Home News నిస్వార్ధ సేవ ద్వారానే దేశ నిర్మాణం – మాజీ సి బి ఐ జాయింట్ డైరెక్టర్...

నిస్వార్ధ సేవ ద్వారానే దేశ నిర్మాణం – మాజీ సి బి ఐ జాయింట్ డైరెక్టర్ శ్రీ వి వి లక్ష్మి నారాయణ

0
SHARE

నిస్వార్థ సేవ కార్యక్రమాల ద్వారానే దేశ నిర్మాణం జరుగుతుందని, ముక్తి కొరకు సేవ అనే ఆలోచన పద్దతి భారతీయ సంస్కృతిలోనే నిగుడంగా ఉందని, సామజిక మార్పుకు సేవను మాధ్యమంగా ఎంచుకోవాలని, మనలోని వ్యక్తిగత స్వార్ధాన్ని వదిలి సమాజం గురుంచి ఆలోచిస్తే సేవ కార్యక్రమంలో పలు పంచుకున్నపుడే భవ్యమైన భారత దేశ నిర్మాణం జరుగుతుందని మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మి నారాయణ అన్నారు.

హన్మకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాల ఆడిటోరియం 9 సెప్టెంబర్ నాడు సేవాభారతి-వరంగల్ అధ్వర్యంలో నిర్వహించిన “జాతి నిర్మాణంలో సేవ-మన పాత్ర” అనే అంశం పై జరిగిన సెమినార్ లో శ్రీ లక్ష్మి నారాయణ ముఖ్య అతిదిగా పాల్గొని  ప్రసంగించారు.

సేవాభారతి-వరంగల్ అధ్యక్షులు డా కాటం రామ్కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అతిదిగా శ్రీ టి నరసింగా రెడ్డి, ఐఎంఎం తెలంగాణ అధ్యక్షులు, డా ఏ రాంకిషన్, డ్రగ్స్ ఉప నియంత్రణ అధికారి,కోల్ కతా, భారత ప్రభుత్వం, తాల్ల మల్లేశం, తాల్ల పద్మావతి విద్యా సంస్థల చైర్మన్, శ్రీ ఎక్క చంద్రశేఖర్, అర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సేవ ప్రముఖ్, శ్రీ భారత్ అమోల్, సేవాభారతి తెలంగాణ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.

ఈ సంద్బర్బంగా వివి లక్షి నారాయణ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సేవాభారతి చేస్తున్న సేవ కార్యక్రమాలు నిజంగా అభినందనీయమన్నారు.  కష్టాలలో ఉన్న వారని చూసినపుడు హృదయం ద్రవించాలని అప్పుడే సేవ చేయాలనే సంకల్పం నిర్మాణం అవుతుందన్నారు. సకారత్మకమైన మార్పు సమాజంలో తీసుకొని రావాలంటే సేవ చేయాలనే తపన ప్రతి వ్యక్తి లో వెళ్ళువేత్తలన్నారు. భారతీయ పరంపరలో వ్యక్తి నలుగు ధర్మాలు తప్పక నిర్వహించాలని అయన పేర్కొన్నారు. మనిషి సంపూర్ణ జీవితం గడపాలంటే సేవను ఎంచుకోవలన్నారు. సేవా కార్యక్రమాలు చేసే ఉద్యమకారులు నేటి సమాజానికి అవసరమన్నారు. ఇటీవలే సంభవించిన కేరళ వరదలకు పాశ్చాత్య దేశాలు ఆర్థిక సహకారం అందిస్తామని వచ్చినప్పటికీ మన దేశ ప్రజలు నిరాకరించి తామే స్వయంగా సేవా కార్యక్రమాలకు స్వీకారం చుట్టి కేరళను ఆదుకున్న ఆపన్నహస్తాలు ఈ దేశ వాసులు కావడంలో మనలో ఉన్న సేవా దృక్పథానికి నిదర్శనమన్నారు.

అనాధ బాల బాలికలకు “ఆకాంక్ష” సంస్థ ద్వారా విద్యాబుద్దులు నేర్పుతున్న ముంబై మహిళా షహీన్ మిస్త్రీ, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం ద్వార లక్షలాది మంది సఫాయి కర్మచారులలో అత్మభిమానాన్ని ప్రసాదించిన బిందేశ్వర్ పాఠక్, జైపూర్ లోని కృత్రిమ పాదాలను రూప కల్పనా చేసి దివ్యాంగులకు పునర్జన్మ ప్రసాదించిన పిసి సేథ్, రామచంద్ర శర్మ, లక్షలాది మందికి నిత్యాన్ని దానం చేసిన డోక్క సీతమ్మ, వేలాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవాభారతి లాంటి సంస్తలు, వ్యక్తులు సేవా చేసే వారికి అధర్శనీయులన్నారు.

సేవకు ప్రతి రూపంగా అనాది కాలం నుండి  మనం హనుమంతుడుని కీర్తుస్తున్నామన్నారు. సేవావ్రతులకు హనుమంతుడే అధర్శమన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు వినాయక దామోదర్ సావర్కర్ జన్మించినపుడే దేహాన్ని సంతరించుకున్నామని, మరణించాక దేవుడి వద్దకు వెళ్తామని దేహం దేవుడి మద్య దేశం ఉందన్న విషయం, అ దేశానికి సేవా చేయాలన్న సంకల్పం మనుషులలో ఉండాలని సూచించేవారన్నారు.

శ్రీ ఏక్కా చంద్రశేకర్, అర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్, మాట్లాడుతూ సేవా భారతి దేశ వ్యాప్తంగా ఒక లక్ష్యా డెబ్బై ఐదువేల కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సమాజ సహకారం తోనే ఈ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ లో 18 వసతి గృహాలను నిర్వహిస్తూ విద్యార్థులలో జాతీయ వాదాన్ని సేవ భావాన్ని కల్పిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో  నగరంలోని పుర ప్రముఖులు విద్యావేత్తలు, డాక్టర్లు , న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, కళాశాల విద్యార్థిని, విద్యార్తులు పాల్గొన్నారు.