Home News సేవాభారతి ఆధ్వ‌ర్యంలో కోవిడ్ హెల్ప్‌లైన్ సెంట‌ర్

సేవాభారతి ఆధ్వ‌ర్యంలో కోవిడ్ హెల్ప్‌లైన్ సెంట‌ర్

0
SHARE

దేశ వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో కోవిడ్ సంబంధిత వైద్య సలహాల కోసం సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో హెల్ప్‌లైన్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 21 నుంచి ఉదయం 8 గం నుంచి సాయంత్రం 6గం ల వరకు ఐ.సి.ఎం.ఆర్ మార్గదర్శకాల ప్రకారం వైద్యులు వైద్య సలహాలు, సూచనలు అందిస్తారు. క‌రోనా ల‌క్ష‌ణాలున్న వారు ఇంటి వ‌ద్ద‌నే ఉంటూ హెల్ప్‌లైన్ నంబ‌ర్ 040 4821 3100 కు కాల్ చేసి వైద్య స‌ల‌హాలు, సూచ‌న‌లు పొంద‌వ‌చ్చు. క‌రోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్ర‌తీ ఒక్క‌రూ ఇంట్లోనే ఉంటూ “కరోనా” సంబధిత చికిత్స పొంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌నే ఉద్దేశంతో సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో ఈ హెల్ప్లైన్ ను ఏర్పాటు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here