Home Rashtriya Swayamsevak Sangh ఆర్‌.ఎస్.ఎస్ : నిత్యనూతనం, ప్రత్యేకం

ఆర్‌.ఎస్.ఎస్ : నిత్యనూతనం, ప్రత్యేకం

0
SHARE

హిందూ సంస్కృతే హిందూస్థాన్ ల‌ మంత్రము. హిందుస్తాన్ బ‌ల‌పడాలీ అంటే హిందూ సంస్కృతి పరిఢవిల్లాలి. ఈ దేశంలో హిందూ సంస్కృతి నాశనం అయిందీ అంటే ఇక ఈ దేశాన్ని హిందుస్తాన్ అని ఎలా పిలవగలం? హిందుస్తాన్ అనే ప్రదేశం ఒక నైసర్గిక ప్రదేశం మాత్రమే అయి ఉండరాదు. ఇక్కడి సంస్కృతిని గౌరవించని ఏ విదేశి శక్తి అయినా మిరమిట్లు గొలిపే ఈ సంస్కృతిని కన్నెత్తి చూడాలి అన్నా, పన్నెత్తి మాట్లాడాలన్నా తగిన అర్హత కలిగి ఉండాలి. అలా జరగాలీ అంటే మన సమాజం తగినంత శక్తి కలిగి ఉండాలి. ఇక్కడి వారు మన సంస్కృతికి తగిన గౌరవం ఇవ్వాలి. ఈ శక్తి సమాజ చేతనపై ఆధారపడి ఉంది. ప్రతీ హిందువుకూ ఈ బాధ్యత ఉంది. సంఘటితంగా పనిచేయాలి ఇది అత్యంత ఆవశ్యకం. సంఘ్ ఈ గురుతర బాధ్యత తన భుజాల మీద వేసుకుంది. ఈ దేశాభివృద్ధికి ముఖ్యమైన సాధనం యువత. దేశం సరైన దిశలో అడుగులు వేయాలీ అంటే క్రమ శిక్షణ కలిగిన జీవితం నిస్వార్థంగా దేశం కోసం అంకితం చేసే వేలాది యువతీ యువకులు కావాలి. ఆ ప్రధాన బాధ్యత కూడా సంఘ్ త‌న భుజాల మీదవేసుకొంది.”    -డా. కేశవ బలిరామ్ హెడ్గేవార్, సంఘ స్థాపకులు 

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆవిర్భావము, నిరంతర అభివృద్ధి ఇవి 20వ శతాబ్దంలో భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం. సంఘ ఆసేతుహిమాచలం విస్తరించి తన ప్రాముఖ్యతను చాటుకోవడమేకాక. విదేశాలలో కూడా గుర్తింపు తెచ్చుకొంది. సూర్యుని తేజస్సు నలుదిశలా ప్రసరించినట్టు సంఘ్ నుంచి సంఘ్ ఆశయాల నుండి స్ఫూర్తి పొంది అనేక సంస్థలు ఆవిర్భవించాయి. సామాజిక, సాంస్కృతిక, విద్య, రాజకీయవంటి అనేక రంగాలలో జాతీయ భావనలు నరనరాన జీర్ణించుకొన్న సంస్థలు తమ ప్రత్యేకతను చాటుతూ ఉన్నాయి.

విచ్చిన కరశక్తుల పై పొరాటానికి గానీ, సామాజిక సమరసత సాధనకై గానీ సంఘం ఏదైనా పోరాటం చేబడితే అది జనబాహుళ్యం వరకూ చేరి సరైన నిర్ణయాత్మక మార్పు వచ్చే వరకు అన్నీ సంస్థలు పనిచేస్తాయి. సంఘ్ అంటే చర్చలు జరిపే సంస్థ కాదు. ఒక వ్యవస్థాత్మక ఆచరణ బృందం అని ప్రపంచానికి తేటతెల్లం. సనాతన భారతీయ ధర్మాచరణ, సాంస్కృతిక జాతీయవాద ఆలోచనల ఊతంతో స్ధిరంగా నిలబడ్డ చల్లని పందిరి సంఘ్.

సమాజసేవను తమ జీవిత లక్ష్యంగా ఎంచుకొని జీవితాలను అంకితం చేసిన వేలాది మంది పనిచేస్తూ ఉండటం సంఘ్ అరుదైన ఘనత. ఈ విషయంలో ఆ కార్యకర్తల సేవానిరతి అంకితత్వం విషయంలో వారిని ఏ విమర్శకుడూ వేలెత్తి కూడా చూపలేరు.

