుగా కేరింతలు కొట్టారు. తమ సొంత కళ్ళతో ఈ అపురూపమైన సంఘటనని చూడటానికి రాజ్యం నలుమూలల నుంచి ప్రజలు గుంపులు గుంపులుగా విచ్చేశారు. పట్టాభిషేక సంబరాలలో భాగంగా సంగీత, నాట్య ప్రదర్శనలు నెలకొన్నాయి. దేవాలయాల్లో పూజలు జరిపింపబడ్డాయి. వివిధ ప్రదేశాలు దర్శించే వారందరికీ అన్నదానం కావించబడింది. పట్టాభిషేకం జరిగే స్థలం అందంగా అలంకరించబడింది. పుణ్య నదుల నుండి పవిత్ర జనాలు తేబడ్డాయి. ప్రజలతో నిండి ఉన్న సభలోకి రాజరికప్పుదుస్తులు ధరించి రుద్రమ్మ వేంచేసింది. వేదమంత్రాల మధ్య తన తండ్రి గణపతి దేవుడు కిరీటాన్ని ఆమె శిరస్సున అలంకరించి, ఆ కుటుంబ పవిత్ర ఖడ్గాన్ని అతని కుమార్తె చేతికి అందించాడు. తన ఘనమైన వారసత్వాన్ని ముందుకు కొనసాగించేటట్లుగా, రాజ్య కీర్తిని నిత్యం నిలబెట్టేటట్టుగా, ఆ రాజ్యం ప్రజలే తనకి అత్యంత ప్రధానంగా ఉండేటట్లుగా ఆశీర్వదించాడు. పట్టాభిషేక వేడుకలు కాగానే రుద్రమ్మ రాజ్యసభని అలంకరించింది. ఒక ప్రక్కన తన తండ్రి గణపతి దేవుడు, మరోపక్క ఆమె గురువు శివ దేవయ్య చెరో ప్రక్క ఆశీనులయ్యారు. ఆ సామ్రాజ్య సామంత రాజులైన గంగయ్య సాహిని, మాల్యాల గుండయ్య, నాగదేవ మహారాజు, మిరియాల గణపతి, ఒప్పిలిసిద్ధి, చేరాకు బోలయ్య రెడ్డి, సారంగపాణి దేవ మహారాజు, విశ్వనాథ దేవుడు, అల్లాడ పేమయ్య దేవుడు, ఇంకా మల్లి దేవ సిద్ధయ్య చోళుడు, అందరూ ఆ సమయంలో అక్కడ ఉన్నారు. ముఖ్యమంత్రి శివదేవయ్య, ప్రధానమంత్రి గోవింద నాయుడు,ఖాయన్న నాయకుడు, ఇంకా ఇతర మంత్రులైన భాస్కరుడు, పోతనామాత్యుడు. తిక్కన్నతో పాటుగా ఇందులూరి సోమకవి, యాదవకుల అన్నమయ్య, మారన్న, కేతన్న, సాకల్యమాల, భట్టు ఇంకా ఇతర పండితులు ఆ సభనంతటినీ మరింత దేదీప్యమానం కావించారు. అక్కడున్నవారు, వారి ప్రేమకీ, గౌరవానికి చిహ్నంగా రుద్రమ్మకు ధనము, కానుకలు బహుకరించారు. ఆ రోజుల్లో ఉన్న ఆచారానికి అనుగుణంగా, వెనువెంటనే ఆమెని అలంకరించిన ఏనుగు అంబారీపై రాజధాని నగరం అంతా ఊరేగించారు. 33వ పేజీ, రాణి రుద్రమదేవి, NBT ISBN 978-81-237-7814-4).

కానీ, ఈ రాజ్య స్వీకారం అంత తేలికైనది కాదు. ఆమె చాలా అంతర్యుద్ధం ఎదుర్కొనవలసి వచ్చింది. అసంతృప్తి చెందిన వారు వారి శక్తి మేరకు ప్రయత్నించారు. రాజు గణపతి దేవుడు, అతని మంత్రి శివదేవయ్యా ఇది ముందే ఊహించారు. ఆమెను తన బాల్యం నుండే ఈ పదవికి సంసిద్ధురాలిని చేశారు. తన తండ్రితో కలిసి అనేక యుద్ధాలలో యుద్ధం చేసి ఉండటం వల్ల, శౌర్యంలో, యుద్ధ నైపుణ్యంలో ఆమె విజేత. ఆమె అద్భుతమైన దళాధిపతి. సాధారణ ప్రజలకు కూడా ఆమె జన రంజకమైనది. రుద్రమదేవి అనేకమైన అంతరంగిక తిరుగుబాటులను ఎదుర్కొన్నది. కొందరు చరిత్రకారులు, ఇద్దరు సవితి అన్నదమ్ములను కూడా అంతరంగిక తిరుగుబాటు దారులు సూచించారు. మరికొందరు దాన్ని తిరస్కరించారు. కానీ ఆమె వారసత్వంపై అంతర్గత తిరుగుబాటు ఉన్నప్పటికీ, ఆమె తమ ఇష్టమైన రాణిగా ప్రజల మద్దతును గెలుచు కున్నది. ఆమె ఎందరో అధిపతులచే మద్దతు ఇవ్వబడిందని ఈ క్రింది పంక్తులు నిరూపిస్తాయి.

