Home News పశ్చిమబెంగాల్‌లో పెరుగుతున్న జిహాదీ కార్యకలాపాలు – జాతీయ ప్రయోజనాలకు పెను సవాలు : ఆర్ ఎస్...

పశ్చిమబెంగాల్‌లో పెరుగుతున్న జిహాదీ కార్యకలాపాలు – జాతీయ ప్రయోజనాలకు పెను సవాలు : ఆర్ ఎస్ ఎస్ తీర్మానం

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిలభారతీయ ప్రతినిది సభ  సమావేశాలు ఈ నెల ఈ నెల 19-21 వరకు కోయంబత్తూర్, తమిళనాడు లో నిర్వహించాడ్డాయి.

ఈ సందర్బంగా చేసిన ఆర్ ఎస్ ఎస్  తీర్మానం:

పశ్చిమబెంగాల్‌లో నిరంతరం పెరుగుతున్న జిహాదీ హింస, ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతి వ్యతిరేక శక్తులకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సాహం ఇవ్వడం, రాష్ట్రంలో హిందూ జనాభా తగ్గిపోవడం పట్ల అఖిలభారతీయప్రతినిధిసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్‌ సరిహద్దుకు కేవలం 8 కి.మీ లోపల ఉన్న కాలియాచక్‌ పోలీస్‌ స్టేషన్‌ (మాల్దా జిల్లా) పై దాడి, దోపిడి, జిహాదీ మూకల ద్వారా పోలీసు రికార్డుల దగ్ధం, రాష్ట్రంలో భద్రతాదళాలపై దాడులు పెరగడం వంటివి జాతీయ సురక్ష, శాంతిభద్రతలకు పెను సవాలు విసురుతున్నాయి. మతమౌఢ్య మౌల్వీలు హింసను ప్రేరేపిస్తూ అనేక ఫత్వాలు జారీ చేస్తున్నారు. కట్వా, కాలిగ్రామ్‌, ఇలాంబజరంద్‌ మేతియాబురంజ్‌ (కోల్‌కతా) వంటి అనేక ప్రదేశాలలో మతమౌఢ్య శక్తులు హిందువులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఈ మతమౌఢ్య శక్తుల ఒత్తిడి వల్ల పెద్ద సంఖ్యలో హిందువులు సరిహద్దు ప్రాంతాలను వదిలి వెళిపోతున్నారు. ఈ శక్తులే నకిలీ నోట్ల దొంగ రవాణా, గోవుల తస్కరణ, అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. బుర్ద్వాన్‌ బాంబుపేలుడు ఘటనపై జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఎ) జరిపిన విచారణలో అనేక తీవ్రవాద ముఠాలు రాష్ట్రంలో ఉన్నాయని, సరిహద్దులకు రెండువైపులా జిహాదీ తీవ్రవాదుల కార్యకలాపాలు సాగుతున్నాయని తేలింది.

ప్రణాళికాబద్ధంగా జిహాదీ తీవ్రవాదులు కార్యకలాపాలు సాగిస్తుంటే వారికి మంత్రిత్వశాఖలు, ఇతర ప్రముఖ రాజకీయ, ప్రభుత్వ పదవులు కట్టబెడుతూ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు హిందూ సమాజం పండగలు, మతపరమైన ఉత్సవాలు జరుపుకోకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. కొంతకాలం క్రితం మొహర్రం కోసం దుర్గాదేవి విగ్రహాల నిమజ్జన కార్యక్రమ వేళల్ని రాష్ట్ర ప్రభుత్వం కుదించడంపై కోల్‌కతా హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది.

కొన్నేళ్ళుగా రాష్ట్రంలో బాంబుపేలుళ్ళు, దోపిడీలు, హింస, మహిళలపై అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి. హిందూ సమాజంపై జరుగుతున్న దాడుల్లో ఎక్కువగా షెడ్యూల్‌ కులాలకు చెందినవారు నష్టపోతున్నారు. గత ఏడాది దుర్గాపూజ సందర్భంగా జురాన్‌పూర్‌, వైష్ణవనగర్‌, ఖరగ్‌పూర్‌, మల్లార్‌పూర్‌లలో ఈ వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అదే సముదాయానికి చెందిన 17ఏళ్ళ బాలికపై యాసిడ్‌ దాడి జరిగింది. ఆ అమ్మాయి చికిత్స పొందుతూ చనిపోయింది. 13-14 డిసెంబర్‌, 2016 ధులాగఢ్‌లో హిందువులపై ప్రణాళికాబద్ధంగా దాడి జరిగింది. దోపిడీ, మహిళలపై అత్యాచారాలు జరిగాయి. తీవ్రవాద శక్తుల్ని అదుపుచేయవల్సిందిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనలను దాచిపెట్టే ప్రయత్నం చేసింది. ధైర్యంగా ఈ సంఘటనలను వెలుగులోకి తెచ్చిన కొద్దిమంది నిజాయితీపరులైన జర్నలిస్టులపై కేసులు పెట్టడం ఆశ్చర్యం కలిగించింది.

