Home Press Release అమర్ నాథ్ యాత్ర సందర్బంగా వివిధ సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారికి ఆర్.ఎస్.ఎస్ శ్రద్ధాంజలి

అమర్ నాథ్ యాత్ర సందర్బంగా వివిధ సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారికి ఆర్.ఎస్.ఎస్ శ్రద్ధాంజలి

0
SHARE
అఖిలా భారత ప్రచార ప్రముఖ్ డా. మన్మోహన్ వైద్య విడుదల చేసిన పత్రికా ప్రకటన

ప్రపంచ వ్యాప్తంగా హిందువులకు శ్రీ బాబా అమర్ నాథ్ యాత్ర చాలా పవిత్రమైనది. ప్రకృతి పరమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా హిందువులు ఈ యాత్రను చేస్తారు. వందల సంవత్సరాలుగా నిరంతరంగా ఈ యాత్ర ప్రతి ఏడాది జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం యాత్రికుల సంఖ్య పెరుగుతూనే ఉండడం వారిలో యాత్ర పట్ల ఉన్న శ్రద్ధ, దృఢ సంకల్పం తెలియజేస్తాయి.

ఈ సంవత్సరం తీవ్రవాదుల దాడి, బస్సు లోయలో పడిపోవడం వంటి దురదృష్టకర సంఘటనల్లో కొంతమంది యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం విచారించదగిన విషయం. చనిపోయిన యాత్రికులకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శ్రద్ధాంజలి ఘటిస్తోంది. మృతుల కుటుంబాలకు సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తంచేస్తోంది. దివంగతుల ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థన.

జమ్ము,

18 జులై , 2017

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here