Home News సోష‌ల్ మీడియాలో హిందూ వ్య‌తిరేక‌త… ఆక్స్‌ఫ‌ర్డ్ స్టూడెంట్ యూనియ‌న్‌కు ర‌ష్మీ స‌మంత్ రాజీనా‌మా  

సోష‌ల్ మీడియాలో హిందూ వ్య‌తిరేక‌త… ఆక్స్‌ఫ‌ర్డ్ స్టూడెంట్ యూనియ‌న్‌కు ర‌ష్మీ స‌మంత్ రాజీనా‌మా  

0
SHARE
ర‌ష్మీ స‌మంత్‌.. ఇటీవ‌లే ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కు మొదటి మహిళా అధ్య‌క్షురాలిగా ఎన్నికైంది. కర్ణాటకకు చెందిన రష్మి సమంత్ ఒక హిందువు అని, హిందుత్వ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిందుకు గాను  ఆమెపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆమెను ల‌క్ష్యంగా చేసుకుని సోష‌ల్ మీడియాలో అనేక మంది బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన ఆమె చివ‌రికి త‌న స్టూడెంట్ యూనియ‌న్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి రాజీనా‌మా చేయాల్సిన ప‌రిస్థ‌తి ఏర్ప‌డింది.

ఫిబ్ర‌వ‌రి 11న స్టూడెంట్ యూనియ‌న్ అధ్య‌క్షురాలిగా ఎన్నికైన ర‌ష్మి స‌మంత్ గ‌తంతో త‌న సోష‌ల్ మీడియాలో చేసిన పోస్టులు హిందుత్వ మూలాల‌కు, హిందుత్వ భావ‌జాలానికి సంబంధించిన‌విగా ఉన్నాయ‌ని, ఇస్లాం ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా ఆమె పోస్టులు చేసింద‌ని సోష‌ల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున్న విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి.

ఆక్స్‌ఫ‌ర్డ్‌కు చెందిన ఒక అధ్యాప‌కుడు కూడా ఆమెకు వ్య‌తిరేకంగా ఒక పోస్టు చేశారు. ఏకంగా ర‌ష్మీ త‌ల్లితండ్రుల‌ను ఈ వివాదంలో లాగాడు. వారి సోషల్ మీడియా ఖాతాలలో శ్రీరాముడి ఫోటోను ఫ్రోపైల్ ఫోటోగా పెట్టుకున్నందుకు గాను వారిపై విమ‌ర్శ‌లు చేశాడు. పైగా రష్మి విద్యార్థి మండలి ఎన్నికలకు ప్రధానమంత్రి మోడీ నిధులు సమకూర్చారని కూడా ఆరోపించారు. పైగా ఆమె క‌ర్నాట‌క ప్రాంతానికి చెందిన‌, ఇస్లాం వ్య‌తిరేకి అని ప్రాంతం పేరుతో త‌న‌ని కించ‌ప‌రిచాడు. స‌నాత‌న హిందూ ధ‌ర్మాన్ని ప్రొత్స‌హించ‌డానికి హిందూత్వ వాదులు పాశ్చాత్య సంస్కృతిని ద్వేషిస్తార‌ని, ముస్లింలు, క్రైస్తవులు లేదా హిందుత్వేతరుల విగ్రహాలను నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటారని అన్నాడు. హిందుత్వంపై ఏమాత్రం అవ‌గాహ‌న లేకుండా ఒక అధ్యాప‌కుడు సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం.

సోష‌ల్ మీడియాలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురైన త‌ర్వాత ‌రష్మి త‌న పదవికి రాజీనామా చేసి కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని తన ఇంటికి తిరిగి వచ్చింది. ఆన్‌లైన్ లో త‌న‌పై వ‌స్తున్న పోస్టుల‌కు బ‌దులుగా ఆమె కూడా ఫెస్‌బుక్ ఒక పోస్టు చేసింది. ఆక్స్‌ఫ‌ర్డ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నుక‌వ‌డం తన జీవితంలో గొప్ప విష‌య‌మ‌ని పేర్కొంది. అయితే హిందుత్వ భావ‌జాలం క‌లిగి ఉన్నందుకు త‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని ఆమె తీవ్రంగా వ్య‌తిరేకించింది. ఆక్స‌ఫ‌ర్డ్‌కు చెందిన ఒక అధ్య‌పకుడు త‌న త‌ల్లిదండ్రుల‌పై అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌లు చేయ‌డం, మతపరమైన భావాలను, ప్రాంతీయ నేపథ్యాన్నికించ‌ప‌రిచేలా సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌స్తావించి అవమానించినందుకు గాను ఆమె తీవ్రంగా బాధ‌ప‌డినట్టు పెర్కొంది.

తాను నేర్చుకున్న విలువ‌ల ప్ర‌కారం ఇత‌రులు ఇబ్బందుల‌కు గురి కాకుడ‌ద‌ని, తోటి వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా విద్యార్థి విభాగం అధ్య‌క్షురాలిగా త‌న‌ను ఎన్నుకున్న తోటి విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌ని ఉద్దేశంతోనే త‌న ప‌ద‌వికి రాజీనా‌మా చేసిన‌ట్టు స్ప‌ష్టం చేసింది. తాను హిందువుని కాబ‌ట్టి  జై శ్రీ రామ్ నినాదాలు చేయడం నేరం కాదని, తన తల్లిదండ్రుల మతపరమైన భావాలు, వ్యక్తీకరణలు బహిరంగంగా అవమానించ‌డం, సోష‌ల్ మీడియాలో ప‌రిధి దాటి వ్య‌వ‌హ‌రించ‌డంతో క‌ల‌త చెందిన‌ట్టు ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తాను హిందువుని అయినంత మాత్ర‌నా స్టూడెంట్ యూనియ‌న్ అధ్య‌క్ష ప‌ద‌వికి అన‌ర్హురాలిని కాదు అని, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇలాంటి వివ‌క్షలు ఉంటాయ‌ని త‌న విష‌యంలో స్ప‌ష్ట‌మైంద‌ని ఆమె త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది.

Source : OPINDIA