Home News ఆర్‌.ఎస్‌.ఎస్‌. జ్యేష్ఠ ప్రచారక్‌ రాంభావు హల్దేకర్‌జీ అస్తమయం

ఆర్‌.ఎస్‌.ఎస్‌. జ్యేష్ఠ ప్రచారక్‌ రాంభావు హల్దేకర్‌జీ అస్తమయం

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ జ్యేష్ఠ ప్రచారకులో ఒకరైన రాంభావు హల్దేకర్‌ (వయసు 87 సం.) ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటకు భాగ్యనగర్‌ బర్కత్‌పురాలో గల ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రాంత కార్యాయంలో తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజుగా శ్వాసకోశ సంబంధమైన వ్యాధుకు గురియై , చికిత్స తీసుకొన్నారు.

జీవిత విశేషాలు:

‘హల్దేకర్‌జి’ గా పరిచయమైన శ్రీ రామచంద్ర సదాశివ హల్దేకర్‌ 5.2.1930, దాసనవమి రోజున మహారాష్ట్రలోని శంభాజి నగర్‌ (ఔరంగాబాద్‌) జిల్లా ‘హల్దా’ గ్రామంలో జన్మించారు. హైదరాబాద్‌లో బి.ఎస్‌.సి. చదువుతున్నప్పుడే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పట్ల ఆకర్షితుడై చదువును వదిలేసి సంఘ ప్రచారక్‌గా వచ్చి సంఘ పని ప్రారంభించారు.

1954లో భాగ్యనగర్‌ ప్రచారక్‌గా, 1959 నుండి 1962 వరకు పాలమూరు, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాలతో ఉండే హైదరాబాద్‌ విభాగ్‌ ప్రచారక్‌గా, 1963లో వరంగల్‌ విభాగ్‌ (ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లా) ప్రచారక్‌గా, 1969లో మళ్ళీ భాగ్యనగర్‌ విభాగ్‌ ప్రచారక్‌గా, 1978 నుండి విజయవాడ విభాగ్‌ (పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాు) ప్రచారక్‌గా, 1980 నుండి ఆంధ్రప్రదేశ్‌ సహ ప్రాంత ప్రచారక్‌గా, 1989లో ప్రాంత ప్రచారక్‌గా, 1991 నుండి ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా కలిసిన ఆగ్నేయ క్షేత్రానికి క్షేత్ర ప్రచారక్‌గా పనిచేశారు. 2003 నుండి ఒక దశాబ్దం పైగా దక్షిణ మధ్య (ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక) క్షేత్రానికి కార్యకారిణి సదస్యులుగా భాద్యతలు వహించారు. 1999లో ఒరిస్సాలో సంభవించిన తుఫాను, ఉప్పెన అనంతరం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలో కీలకపాత్ర వహించారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్వయంసేవకు కుటుంబాలలో విస్తృతంగా వ్యక్తిగతంగా ఆత్మీయ పరిచయాు ఏర్పరచుకున్న సంఘ ప్రచారక్‌ శ్రీ హల్దేకర్‌జికి ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని గ్రామాలో కుటుంబాతో ఆత్మీయ సంబంధాున్నాయి.

వారు తెలుగు లిపిని నేర్చుకున్నారు. మరాఠీ నుండి కొన్ని రచనలను తెలుగులోకి అనువదించారు. గో.నీ.దాండేకర్‌ మరాఠీలో నవల రూపంలో రాసిన సంఘ స్థాపకు డాక్టర్‌ హెడ్గేవార్‌ జీవిత చరిత్రను హల్దేకర్‌జి ‘పెను తుఫానులో దీపస్తంభం’ పేరుతో తెలుగులోకి అనువదించారు. శ్రీమతి మృణాళినీ జోషి మరాఠీలో రచించిన శ్రీ గురూజీ గోళ్వాల్కర్ జీవితాన్ని ‘ఓం రాష్ట్రాయ స్వాహా’ పేరుతో తెలుగులోకి అనువదించారు. డాక్టర్‌ శరద్‌ హేబాల్కర్ మరాఠీలో రచించిన బాలాసాహెబ్‌ దేవరస్‌ జీవిత చరిత్రను 2012లో తెలుగులోకి అనువదించి ప్రచురింపచేశారు. ఆ తరువాతనే ఆ గ్రంథం హిందీ తదితర భాషలోకి అనువదింపబడిరది.

2013లో మరో రెండు పుస్తకాను తెలుగు వారికి అందించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో సంఘ ప్రగతిలో ఆత్మీయ జ్ఞాపకాలు ’, ‘సద్గురు సమర్ధ రామదాసు’ అనే ఈ పుస్తకాు స్వల్ప వ్యవధిలోనే పునర్ముద్రణ పొందినవి.

2010 ఫిబ్రవరిలో సహస్ర పూర్ణచంద్ర దర్శనోత్సవం శంభాజి నగర్‌లో నిర్వహింపబడినది. మాననీయ సుదర్శన్‌జి (పదవీముక్తులైన సర్‌సంఘచాక్‌) తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2011 లో వారి సొంతూరు హల్దాలో వారికీ పిత్రార్జితంగా వచ్చిన యావదాస్తిని సంఘానికి ఇచ్చేశారు.

గత కొద్ది రోజుగా శ్వాసకోశ సంబంధమైన వ్యాధుకు గురియై , చికిత్స తీసుకొన్నారు.

నేత్రదానం చేయాలనే వారి కోరిక మేరకు మరణానంతరం వారి కార్నియాను ‘వాసన్‌ ఐ బ్యాంక్‌’ వారు తీసుకున్నారు.

రేపు (24.2.2017) ఉదయం 10 గంటకు అంబర్‌పేటలోని స్మశానవాటికలో స్వర్గీయ హల్దేకర్‌జి భౌతిక కాయానికి అంత్యక్రియు జరుగుతాయి.