Home Telugu Articles ఆర్ ఎస్ ఎస్, సైన్యం మధ్య ఉన్నది పరస్పర విశ్వాసమే ..

ఆర్ ఎస్ ఎస్, సైన్యం మధ్య ఉన్నది పరస్పర విశ్వాసమే ..

0
SHARE

– రాకేశ్ సిన్హా

బ్రిటిష్ వాళ్ళు రెండవ ప్రపంచయుద్దంలోకి భారత్ ను కూడా లాగారు. అలా చేస్తే భారతీయులు తమకు మద్దతుగానిలుస్తారని, వారికి తమపట్ల ఉన్న వ్యతిరేకత తగ్గుతుందని వాళ్ళు భావించారు. యుద్ద సన్నాహాల్లో కమ్యూనిస్టులు, హిందూమహాసభ చురుకుగా పాల్గొన్నాయి కూడా. కానీ కొన్ని కారణాలవల్ల కాంగ్రెస్ ఆ ప్రయత్నాలకు దూరంగా ఉండిపోయింది. అలాగే ఆర్ ఎస్ ఎస్ కూడా సామ్రాజ్యవాద పాలకులకు సహకరించేది లేదని స్పష్టం చేసింది. ఆర్ ఎస్ ఎస్ నుండి బ్రిటిష్ వాళ్ళు రాజకీయ బలాన్ని, మద్దతును కోరుకోలేదు. ఇటీవల మోహన్ భాగవత్ జీ చెప్పినట్లుగా ఆర్ ఎస్ ఎస్ కు తక్కువ సమయంలోనే ఒక సైన్యంగా రూపొందగలిగే సామర్ధ్యం ఉంది. ఆ సామర్ధ్యాన్ని ఉపయోగించుకోవాలని బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. 1940లో దేశం మొత్తంలో 1లక్ష 50 వేల మంది స్వయంసేవకులు ఉన్నారు. వీళ్ళంతా రోజు శాఖల్లో, ప్రత్యేక శిక్షణా శిబిరాల్లో క్రమశిక్షణ, మాతృదేశానికి తమ జీవితాలను అర్పించడానికి సిద్ధంగా ఉండడం వలన వీరికి సైనిక శిక్షణ ఇవ్వడం చాలా సులభమని బ్రిటిష్ సైనిక అధికారులు భావించారు. యుద్ద సమయంలో బ్రిటిష్ సైన్యానికి సుశిక్షితులైన స్వచ్ఛంద కార్యకర్తలు (ఏ ఆర్ పి) అవసరమయ్యారు. ఏ ఆర్ పి కి పనికివచ్చే వాళ్ళు దేశంలో చాలమందే ఉన్నారు. కానీ అలాంటి యువతను సైన్యంలోకి ఆకర్షించడానికి వారి వద్ద ఎలాంటి వ్యవస్థ లేదు.

అంతేకాదు కొత్తవారికి శిక్షణ ఇవ్వడానికి కొన్ని నెలలు పడుతుంది, చాలా శ్రమతో కూడుకున్న పని. దీనితో అత్యవసరంగా స్వచ్ఛంద కార్యకర్తలను తయారుచేసుకునేందుకు ఆర్ ఎస్ ఎస్ బాగా ఉపయోగపడుతుందని బ్రిటిష్ అధికారులు భావించారు. కానీ తాము కోరినవిధంగా సహకరించడానికి తిరస్కరించిన ఆర్ ఎస్ ఎస్ ఆజాద్ హింద్ ఫౌజ్ కు మద్దతు తెలుపుతోందనే ఇంటలిజెన్స్ నివేదికతో బ్రిటిష్ పాలకులకు కోపం వచ్చింది. దానితో ఆగస్ట్ 1940లో ప్రభుత్వం ఆర్ ఎస్ ఎస్ శాఖలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 1945లో సంఘ శిక్షణ శిబిరాలను కూడా చట్టవిరుద్దమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వానికి నచ్చచెప్పడానికిగాని, ఒప్పించడానికిగాని సంఘ ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

జాతీయ విపత్తు వచ్చినప్పుడు సహాయపడేందుకు సంఘం ఎప్పుడు సంసిద్దంగా ఉంటుందనే భాగవత్ జీ చెప్పిన విషయాన్ని ఋజువుచేసే సమాచారం చాలానే ఉంది. 1948లో కాశ్మీర్ పై పాకిస్తాన్ దాడి చేసినప్పుడు చాలామంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలకు సైన్యం శిక్షణ ఇచ్చింది. వారిని చాలా త్వరితంగా విధులకు సిద్దం చేసింది. అలాగే 1962 యుద్ద సమయంలో స్వయంసేవకులు పౌర, సైనిక విధులను నిర్వర్తించారు. అప్పుడు స్వయంసేవకుల అద్భుతమైన పని చూసిన జవాహర్ లాల్ నెహ్రూ సంఘ్ పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకుని 1963 రిపబ్లిక్ దినోత్సవంలో పాల్గొనాల్సిందిగా స్వయంసేవకులను ఆహ్వానించారు.

