Home News ఆ ‌బలిదానాలకు వందనం

ఆ ‌బలిదానాలకు వందనం

0
SHARE

స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 5

– ‌డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గోడ్బొలే

భగత్‌సింగ్‌, ‌సుఖ్‌దేవ్‌, ‌రాజ్‌గురులను మార్చి 23, 1931న ఉరితీశారు. సోలాపూర్‌లో ఇద్దరు పోలీసులను చంపిన కేసులో నలుగురు దేశభక్తులను అంతకు ముందు జనవరి 13, 1931న ఉరితీశారు. ఈ రెండు సందర్భాలలో స్వయం సేవకులు ఆ అమర వీరులకు వందనం చేశారు. ఆ రోజు సంఘ కార్యక్రమాన్ని రద్దు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, 1931న కూడా సంఘ్‌ ‌కార్యక్రమాలు రద్దయ్యాయి. నాగపూర్‌లో కాంగ్రెస్‌ ‌నిర్వహించిన ఊరేగింపులో 55 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 6, 1931న మోతీలాల్‌ ‌నెహ్రూ మరణించారు. ఆ మరుసటి రోజు ఆయన స్మృత్యర్థం సంఘ్‌ ‌శాఖలకు సెలవు ప్రకటించారు.

కుంటుపడిన శాఖలు

కొంతకాలం కొన్నిచోట్ల అటవీ సత్యాగ్రహం సంఘ కార్యక్రమాలలో వేగం తగ్గించింది. చిముర్‌ (‌చందా జిల్లా) సహ సంఘచాలక్‌ ‌మాధవ్‌ ‌నారాయణ భోపె హెడ్గేవార్‌కు ఇలా రాశారు. ‘చిమర్‌లో సామూహిక అటవీ సత్యాగ్రహం ఆగస్ట్24, 1930‌న జరిగింది. 1500-1600 మంది పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 16, 1930 ‌నుంచి వారిని అరెస్టు చేయసాగారు. అదే నెల 22 నాటికి 15 మందిని నిర్బంధించారు. వీరిలో చాలా మంది సంఘ్‌ ‌వారు కావడంతో మిగిలిన స్వయం సేవకులు దృష్టి అటు మళ్లింది. కాబట్టి గత రెండు నెలలుగా సంఘ్‌ ‌కార్యక్రమాలు పూర్తిగా నిలిచి పోయాయి. కాంగ్రెస్‌ ‌ప్రచారకర్తలు చిముర్‌ ‌వచ్చి ప్రసంగించారు. దీనివల్ల స్వయంసేవకులు, గ్రామస్తులు మొత్తం 200 మంది కాంగ్రెస్‌ ‌స్వచ్ఛంద సేవకులుగా మారారు. కాంగ్రెస్‌ ‌కోసం ప్రచారం చేయసాగారు (Sangh archives, Hedgewar papers, register 3/DSC-0061). 1921 లెక్కల ప్రకారం చిముర్‌ ‌జనాభా 5,500. 1929 నవంబర్‌ ‌వరకు అక్కడ 69 మంది స్వయంసేవకులయ్యారు. 1930 నాటి అల్లిపూర్‌ (‌వార్దా జిల్లా) దసరా ఉత్సవ్‌ ‌నివేదికలో ఇలా ఉంది. ‘గత సంవత్సరం వర్కింగ్‌ ‌కమిటీలో ఎలాంటి మార్పు లేదు. జరుగుతున్న ఈ ఉద్యమం కారణంగా కేవలం గోవిందరావు ఆప్టే (సేనాపతి, కోశాధికారి), బాలాజీ కోత్‌కర్‌ (‌సూపర్‌వైజర్‌) ‌వారి వారి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ రోజుల్లో 20-25 మంది సంఘ్‌లో ఉన్నారు. కానీ చాలామంది ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం వల్ల హాజరు కావడంలేదు. మిగతా అన్ని నిర్దేశిత స్థలం లేకపోవడం వల్ల పూర్తిగా నిలిచి పోయాయి. కేవలం ప్రార్థనలు, వ్యాయామం నిర్వహిస్తున్నారు. సూచనలు ఇవ్వడానికి ఎవ్వరూ లేరు. 1921 జనాభా లెక్కల ప్రకారం అల్లిపూర్‌ ‌జనాభా 4443. నవంబర్‌ 1929 ‌వరకు అక్కడ ఉన్న స్వయం సేవకులు 110 మంది (Sangh archives, Hedgewar papers, register 7/DSC-0062). దసరా ఉత్సవ నివేదిక అక్టోబర్‌2, 1930‌లో ఇలా ఉంది. ‘‘స్వయంసేవకులపై కాంగ్రెస్‌ ‌ప్రభావం వల్ల, అక్కడ (బ్రహ్మపురి, చందా జిల్లా) ఉత్సాహంగా ఈ ఉత్సవం జరపడం కష్టం. ఆయుధ పూజ తరువాత, రాందాస్‌ ‌స్వామి, శివాజీ, లోకమాన్య, గాంధీ, వజ్రదేహి హనుమాన్‌ ‌చిత్ర పటాలతో ప్రార్థన జరిగింది’’ (Sangh archives, Hedgewar papers, register 7/DSC-0068).

