Home News పాట్నా వరద ముంపుప్రాంతాల్లో ఆర్.ఎస్.ఎస్ సహాయక కార్యక్రమాలు

పాట్నా వరద ముంపుప్రాంతాల్లో ఆర్.ఎస్.ఎస్ సహాయక కార్యక్రమాలు

0
SHARE

బీహర్ వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు తమ సేవా, సహాయక కార్యక్రమాలు విస్తృతం చేసారు. పాట్నాసమీపంలోని వరద తాకిడి ప్రాంతాల్లో ప్రతిరోజూ వీలాది మంది స్వయంసేవకులు నిర్విరామంగా వరదభాదితులకు సేవ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 కుటుంబాలను వరద తాకిడి నుండి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూత్ నాథ్ రోడ్, మున్నాచౌక్, డాక్టర్స్ గోలంబార్, వైశాలి గోలంబార్ ప్రాంతాలలో వరద భాదితుల కోసం తాత్కాలిక పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు.

150 మందికి పైగా స్వయంసేవకులు 12 బృందాలుగా ఏర్పడి వరద ముంపు ప్రాంతాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వీటిలో 10 బృందాలు అవసరమైన వారికి, సహాయపడే నిత్యావసర వస్తువులు పంచుతున్నారు. పదివేలకు పైగా ఆహారపొట్లాలు, నాలుగు వేలకుపైగా రొట్టెలు, రెండువేలకు పైగా పాల ప్యాకెట్లు భాధితులకు అందించారు. గడచిన రెండు రోజులలో స్వయంసేవకులు అవసరమైనవారికి 100 ప్యాకెట్ల కొవ్వొత్తులు,500 ప్యాకెట్ల పప్పుదినుసులు, 10 పెద్దడబ్బాలలో బిస్కట్లు    అందించారు. మిగిలిన 2 బృందాలు విధిగా ఇతర సహాయక కార్యక్రమాలు  చేపడుతున్నారు.

వందలాది మంది స్వయంసేవకులు రోడ్డు మార్గంలో వాహనాలు కదిలేందుకు ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరిస్తున్నారు.

పాట్నాలోని చాలాప్రాంతాలలో వరదనీరు తగ్గుముఖం పట్టిందని ఆరెస్సెస్ బీహార్ ప్రాంత ప్రచార్ ప్రముఖ్ రాజేష్ పాండే తెలిపారు. వరదనీరు తగ్గడంతో అంటువ్యాధులు ప్రబలే  అవకాశం  ఉన్నందున ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్.ఎస్.ఎస్ తాత్కాలిక ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేసి డాక్టర్లతో ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించడమే కాకుండా, అవసరమైన మందులను కూడా అందిస్తున్నదని ఆయన తెలియజేశారు.

వరద బాధితుల సహాయం కోసం ఆర్.ఎస్.ఎస్ సహాయక కేంద్రం ఏర్పాటు చేసిందని, సహాయక కేంద్రం ఫోన్  నంబర్ ను సంప్రదించినవారికి తక్షణ సహాయం అందించబడుతుందని రాజేష్ పాండే తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here