Home News పాకిస్తాన్ లో మైనారిటీ ముస్లింలపై మెజారిటీ ముస్లింల వివక్ష

పాకిస్తాన్ లో మైనారిటీ ముస్లింలపై మెజారిటీ ముస్లింల వివక్ష

0
SHARE
పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి ముస్లింలు (సున్ని, షియా) ఇద్దరూ భారత దేశ విభజనకు మద్దతు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం పాకిస్థాన్ లోనే కాకుండా అనేక ఇస్లామిక్ దేశాల్లో సున్ని, షియా రెండు వర్గాల మధ్య తీవ్ర వైవిధ్యం నెలకొంది…
సున్నీ మెజారిటీ పాకిస్తాన్‌లో షియా ముస్లింలను హింసించడం కొత్త విషయమేమి కాదు.  పాకిస్తాన్ ముస్లింలలో 20% ఉన్న షియాలు మొహర్రం  ఊరేగింపుల సమయంలో తరచుగా లక్ష్యంగా ఉంటారు.  2013 నుండి షియాపై హింసలో సాధారణ క్షీణత ఉన్నప్పటికీ, వివక్ష పరమైన దాడులు దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్ 6న పాకిస్తాన్ లోని కైబెర్ పాఖ్ తుంఖ్వా అనే రాష్ట్రంలోని కొహాట్ నగరంలో షియా వర్గానికి చెందిన కైజర్ అబ్బాస్ అనే  దుకాణదారుడిని కొంతమంది దుండగులు అతని దుకాణం లోని వచ్చి తుపాకితో కాల్చి చంపారు.  ఈ హత్య వెనుక సున్ని మద్దతుదారు అయిన “డియోబంది” అనే ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు సమాచారం.
సెప్టెంబర్ 11న కరాచీలో వేలాది మంది సున్ని ఉగ్రవాదులు షియా వ్యతిరేక నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. షియా వ్యతిరేక గ్రూపులైన సిపా – ఏ – సహబా, తెహ్రిక్ లాబ్ బాయిక్ అనే ఉగ్రవాద సంస్థలు ఈ అల్లర్లకు నాయకత్వం వహిస్తున్నాయి.  ఈ అల్లర్లకి సంబంధించిన కొన్ని వీడియోలు బయటకి వచ్చాయి.. అందుకో సున్నిలు ఉగ్రవాద జెండాలు ఊపుతూ, షియా కాఫిర్( అవిశ్వాసులు) అంటూ షియా వ్యతిరేక నినాదాలు చేస్తున్నట్టు ఉంది. మరొక వీడియోలో షియా వర్గీయులు అందరూ పాల్గొన్న ఒక వేడుకలో సిఫా సహాబా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులు షియా లపై రాళ్లు రువ్వుతున్నట్టు కనబడుతోంది.
    ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ లో మైనారిటీలుగా ఉన్న షియాలపై సున్ని వర్గానికి చెందిన వారు వేధింపులకు గురి చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని షియా వర్గీయులు పలువురు తమ బాధని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
సహారా కజ్మీ అనే షియా వర్గానికి చెందిన వ్యక్తి ట్విట్టర్ లో తన బాధను పంచుకున్నాడు. “తను అరేండ్ల వయసున్నప్పుడు కైబెర్ పాఖ్ తుంఖ్వా అనే ప్రాంతంలో తన ఇంటి తో పాటు మరో 12 మంది షీయాల ఇండ్లను సున్ని వర్గీయులు తగులబెట్టినట్టు తెలిపాడు.
సైమ్ రిజ్వి అనే మరొక వ్యక్తి పాకిస్తాన్ స్నేహితులతో కలిసి జర్మనీలో ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న వివక్షతను ఇలా పేర్కొన్నాడు. ” నేను జర్మనీ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ కు చెందిన వాళ్ళందరం ఒక హాస్టల్ లో ఉండే వాళ్ళం.  అక్కడ సున్ని వర్గీయులు నా పై వివక్ష చూపే వారు.  కలిసి తినే వారు కాదు. నేను చేసిన వంటలు కూడా ముట్టుకునేవాళ్లు కాదు.  నాతో కలిసి నమాజ్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు కాదని, దీంతో నేను ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది” అని తన బాధని ట్విట్టర్ లో వ్యక్తం చేశాడు.
షియా వర్గానికి చెందిన సారా బి హైదరి అనే జర్నలిస్ట్ తను పాఠశాలలో ఉన్నప్పుడు  తనతో పాటు మరో షియా విద్యార్థిని, “మీరు అంటరాని వాళ్ళని, మురికి ప్రజలని” వివక్ష చూపుతూ  సున్నీలు అవమానించే వారని, ఇదే విషయాన్ని టీచర్ కి  చెప్తే ‘మీరు ముస్లిమేతరులు అని మీతో ఇలాగే వ్యహరిస్తారని చెప్పాడని’ ఆమె తన అవేదను ట్విట్టర్ లో వ్యక్తం చేసింది.
వాసిఫ్ అనే మరో వ్యక్తి తను పాఠశాలలో ఉన్నప్పుడు తాను షియా అని ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడే వాడిని అని, షియలు ఎదుర్కొంటున్న వివక్షతను తాను ఎప్పుడూ బాధపడేవాడిని అని తెలిపాడు.
ఇలా అనేక మంది షియా వర్గీయులు సున్నిలు తమపై చూపిన వివక్షతను తమను పెట్టిన ఇబ్బందులను  గుర్తుచేసుకుంటూ ట్విట్టర్లో తన బాధని వెలిబుచ్చారు.
Source : opindia