సానుకూల ప్రభావం

అటవీ సత్యాగ్రహం సమయంలో సంఘ విస్తరణకు అవకాశం కలిగింది. సెంట్రల్‌ ‌ప్రావెన్స్‌కు చెందిన వారు కాబట్టి హెడ్గేవార్‌ అక్కడే సత్యాగ్రహ చేస్తారని అనుకున్నారు. కాని ఆయన బేరార్‌ను ఎంచుకున్నారు. ఆ సమయంలో బేరార్‌లో సంఘం గురించి పెద్దగా తెలియదు. బేరార్‌ ‌సత్యాగ్రహులను అకోలా జైలులో పెట్ట్టేవారు. సంఘం వైపు నుండి చూస్తే, హెడ్గేవార్‌ను అకోలా జైలులో పెట్టడం డాక్టర్‌జీకి లాభదాయకమైంది. అకోలా జైలులో కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఎవరైతే హెడ్గేవార్‌కు పరిచ మయ్యారో, వారంతా సంఘ కార్యకర్తలు అయ్యారు. అకోలా జైలు నుండి విడుదలయ్యాక, హెడ్గేవార్‌ ఆగస్టు-సెప్టెంబర్‌ 1931‌లో బేరార్‌లో పర్యటిం చారు. చాలాచోట్ల శాఖలు ప్రారంభించారు. 1931 సెప్టెంబర్‌లో శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో చాలా మందిని సంఘచాలకులుగా హెడ్గేవార్‌ ‌నియమించారు. డా. యాదవ్‌ శ్రీ‌హరి ఆణే, (వాని, ఈయన కలకత్తా రోజుల నుంచి హెడ్గేవార్‌ ‌స్నేహితుడు. ఆగస్టు 1930లో అరెస్టు అయ్యాడు), డా. ప్రహ్లద్‌ ‌మాధవ్‌ ‌కాలే (కాంగావ్‌), ‌దాజి సాహెబ్‌ ‌బేదర్‌కర్‌ (అకోట్‌), ‌శంకర అలియాస్‌ అన్నాసాహెబ్‌ ‌డాబిర్‌ (‌వాషిం), బాపు సాహెబ్‌రావు దర్‌వాహ (యావత్‌మాల్‌ ‌జిల్లా) సంఘచాలకులుగా నియమితులయ్యారు. ‘ఉదయ్‌’ ‌పత్రిక సంపాదకుడు నారాయణ రాంలింగ్‌ ఒయన్‌ ఒన్‌కల్‌ అమరావతిలో జూలై 29, 1930న అరెస్ట్ అయ్యారు. ఆయన సెప్టెంబర్‌ 11, 1933‌న అమరావతి సంఘచాలక్‌గా నియమితులయ్యారు.

చిటాల్‌ ‌జ్ఞాపకాలు

అకోలా సంఘచాలక్‌ ‌గోపాల్‌కృష్ణ అలియాస్‌ ‌బాబాసాహెబ్‌ ‌చిటాలే హెడ్గేవార్‌ ‌కంటే వయసులో పెద్దవారు. హెడ్గేవార్‌ అం‌టే అంతులేని అప్యాయత కలవారు. ఆయన జ్ఞాపకాలు ఇలా ఉన్నాయి. ‘హెడ్గేవార్‌ ‌సత్యాగ్రహం చేశారని తెలియగానే 128 మంది సంఘ కార్యకర్తలు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అందరికి శిక్ష పడింది. వారిని అకోలా జైలులో నిర్బంధించారు. 25 మంది ముందు సరదాగా చిటాలే ఇలా అన్నారు. ‘నువ్వు అటవీ సత్యాగ్రహానికి వెళ్లి, ఒక గడ్డిపోచ కోశావు. ఇప్పుడు నువ్వు తొమ్మిది నెలలు జైలులో మగ్గిపోయావు. నువ్వు ఏం సాధిం చావు? దానికి తోడు 125 మందిని కూడా తీసుకెళ్లావు. ఇప్పుడు సంస్థ ఎదుగుదల ఆగి పోతుంది. సంఘ పనికి చాలా నష్టం వాటిల్లుతుంది’. హెడ్గేవార్‌ ‌మిగతా అందరూ ఐదు నిముషాలు నవ్వారు. నా వ్యాఖ్య గురించి హెడ్గేవార్‌ ఏమనుకున్నారో ఎవరికి తెలుసు! కానీ చాలా సంతోషంగా, అభినందన పూర్వకంగా ఆయన వేలాది మందికి ఇలా చెప్పేవారు, ‘బాబా చిటాలే నన్ను జైలులో కలిసి నేను కేవలం ఒక గడ్డిపోచను కోసి తొమ్మిది నెలలు జైలులో మగ్గిపోయానని వ్యాఖ్యానించారు! ఆయన అలా సంతోషపడేవారు’ (కేసరి జూలై 2, 1940).

వందలాది మంది స్వయంసేవకులు హెడ్గేవార్‌తో అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. సంఘం బేరార్‌లో విస్తరించింది. తమ నాయకుడి నుండి అధికారిక ఆదేశం లేకున్నా, స్వయంసేవకులు తమ జాతీయ భావాన్ని సంఘస్థాన్‌ ‌లోపల, బయట చూపించారు. హెడ్గేవార్‌ ‌సంతృప్తితో చిటాలే వ్యాఖ్యకు ఈ ప్రతిస్పందన ఇచ్చారు.

(అయిపోయింది)

మొద‌టి భాగం : అటవీ సత్యాగ్రహంలో సంఘ్‌ (స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 1)

రెండ‌వ భాగం : సర్‌సంఘచాలక్‌ ‌బాధ్యతకు విరామం (స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 2)

మూడ‌వ భాగం : సత్యాగ్రహి డా. హెడ్గేవార్‌ (స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 3)

నాల్గ‌వ భాగం : అడుగుజాడే ఆదర్శం (స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ – 4)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here