Home News బీజింగ్ విశ్వవిద్యాలయంలో సంఘ్ పై అధ్యయనం

బీజింగ్ విశ్వవిద్యాలయంలో సంఘ్ పై అధ్యయనం

0
SHARE

ప్రపంచంలో నేడు చైనా ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. చైనా తన ఈ శక్తిని గుర్తించి  మరింత వేగంతో ముందుకు దూసుకుపోవాలన్న ప్రయత్నంలో ఉందన్న విషయం కూడా నిజం. ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి, అంతర్జాతీయ  రాజకీయాల్లో గానీ చైనా ఎవరికి  తీసిపోకుండా ఉంది. ఇంతే కాదు, భారతీయ దర్శన, శాస్త్ర, ఉపనిషత్తుల అధ్యయనంతో బాటు భారతదేశంలో నడుస్తున్న సేవా కార్యక్రమాలు, వివిధ ప్రకల్పాలు,  వాటివెనుక ఉన్న ప్రేరణ గురించి  అధ్యయనం చేస్తోంది. ఈ అధ్యయనం కోసం ప్రపంచంలో అతిపెద్ద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ఎంచుకుంది. చైనా విశ్వద్యాలయాల్లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయంసేవకుల క్రమశిక్షణ, కార్య పద్ధతి, వివిధ సేవాప్రకల్పాలతో పాటు సంఘ జ్యేష్ట ప్రచారకుల బౌద్ధిక్ లను హిందీ నుండి చైనా భాషలోకి అనువదించుకునే పని సాగుతోంది.

విచిత్రమేమిటంటే చైనా ఒక వైపు సరిహద్దులో యుద్దంకై ఉసిగొలుపుతూంటే, మరో వైపు ఆ దేశపు విద్యార్థులు సంఘ కార్యపద్దతిని, సమాజంలో చేస్తున్న కార్యాన్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఆగ్రాలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికై చైనా నుండి వచ్చిన శాంఘాయి అంతర్జాతీయ అధ్యయన విశ్వవిద్యాలయపు విజిటింగ్ ప్రొఫెసర్ నవీన్ లోహానీ ఇదే  విషయాన్ని తెలియచేస్తూ ఇలా చెప్పారు – “హిందుత్వం, జాతీయవాద ఆలోచనాధోరణి, మరియు వివిధ ప్రాంతాల్లో సంఘ స్వయంసేవకుల ద్వారా నడుపబడుతున్న సేవా ప్రకల్పాలు, అకాలంగా ఏర్పడే ఆపదలలో సహాయ శిబిరాలను స్వయంసేవకులు నడిపే  పద్ధతులపై చైనా విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం జరుగుతోంది.” “ఇంతే కాదు. సంఘసంస్థాపకులు, తొలి సరసంఘచాలక్, డా. కేశవరావ్ బలిరామ్ హెడ్గేవార్, గురూజీ (మాధవ సదాశివగోల్వాల్కర్) మరియు ప్రస్తుత సరసంఘచాలక్ మోహన్‌రావ్ భాగవత్ ఇచ్చిన బౌద్ధిక్‌ (ఉపన్యాసాలు)లను చైనా భాషలోకి అనువదించే  కార్యక్రమం కూడా సాగుతోంది.”  ఈ పరిశోధనలు, అధ్యయనం బీజింగ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ చాంగ్ మార్గదర్శనంలో నడుస్తోందని కూడా లోహానీ తెలియచేసారు. సంఘలో హిందీ భాష శుద్ధ ఉచ్చారణ వలన హిందీ భాష ప్రచారము, ప్రసారము బాగా సాగుతోందని ఆయన అన్నారు.  సంఘంపట్ల  ఆకర్షణకి కారణం భారతీయ జ్ఞానానికి ఆధారం వైదిక జ్ఞానం కాగా చైనా జ్ఞానపరంపరకు ఆధారం లావోస్, కంఫూషియస్‌ల పరంపర. మనది వాచిక (శృతి) పరంపర కాగా చైనా లిఖిత పరంపరను పాటిస్తుంది.

ప్రో. నవీన్ లోహానీ ఇంకా ఇలా అన్నారు – “చైనాతో మనకు అనేక విషయాలలో విభేదాలు ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయ మార్పులలో భారత-చైనా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకుపోవడానికి హిందీ భాష తోడ్పడవచ్చు. భారత చైనా సంబంధాలలో మార్పు రావాలంటే ఇరుదేశాలు గతాన్ని మరచి కొత్త విశ్వాసంతో వ్యాపార, వ్యవహారాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాలి.’’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here