ఒక వ్యక్తి వ్యవస్తాకృత శక్తి గా మారి దేశానిర్మాణం లో పాలుపంచుకోవటం భారతదేశం లోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఎక్కడా కనపడదు. భారతజాతీయ వాదం, ఉనికి, గుర్తింపు చాటడం కోసం సంఘ్‌ పనిచేస్తోంది. దశాబ్దాల పాటు భారతీయతపై మానసిక, సాంస్కృతిక , ఆర్ధిక మూలాల పై విదేశీ మూకలు ముప్పేట దాడి చేసినా, చేస్తున్నా గడ్డు కాలంలో సంఘం స్థాపించబడినది.

మునుముందుకే ప్రయాణం

అత్యంత ఉన్నత ఆలోచనలు భావాలు గల సనాతన భారతీయ సంస్కృతి దాని విలువలపై గర్వపడే లక్షలాది భారతీయుల ధర్మ పరిరక్షణ ధ్యేయం ఈ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు అలుపు లేని ప్రయాణాన్ని కలిగిస్తోంది అనేది నిర్వివాదాంశం. సర్వమానవ సమానత్వం, సర్వ మత సమభావం, సర్వ ప్రాణి సహజీవన విధానం ఇవన్నీ భారతీయత మూల సూత్రాలు. ఆధ్యాత్మిక అనుభవాన్ని వ్యక్తిగతంగా చవిచూడటం ముఖ్యమైన భారతీయ సనాతన సంస్కృతి. సంఘ లక్ష్యం సనాతన వారసత్వ సంపదను సంస్కృతి ని కంటికిరెప్పలా కాపాడు కోవటం. ఈ అపూర్వమైన లక్ష్యం సంఘ సభ్యులను ఉత్తేజ పరుస్తూ నడిపిస్తూ ఉన్నది.

1947 లో స్వతంత్రం సిద్దించగానే భారత జాతీయ భావనను , సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంచి దేశ దృక్కోణాన్ని సరిచేసే అద్భుత అవకాశం మనకు కలిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అవకాశాన్ని మనం వొదులుకున్నాము. ఎప్పుడైతే ధర్మాన్ని మనిషి ఔన్నత్యానికి ముఖ్యమైన అంశంగా, జాతీయ సమైఖ్యతకు అవసరమైన వనరుగా మనం గుర్తిస్తామో ఆ రోజు జాతీయ భావన దేశభక్తి వాటంతట అవే సిద్దిస్తాయి.

ఇప్పుడు మన రాజకీయ రంగంలో సరైన ఆదర్శవాదం లేకపోవటం అతి పెద్ద సమస్య. ఈ వాతావరణం లో సంఘ వ్యక్తులలో ఆధర్శ వంత జీవితాన్ని. క్రమశిక్షణను, దేశభక్తి ని పెంపొందిస్తుంది. మాతృభూమి పట్ల ప్రేమను , బాధ్యతను అందిస్తుంది . జాతీయ ఆదర్శాలను అన్నీ రంగాలకు, అన్నీ వ్యవస్థలకు, ప్రజలందరికీ అందిస్తూ జాతి పునర్నిర్మాణ కార్యాన్ని చేపడుతోంది. స్వామి వివేకానంద చెప్పిన వ్యక్తి నిర్మాణ బాధ్యతను మనసా, వాచా, కర్మణా సంఘం నిర్వహిస్తోంది .

సంఘ అంటే నిరంతర ఉత్ప్రేరక శక్తి

ఒక విత్తనం నుంచి శాఖోపశాఖలు గల మహా వృక్షం అవతరించినట్టు, 96 సంవత్సరాల క్రితం నాగపూర్‌ లో ఒక మారుమూల ప్రాంతంలో మొదలైన సంఘం ఇప్పుడు 57,000కు పైగా శాఖలు కలిగి పెద్ద సమూహం గా రూపొందింది. దాదాపు దేశంలోని మారు మూల గ్రామాలకు కూడా చేరుకుంది.