ఒకవైపు జాతీయభావాన్ని పెంపొందిస్తున్న పాఠశాలలను మూసివేయిస్తామంటూ హెచ్చరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు జిహాదీ తీవ్రవాద శిక్షణ అందిస్తున్న సిములియా మదర్సావంటి వేలాది సంస్థలను మాత్రం ఉపేక్షిస్తోంది. తీవ్రవాద శక్తుల ప్రభావంతో పాఠ్యపుస్తకాల్లోని బెంగాలీ పదాలకు కూడా దుర్వ్యాఖ్య చేస్తున్నారు. అనేక ప్రదేశాల్లోని విద్యాసంస్థల్లో సంప్రదాయబద్ధమైన సరస్వతీపూజను అడ్డుకుంటున్నారు. మిలాద్‌ ఉన్‌ నబీ జరపడం ద్వారా పాఠశాలలను ఇస్లామీకరణ చేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోడం లేదు.

గత ఏడాది మిలాద్‌ ఉన్‌ నబీ నిర్వహించడానికి అనుమతి నిరాకరించినందుకు కోల్‌కతాకు 40కి.మీ దూరంలోని తెహట్టాలో 1750 మంది విద్యార్థులున్న హయ్యర్‌ సెకెండరీ పాఠశాలను స్వాధీనం చేసుకున్న తీవ్రవాదులు తమ జెండా ఎగరవేయడమేకాక మహిళా టీచర్లను ఒక గదిలో నిర్బంధించారు. దీనికారణంగా పాఠశాల తరువాత నెలరోజులపాటు మూతపడింది.

దేశవిభజన సమయంలో హిందువులు అధికంగా ఉన్న బెంగాల్‌లోని ప్రాంతం పశ్చిమబెంగాల్‌గా ఏర్పడింది. ఆ తరువాత బంగ్లాదేశ్‌గా మారిన నాటి తూర్పు పాకిస్థాన్‌లో నిరంతర దాడులు, ఆత్యాచారాల మూలంగా పెద్దసంఖ్యలో హిందువులు పశ్చిమబెంగాల్‌లో తలదాచుకోవలసి వచ్చింది. ఇలా పెద్ద సంఖ్యలో హిందువులు వచ్చినప్పటికీ పశ్చిమబెంగాల్‌లో 1951 లెక్కల ప్రకారం 78.45% ఉన్న హిందూ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 70.54 శాతానికి తగ్గడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది దేశ భద్రత, సమైక్యతలకు సంబంధించి చాలా ఆందోళన కలిగించే విషయం.

రాష్ట్రంలో తీవ్రవాద హింస, ప్రభుత్వం అనుసరిస్తున్న ముస్లిం సంతుష్టీకరణ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్న అఖిలభారతీయ ప్రతినిధి సభ జిహాదీ హింస, రాష్ట్ర ప్రభుత్వపు మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా అవగాహన కలిగించాలని దేశ ప్రజలకు పిలుపునిస్తోంది. రాష్ట్రంలోని ప్రమాదకరమైన స్థితిని దేశం ముందుకు ఉంచేందుకు చొరవ తీసుకోవాలని ప్రసారమాధ్యమాలను (మీడియా) కోరుతోంది. అలాగే సంకుచిత ఓటు బ్యాంకు రాజకీయాలను వదిలి రాజ్యాంగబద్ధమైన బాధ్యతల్ని నిర్వర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిలభారతీయ ప్రతినిధి సభ కోరుతోంది. జాతీయ భద్రత దృష్ట్యా రాష్ట్రంలోని జాతి వ్యతిరేక జిహాదీ శక్తులపై కఠినమైన చర్య తీసుకోవాలని అఖిలభారతీయ ప్రతినిధి సభ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతోంది.

తీర్మానం వివరాలు  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here