Home News ముగిసిన అఖిల భారతీయ కార్యకారిణి మండలి సమావేశాలు

ముగిసిన అఖిల భారతీయ కార్యకారిణి మండలి సమావేశాలు

0
SHARE
File Photo

బాధ్యతలలో మార్పులు

ప్రతి సంవత్సరం జరిగే అఖిల భారతీయ కార్యకారిణి మండలి సమావేశాలు ఈ ఏడాది బెంగళూరులో (మార్చ్ 14) జరిగాయి. ఇందులో వివిధ అంశాల గురించి చర్చ జరిగింది. అఖిల భారత, క్షేత్ర స్థాయి బాధ్యతలలో కొన్ని మార్పులు కూడా ఈ సమావేశాలలో ప్రకటించారు.

శ్రీ సునీల్ అంబేకర్ ఇక నుంచి అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ గా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు అంబేకర్ అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ప్రముఖ్ గా ఉన్నారు. ఇప్పటికే ప్రచార విభాగంలో సహ ప్రముఖ్ గా ఉన్న శ్రీ నరేంద్ర ఠాకూర్ తో పాటు సునీల్ కూడా సహ ప్రచార ప్రముఖ్ గా ఉంటారు. అలాగే ఇప్పటి వరకు దక్షిణ మధ్య క్షేత్ర (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలు) ప్రచారక్ గా ఉన్న శ్రీ ఏలే శ్యామ్ కుమార్ ఇకమీదట ధర్మజాగరణ అఖిల భారత సహ సంయోజక్ బాధ్యతలు నిర్వహిస్తారు. శ్రీ సుధీర్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ గా వ్యవహరిస్తారు. ఇప్పటివరకు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ లో బాధ్యతలు నిర్వహించిన శ్రీ రఘునందన్ ఇక నుంచి విద్యభారతిలో పనిచేస్తారు. దక్షిణ క్షేత్ర (తమిళనాడు, కేరళ)ప్రచారక్ గా శ్రీ సెంథిల్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఉత్తర పశ్చిమ క్షేత్ర ప్రచారక్ గా శ్రీ నింబారాం వ్యవహరిస్తారు. దక్షిణ, దక్షిణ మధ్య క్షేత్ర గ్రామవికాస పనిని శ్రీ స్థానుమలయన్ పర్యవేక్షిస్తారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here