Home News దివ్యాంగుల సాధికారతే సక్షమ్‌ ‌లక్ష్యం

దివ్యాంగుల సాధికారతే సక్షమ్‌ ‌లక్ష్యం

0
SHARE

   అంతర్జాతీయ దివ్యాంగుల‌ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతోంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్స‌హించ‌డానికి ఈ దినోత్స‌వం పాటిస్తారు.
దివ్యాంగుల‌ సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడంకోసం 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలై, 1998 నుండి ప్రతి ఏటా దివ్యాంగుల‌కు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. దివ్యాంగుల‌కు సమాన అవకాశాలు, హక్కులు కలిపించి వారందరిని సమాజ అభివృద్ధిలో భాగం చేయాలనే లక్ష్యంతో 1976లో ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ దివ్యాంగుల‌ల సంవత్సరం గా ప్రకటించింది. అలాగే, 1983 నుండి 1992 వరకు ఐక్యరాజ్య సమితి దివ్యాంగుల‌ల దశాబ్దంగా ప్రకటించింది.

    దివ్యాంగు‌లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల‌నే ల‌క్ష్యంతో “సక్షమ్‌” అనే సంస్థ నిరంత‌రం కృషి చేస్తోంది.

     ‘సక్షమ్‌ (‌సమదృష్టి క్షమత వికాస ఏవం అనుసంధాన మండలి) అనేది గుర్తింపు పొందిన జాతీయ స్వచ్ఛంద సంస్థ. నాగపూర్‌లో 2008లో ప్రారంభించబడినది. దివ్యాంగుల సాధికారికత కోసం ఉద్దేశింపబడినది. పరిశోధన, ఉద్యోగ, న్యాయ, క్రీడా, సాంస్కృతిక రంగాలలో వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. ..

దీని కోసం జాతీయ మరియు రాష్ట్ర స్థాయిల్లో అనేక కార్యశాలలను (workshop), సమీక్షలను నిర్వహించడమే కాక అనేక విద్యా, వైద్య సంబంధిత ప్రాజెక్టులను దివ్యాంగుల అభివృద్ధే లక్ష్యంగా నిర్వహిస్తోంది.

దృష్టి బాధితులు, అంగవైకల్యం, బుద్ధి మాంద్యం, బధిరత. మానసిక వైకల్యం, రక్త సంబంధిత వైకల్యం, కుష్టు వ్యాధి మొదలైన 7 అంశాల బాధితుల విద్య, వైద్య, ఆత్మ విశ్వాసం, సాంఘిక అభివృద్ధి కోసం పని చేస్తుంది.

సక్షమ్‌, ‌వివిధ పాఠశాలలు, పల్లెలలో ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నది. వీటి ద్వారా కంటి చూపు, మాట, వినికిడి లోపాల వంటి వాటిని ముందుగానే కనుగొని అరికట్టవచ్చు. దివ్యాంగులు ఈ శిబిరాల ద్వారా ఉచిత సేవలను పొందు తున్నారు. సెలబ్రల్‌ ‌పాల్సీ, ఎల్‌ ఏ ‌పి, మెల్లకన్ను వంటి అనేక కంటి సంబంధిత వ్యాధులకు దిద్దుబాటు శస్త్రచికిత్సలను అందిస్తోంది. కంటి చూపును మెరుగు పరిచే విజన్‌ ఎన్‌ ‌హన్స్మెంట్‌ ‌సెంటర్‌ ‌ను సైతం నిర్వహిస్తోంది.

దివ్యాంగుల ఆర్థిక సాధికారికత నిమిత్తం నైపుణ్యాభివృద్ధి సెంటర్లను, వృత్తి విద్యా ట్రైనింగ్‌ ‌సెంటర్లను, చిన్న తరహా ఉత్పత్తి కేంద్రాలను నిర్వహిస్తోంది. దివ్యాంగ సంగీత కళాకారుల కోసం ప్రారంభించిన ప్రాజెక్ట్ ‘‌స్వరాంజలి’. ఉద్యోగ, ఉపాధి మార్గదర్శక వర్క్‌షాపులను నిర్వహిస్తోంది. సంస్థ కార్యకలాపాలకు సహకరిస్తున్న వివిధ వ్యాపార వేత్తలు ఉపాధిఅవకాశాలను కూడా మెండుగా కల్పిస్తున్నారు.

దివ్యాంగుల కోసం జరుగుతున్న ఈ సమగ్ర ప్రయత్నంలో వైకల్య నివారణ, ముందుగానే వైకల్యాల గుర్తింపు మరియు త్వరితగతిన చర్యలు చేపట్టడం వంటివి విధాయక కార్యక్రమాలుగా సక్షమ్‌ ‌ముందుకు సాగుతోంది.

దివ్యాంగుల సాధికారికత కోసం అవసరమైన న్యాయ సలహాలను సక్షమ్‌ అం‌దిస్తోంది. జాతీయ పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలతో సహా అన్ని ప్రజాస్వామ్య సంస్థలలో దివ్యాంగులకు తగినంత ప్రాతినిధ్యం కల్పించడం, దివ్యాంగుల చట్టాలను అనుసరించి విధిగా విద్య,ఉద్యోగ రంగాలలో 4% కేటాయింపుల అమలుకు తోడ్పడటం వంటివి వాటిలో ముఖ్యమైనవి.

జిల్లా స్థాయిలో సక్షమ్‌ ‌దివ్యాంగ సేవా కేంద్రాలను నడుపుతున్నది. వీటిద్వారా వికలాంగ ధ్రువీకరణ పత్రాలను, పెన్షన్లు, వికలాంగుల పకరణాలు మరియు పరికరాలను DDRC ద్వారా పొందేలా చేయడం మరియు ఇతర ప్రయోజనాలను లబ్ధిదారులకు చేకూర్చడం ఈ కేంద్రాల ముఖ్య ఉద్దేశం.

దివ్యాంగుల అవసరాలను CCPD లేదా కమిషనర్‌ ‌దృష్టికి తీసుకొని వెళ్లి తక్షణమే నిర్ధారిత చర్యలు చేపట్టడంలో సక్షమ్‌ ‌సహాయపడుతుంది. ప్రత్యేక పాఠశాలలు మరియు వైద్య సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం ఈ కేంద్రాల ముఖ్య కార్యాచరణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here