Home News వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా సేవా భార‌తి

వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా సేవా భార‌తి

0
SHARE

గ‌త 10 రోజులుగా తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. నీటి ఉదృత అధికమ‌వ‌డంతో అనేక చోట్ల వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇండ్ల‌లోకి నీరు చేరి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది.

ఖ‌మ్మం జిల్లా పినపాక, కొత్తగం, చెర్ల, భద్రాచలం, బూర్గంపాడుతో పాటు సుమారు 500పై గ్రామాలు 4 ప్రధాన జిల్లాలు ఖమ్మం, ఇండోర్, కరీంనగర్, వరంగల్ తీవ్రంగా ప్రభావితం చేయబడింది. ప్రభుత్వం మౌళిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నా గ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉండడంతో అన్ని చోట్లా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. సేవా భారతి బృందం సేవా శిబిరాన్ని ప్రారంభించి.. పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. భైంసా నగరంలో వలస కార్మికులకు అత్యవసర వంట సామాగ్రి అలగె భొజనం సమకూర్చింది. కొన్ని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. మొదటి దశలో ఆహారం, వసతి, దుప్పట్లు, బిస్కెట్లు, బట్టలు మొదలైన ప్రాథమిక సౌకర్యాలు అవస‌రాల‌ను అందించేదుకు సేవాభార‌తి యోచిస్తోంది.


సేవా భారతి-తెలంగాణ మొదటి దశలో 10,000 పొడి కిరాణా కిట్‌లను అందివ్వాల‌ని ప్ర‌ణాళిక చేస్తుంది. దీని ధర దాదాపు ₹1500 కిట్ ఉంటుంది. షెల్టర్ హోమ్‌తో రోజువారీ భోజన సౌకర్యాన్ని కూడా ప్రారంభిస్తుంది. వ‌ర‌ద బాధితుల‌కు సేవ‌లందించ‌డానికి, పదార్థాలు విరాళాలను అందించడానికి వ‌ర‌ద ప్రాంతాల్లో వాలంటీర్లు అవసరం ఉన్న‌ద‌ని, సహాయం కోసం సిద్ధంగా ఉండమని సేవాభార‌తి తెలంగాణ అభ్యర్థిస్తోంది.

DONTE HEAR : https://www.sevabharathi.org/donate-for-telangana-floods