రుద్రమ్మ తన కుమార్తెతో మొగిలిచర్లలోని దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు, కొందరు కోటపై దాడి చేసి దాన్ని బలవంతంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ఈ దాడి, ఆమె నమ్మకమైన అధిపతుల చేత, వారిని అణగద్రొక్కి ఓడించ ఉద్యమించిన ప్రజల చేత ఎదుర్కొనబడినది. వారిలో రేచర్ల ప్రసాదిత్య, కన్నర్దేవుడు, కాయస్త జన్నిగదేవా, మిరియాల సూరన్న రుద్ర నాయుడు ఇంకా నిళ్ళంక మల్లికార్జునుడు ఉన్నారు. తిరగబడిన వారిని అణచివేయడంలో వారు రుద్రమ్మకు సహకరించి, రుద్రమ్మపాలనను ఏకగ్రీవంగా బలపరిచారు. ఈ విధంగా, “కాకతి రాజ్య సంప్రతిష్ఠానాచార్యులు” అనే ఆమె బిరుదును సంపాదించారు. కాకతీయ మహా సామ్రాజ్య సంస్థాపకులు అని దీని అర్థం. (పేజీ 39, రాణి రుద్రమదేవి NBT ISBN 978- 81-237-7817-4)

తన వివాహ విషయంలో – ద్వంద యుద్ధంలో తనని ఓడించగల యోధుడిని వివాహమాడాలని అనుకొని, తన కాబోయే భర్త వేంగీ చాణుక్య రాజకుమారుడు వీరభద్రునితో సవాలు ఎదుర్కొనే ధైర్యవంతురాలు. ఆ జంట చాలా అన్యోన్యమైన జంట. ద్వంద యుద్ధం మూడు రోజులుగా సాగింది. అయినా ఎవరూ విజేతగా నిర్ణయింపబడలేదు. తన తండ్రి గణపతి దేవుడు మధ్యలో అడ్డుకొని ద్వంద యుద్ధాన్ని ఆపవలసి వచ్చింది. వారిద్దరికీ 1240సా. శ. లో వివాహం జరిగింది. వీరభద్రుడు ఒక యోధుడిగా జీవించి చాలా చిన్న వయసులో మరణించాడు. ఆమెకి ముమ్మిడమ్మా, రుయమ్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. ఎవరినైతే రుద్రమదేవి దత్తత తీసుకుని తన వారసుడిగా ప్రకటించిందో, అతను ముమ్మిడమ్మ . మహాదేవుల తొలి సంతానమైన ప్రతాపరుద్రుడు.

రాణి రుద్రమదేవి ఎన్నో యుద్ధాలు పోరాడి విజయవంతంగా గెలిచింది. ఉదాహరణకీ, కాకతీయుల శాశ్వత శత్రువులైన రాజా మహదేవతో, దేవగిరి రాజుతో యుద్ధం. ఆమె యుద్ధంలో గెలిచి, బీదర్ కోటను కాకతీయుల రాజ్యానికి జోడించడంలో విజయం సాధించింది. దీనితో యాదవ సామ్రాజ్యంలోని కొన్ని ప్రాంతాలని అదుపులో తేగల కాకతీయ సామ్రాజ్యపు ఏకైక పాలకురాలిగా నిలిచింది. ఆమె తన ఆధీనంలో ఉన్న కాయస్థ రాజు అంబదేవుడితో భయంకర యుద్ధం చేసింది. తన ధైర్యాన్ని నిరూపించుకున్న తర్వాత ఆమెకి “రాయగజకేసరి” అనే బిరుదు ఇవ్వబడింది. గొప్ప యోధురాలే కాక ఆమె అద్భుతమైన రాజ్య నిర్వాహకురాలు. సమర్థవంతమైన రాణి కూడా. ఆంధ్రదేశాన్నేలిన అత్యంత గొప్ప పరిపాలకులలో రుద్రమదేవి ఒకరు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఉన్నతమైన పరిపాలకురాలిగా తన కర్తవ్యం నిర్వహణలో తన స్త్రీత్వం అడ్డు రాలేదు. దేశాన్ని పరిపాలించడంలో చురుకైన పాత్ర పోషించిన, పరిపాలకురాలు, రాజ్య ఉత్తమ ప్రయోజనాలు పెంపొందించడం కోసం ఎంతో కృషి చేసింది. తరచుగా దేశ శాంతి భద్రతలని భంగపరిచే యుద్ధాలు జరుగుతున్నప్పటికీ, ఆమె పరిపాలనలో ప్రజలు తృప్తిగా సంతోషంగా ఉన్నారు. శత్రువులకి దుర్భేద్యమయ్యేటట్లుగా వరంగల్ కోటని రుద్రమ్మ ఎంతో బలోపేతం చేసింది. కోటని మరింత బలోపేతం చేసేందుకు కోట చుట్టూ పెద్ద కందకం త్రవ్వించింది. కొంత కాలం తర్వాత రాజ్యాన్ని సందర్శించిన మార్కోపోలో, పరిపాలకురాలిగా రాజనిర్వాహకురాలిగా ఆమె గురించి చాలా ఉన్నతంగా వ్రాసాడని చెప్పబడింది. (పేజీ 67, రాణి రుద్రమదేవి. NBT ISBN 978-81-237-7817-4)