అనేక సంవత్సరాల చర్చలు, విశ్లేషణలు ఆలోచనలు కలగలిపి 27 సెప్టెంబర్ 1925 విజయదశమి నాడు డా. కేశవ బలిరామ్ హెడ్గేవార్ (1889-1940 ) భారతీయ సమాజం లో సామాజిక, ఆర్ధిక , సాంస్కృతిక, ఆధ్యాత్మిక , తాత్విక , రాజకీయ అంశాలలో ఏర్పడే సవాళ్లను ఎదుర్కోవడం కోసం ముందు చూపుతో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం, ఎందరో మహానుభావులు వివేకానంద, దయానంద స‌ర‌స్వ‌తి, అరబిందో, తిలక్ వంటి దార్శనీకులు ఇచ్చిన దిశానిర్దేశంకు అనుగుణంగా ఏర్పడింది. స్వల్పకాలీక లక్ష్యాల పై ఆలోచనలు కార్యాచరణ కు తొందరపెట్టినా డా కేశవ బలిరామ్హెడ్గేవార్ దృష్టి దీర్ఘకాలిక ఉన్నతమైన లక్ష్యాల పై నుండి సడలలేదు. ఒక సంస్థ ను నిర్మించేటప్పుడు , నిర్మాణత లో రోజూవారి కార్యక్రమాలు వాటి వత్తిడి లో దీర్ఘకాలిక దృష్టి దెబ్బ తినే అవకాశం ఉంది . అనేక ఒత్తిళ్లను తట్టుకొని సంఘ కార్యక్రమం దీర్ఘకాలిక లక్ష్యం చేదిరిపోకుండా గట్టి పునాది వేశారు డా.కేశవ బలిరామ్ హెడ్గేవార్. ఆ పునాది వల్లే ఈ సంఘ ఇప్పుడు దేశానికి అత్యంత ఆవశ్యకమైన వారసత్వ సంపదకు శాశ్వత ధర్మ కర్తృత్వయాన్ని నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య దీపాన్ని కోడిగట్టనీయకుండ కాపాడుతూ , జాతీయ మూలాలను తవ్వి తీసి పాదుచేసి, పందిరి వేసి అందంగా అల్లుకునే ఏర్పాటు చేసింది. సరైన నిర్వచనం లేని “ Secularism “ వల్ల, అనాలోచిత విలువల లేమి గల ఒక సమాజం ఏర్పడటం . మూలాలు మరిచిన ఆర్ధిక, సామాజిక , రాజకీయ నిర్ణయాలు,వేర్పాటువాదం . విచ్చినకర శక్తుల విలయం, అడ్డు అదుపు లేని మతమార్పిడి ఇలా అనేక సమస్యలు ఈ దేశ ప్రజలు తమ మూలాలను మరిచిపోయి జాతి సమైక్యత కు ఆటంకం కలిగించే పరిస్థితికి చేరుకుని , ప్రభుత్వం కూడా హిందూ ఆలోచనలకు, హిందుత్వ సంస్కృతి ని వ్యతిరేకించడం మొదలైంది . ఇక హిందూ బాహుళ్యాన్ని దెబ్బ తీసేందుకు , హిందువులను మతం మార్చేందుకు విదేశీ శక్తులు డబ్బులు వేదజల్లుతూ ధనం, వస్తు లంచం ఇవ్వట‌ము లేదా నయానాభయనా బెదిరించడం ద్వారానూ అదుపు లేని ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి సంధి కాలం లో డా.హెడ్గేవార్ మహానుభావుని దీర్ఘదృష్టి ఏమిటో స్పష్టం గా అర్ధం అవుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో హిందూ సంస్కృతి పై దాడిని ప్రశ్నించింది , అడ్డుకున్నది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం మాత్రమే ఇది నిర్వివాదాంశం.

“ఈ బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్ళిన మన హిందూ సమాజం వ్యవస్థీకృతం కాకపోతే ఒక బలమైన జాతిగా ఎలా ఎదుగుతాము?“ అని స్వతంత్ర్యయానికి ముందే డా. హెడ్గేవార్ ప్రశ్నించేవారు. స్వాతంత్ర్యం సిద్దించయిన తొలి నాళ్ళలో సింధ్, పంజాబ్, బెంగాల్ భారత్ నుండి విడిపోయినాయి. అక్కడి హిందువుల ఊచకోత అందరికీ తెలిసిన సత్యమే. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా కాశ్మీరీ లో జరుగుతున్న నరమేధం అందరికీ తెలిసినదే, అస్సాం ప్రాంతం లో అక్రమ వలసల తో ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా జరుగుతున్న ప్రయత్నాలు, ఇక మత మార్పిడి క్రిస్టియన్ ముఠాలు చేస్తున్న ఆరాచకాలు (నాగాలాండ్ వంటి ప్రాంతాలలో సాయుధ తిరుగుబాటు మొదలైన) వీటన్నిటికీ తగిన ఆర్ధిక వనరులు అందజేయడానికి విదేశీ సంస్థలు ఎంత వువీళ్ళూరుతున్నాయి. భారతదేశాన్ని బలహీన పరచడానికి ఎన్నీ కుట్రలు పన్నుతున్నాయో మనకందరికీ తెలుసు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ మాత్రమే నిరస‌నలకు గొంతు, పోరాటాలకు దన్ను ఇచ్చిన ఏకైక సంస్థ. దేశ భక్తి గల ప్రతి ఒక్కరికీ ఒక శక్తిని ధైర్యాన్ని ఇచ్చిన మేరు పర్వతం . సంఘ స్థాపన లక్ష్యం ఒక ప్రేరణాత్మక శక్తి కేంద్రంగా వ్యవహరించి దేశాభివృద్ధికి అవసరమైన అన్నీ రంగాలను ప్రభావితం చేయడం. 100 సంవత్సరాలు కాదు వెయ్యేళ్ళు ఉన్నా ఈ లక్ష్యం నుంచి పక్కకు తొలగటం కల‌.