అలాగే 1965లో 22 రోజులపాటు జరిగిన భారత-పాకిస్తాన్ యుద్దంలో కూడా స్వయంసేవకులు అమోఘమైన పద్దతిలో విధులు నిర్వహించారు. దేశ రాజధానిలో నీరు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ మొదలైన పనులతోపాటు సైన్యానికి సహాయం అందించారు. సంఘ స్వయంసేవకులు, సైన్యం మధ్య పరస్పర విశ్వాసం, గౌరవం కనిపిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో పని చేసినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకులు పనిచేసిన తీరు సైన్యానికి తెలుసు. అన్నింటికంటే మించి మానవహక్కుల పేరుతో బూటకపు సెక్యులరిస్టులు సైన్యంపై చేసే దుష్ప్రచారాన్ని, ఆరోపణలను ఆర్ ఎస్ ఎస్ ఎప్పుడు వ్యతిరేకించడమే కాక సైన్యానికి మద్దతుగా నిలిచింది.

సచార్ కమిటీ సిఫార్సులను అనుసరించి సైన్యంలో మతప్రాతిపదికన సంఖ్యా వివరాలు సేకరించాలన్న ప్రయత్నాన్ని సమర్ధించడం ఈ బూటకపు సెక్యులరిస్టులు సైన్యంపై సాగించిన అతిపెద్ద దాడి అని చెప్పవచ్చును. ఈ విషయంలో సచార్ కమిటీ సభ్య – కార్యదర్శి అబూసలే షరీఫ్ కు మేజర్ కె పి డి శర్మ ఇచ్చిన సమాధానం చక్కగా ఉంది. అందులో శర్మ “భారతీయ సైన్యానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఇందులో అన్నీ కులాలు, మతాలకు చెందినవాళ్లు ఉన్నారు. దేశం మొత్తం నుంచి, అన్ని వర్గాల నుంచి సైనికులు ఉన్నారు. ఇది ఎంతో గర్వించదగిన, ప్రత్యేకమైన విషయం. ఇలా కులం, మతం, జాతి భేదాలు ఏవి లేకుండా సైనికులంతా ఒక్కటిగా, సోదరభావంతో మెలగడం, పనిచేయడమే అతి ముఖ్యమైన విషయం’’ అని అన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు “కనుక కులం, మతం ఆధారంగా సైన్యంలో ఎలాంటి వివరాలు ఉండవు. ఇప్పుడు అలాంటి వివరాలు సేకరించాలనుకోవడం మంచిది కాదు’’.  సచార్ కమిటీ ని సైన్యం తిరస్కరించడాన్ని ఆర్ ఎస్ ఎస్ , బి జె పి పూర్తిగా సమర్ధించాయి.

తీవ్రమైన ఆర్ ఎస్ ఎస్ వ్యతిరేకతతో బాధపడే రాజకీయ, మేధావి వర్గం ఒకటి ఈ దేశంలో ఉంది. అది అందరికీ తెలుసు. ఏ విషయాన్నైనా వక్రీకరించడంలో, దుర్వ్యాఖ్య చేయడంలో వీళ్ళు ప్రావీణ్యత సంపాదించారు. ఇప్పుడు భాగవత్ జీ విషయంలోనేకాదు , అంతకుముందు ఎం.ఎస్.గోల్వాల్కర్ చెప్పిన విషయాలను కూడా ఇలా వక్రీకరించడం, దుర్వ్యాఖ్య చేయడం వీరికి అలవాటే. భాగవత్ జీ సైన్యాన్ని, ఆర్ ఎస్ ఎస్ ను పోల్చి చూడలేదని వీళ్ళకి కూడా తెలుసు. కానీ రాజకీయ అవసరాల కోసం ఆ మాటల్ని వక్రీకరించారు. ఇది పూర్తిగా అనైతికమేకాక , రాజకీయ సంవాదం ఎంత దిగజారిపోయిందో తెలియజేస్తోంది. అయితే ఇలాంటి వక్రీకరణలు మొదటిసారికాదు. దశాబ్దకాలంగా ఇవి సాగుతూనే ఉన్నాయి. కానీ భాగవత్ జీ ఎప్పుడు వీటికి సమాధానం ఇవ్వలేదు, ఎవరిని దూషించలేదు. భాగవత్ జీ ఏ మాటైనా బాగా ఆలోచించి మాట్లాడతారు. ఒక వర్గంపై ద్వేషం, సంకుచిత తత్వం, ఆధిక్యభావన వంటివి భాగవత్ జీ, గోల్వాల్కర్ జీ ఉపన్యాసాల్లో ఎక్కడ కనిపించవు. తనకు ఎదురైన పరిస్థితులు, విషయాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే మాట్లాడతారు.

మాతృభూమి కోసం అత్యున్నతమైన త్యాగానికి కూడా ఎల్లప్పుడు సిద్దంగా ఉండాలని భాగవత్ జీ చెప్పడం కొత్తేమీకాదు. అలాగే ప్రపంచంలో అనేకమంది నాయకులు తమ కార్యకర్తలకు బోధించారు. 1860 నవంబర్ లో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 40 వేల మంది కార్యకర్తలకు కనీసం మూడేళ్లపాటు సైన్యంలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ముజఫర్ నగర్ లో భాగవత్ జీ అదే పని చేశారు. `అవసరమైతే మేమున్నాం’ అని హామీ ఇచ్చారు.