తనకి ఇవ్వబడిన కర్తవ్యాలను తన పూర్తి సామర్థ్యంతో నిర్వహించింది. తన 80 సంవత్సరాల పండు వయసులో ఆమె తన దేశాన్ని కాపాడుకుంటూ యుద్ధభూమిలో ఉన్నది. ఆమె తన సైనిక అధికారితో పాటుగా మరణించిందని శాసనాలు తెలుపుతున్నాయి. ఆమె చనిపోయిన చోటు యుద్ధభూమి అయ్యుండ వచ్చునని శాసనాలు సూచిస్తున్నాయి. 80 ఏళ్ల వయసులో కూడా ఆమె తన సైన్యానికి స్ఫూర్తినిస్తూ, వారిని ఒక వ్యూహం ప్రకారం కాపాడింది.

రాణీ తన సైన్యాధ్యక్షుడూ ఇద్దరూ ఒకేసారి చనిపోయినట్లుగా గ్రంధాలు చెబుతున్నాయి. బహుశా, రాణి తన శత్రువు వల్ల యుద్ధభూమిలో కాక వాళ్ళ రాజ శిబిరంలో మరణించి ఉండవచ్చని అర్థం కావచ్చు. ఆ సమయంలో రుద్రమదేవికి సుమారుగా 80 ఏళ్ల వయస్సు ఉండి ఉండవచ్చు. యుద్ధంలో.. పాల్గొనడం సాధ్యమై ఉండకపోవచ్చు, కానీ పరాక్రమవంతురాలు కాబట్టి బహుశా తన సైన్యాధ్యక్షుడు మళ్లి కార్జునునిచే సంరక్షింపబడుతూ, తన సైనికులకి స్ఫూర్తినిస్తూ, వారిని ముందుకి నడిపించి ఉండవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ గ్రామంలో లభ్యమైన 27 నవంబర్ 1289 సా.శ. కాలంనాటి చందుపట్ల, శాసనాల ద్వారా రాణి రుద్రమదేవి యొక్క మరణ సమాచారం మనకు దొరుకుతుంది. ఈ శాసనంలో ఇవ్వబడిన సమాచారం మీద పండితులకి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, బహుశా ఆమె అదే రోజు మరణించిందని రెండు, బహుశా ఆమె 12 రోజుల క్రితమే మరణించి ఉండవచ్చు అని. అది విరాళంగా ఇవ్వబడ్డ శాసనం కాబట్టిఅభిప్రాయం భేదాలు ఉన్నాయి. హిందూ సాంప్రదాయ ప్రకారం, సాధారణంగా దానాలు మనిషి చనిపోయిన 12వ రోజు ఇవ్వబడతాయి కాబట్టి. (పేజీ 47, రాణి రుద్రమదేవి. NBT ISBN 978-81-237-7817-4)

ముగింపుగా, తన ప్రజలని, రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం తన జీవితం అంతా పోరాడిన యోధురాలు రాణి. ఆమె దూరదృష్టి గలవ్యూహకర్త. ఒక రాణిగా ఆమె ఓరుగల్లు/ వరంగల్ కోటని పటిష్టం చేసింది. సమర్థవంతమైన రాజ్య నిర్వహకురాలిగా ఆమె, కాకతీయుల సైన్యంలో నయంకాయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంస్కర్త. కాకతీయ రాజులు వ్యవసాయానికి ఎప్పుడూ చాలా ప్రాధాన్యతనిచ్చారు. తన రాజ్యమంతటా కాలువలు చెరువులు తవ్వించడంలో, నిర్విరామంగా పనిచేసే సిబ్బందిని పెట్టి, పని నిర్వహించడంలో రుద్రమదేవి పేరు కాంచింది. చిరస్మరణీయమైన కీర్తిగల రాణి రుద్రమదేవి, నిస్సందేహంగా భారతదేశాన్ని పరిపాలించిన అత్యంత గొప్ప పరిపాలకులలో ఒకరు. ఆమె పరాక్రమవంతురాలిగా.. సాహసవంతమైన యోధురాలిగా ఎందరో కవులచే న్యాయంగా కీర్తింపబడింది.