Home News అస్సాం : వైద్యుడిపై గియాజుద్దీన్ బంధువుల మూక దాడి.. 24 మంది అరెస్టు

అస్సాం : వైద్యుడిపై గియాజుద్దీన్ బంధువుల మూక దాడి.. 24 మంది అరెస్టు

0
SHARE

కోవిడ్ డ్యూటీలో ఉన్న వైద్యుడితో స‌హా మ‌రో ఇద్ద‌రు వైద్య సిబ్బందిపై గియాజుద్దీన్ అనే రోగి బంధువులు దారుణంగా దాడి చేసిన ఘ‌ట‌న అస్సాంలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే అస్సాం, హోజయి జిల్లాలోని ఉడాలి కోవిడ్ కేర్ సెంటర్‌లో గియాజుద్ధీన్ అనే వ్య‌క్తి కోవిడ్ వ్యాధితో బాధ‌పడుతూ మంగ‌ళ‌వారం మృతి చెందాడు. దీంతో అత‌ని బంధువులు ఆస్ప‌త్రికి చేరుకుని అక్క‌డ విధులు నిర్వ‌ర్తిస్తున్న డాక్టర్ సీజ్ కుమార్ సేనాపతి తో స‌హా మ‌రో ఇద్ద‌రు వైద్య సిబ్బందిపై అత్యంత దారుణంగా దాడి చేసి వారిని తీవ్రంగా గాయ‌ప‌రిచారు. ఆస్ప‌త్రి ఫ‌ర్నిచ‌ర్‌ని కూడా ధ్వంసం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియాలో సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఈ సంఘటనను ఖండిస్తూ అస్సాం మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (AMSA) దాడికి పాల్ప‌డిన వారంద‌రినీ అరెస్టు చేసే వ‌ర‌కు అస్సాం అంతటా OPD బహిష్క‌రిస్తూ నిర‌స‌న తెలిపారు. ఈ మేర‌కు AMSA ఒక పత్రికా ప్రకటనలో విడుద‌ల చేసింది. “మేము OPD సేవలను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని, దీంతో ప్రజల‌కు మా ప్రాముఖ్య‌త తెలుస్తుంద‌ని, భ‌విష్య‌త్తులో వైద్యుల‌పై ఇలాంటి దాడులు జ‌రిగితే వైద్య సేవ‌లు బ‌హిష్క‌రిస్తామ‌ని” వారు పేర్కొన్నారు.

ఘ‌ట‌న‌కు సంబంధించి స్థానిక ఎస్పీ బారున్ పుర్క‌‌య‌స్త మాట్లాడుతూ… గియాజుద్ధిన్ అనే వ్య‌క్తి  కోవిడ్ తో మంగళవారం మధ్యాహ్నం ఉదాలి కోవిడ్ కేర్ సెంటర్‌లో మరణించాడ‌ని, దీంతో రోగి బంధువులు, పరిచయస్తులు అక్కడికి చేరుకుని విధుల్లో ఉన్న‌ వైద్యుడిని దారుణంగా క‌ర్ర‌ల‌తో కొట్టార‌ని ఎస్పీ తెలిపారు. విష‌యం తెలుసుకున్నపోలీసుల ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని త‌క్ష‌ణ‌మే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశార‌ని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంద‌ని ఆయ‌న తెలిపారు.

వీడియోలో చూసిన మహిళతో సహా ప్రధాన నిందితులతో స‌హా ప‌లువురిని అరెస్టు చేశామ‌ని, చార్జిషీట్ దాఖలు చేసి, నిందితులను కోర్టులో ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ప్రత్యేక డిజిపి (లా అండ్ ఆర్డర్) జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

ముఖ్య‌మంత్రి హిమంత్ బిస్వాశ‌ర్మ ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.  “ఈ అనాగరిక చ‌ర్య‌కు పాల్పడిన 24 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చార్జిషీట్ త్వరగా దాఖలు చేయనున్నారు. నేను ఈ దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాను. బాధితులకు న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నాను.” అని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. ఈ దాడిలో పాల్గొన్న 24 మంది వ్యక్తుల జాబితాను కూడా ఆయ‌న పోస్టు చేశారు.

ఈ సంఘటనను ఖండిస్తూ, అన్ని రాజకీయ పార్టీలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

దాడిని ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఒక లేఖ రాసింది. డాక్ట‌ర్ సేనాపతిపై జరిగిన దాడిని అత్యంత అమానవీయమైనది అని పేర్కొంటూ నిందితులపై వెంట‌నే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Source : VSK BHARATH